Home / జన సేన / తిత్లీ బాధితుల‌కి జ‌న‌సేన ఊర‌ట‌.. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో చురుగ్గా..

తిత్లీ బాధితుల‌కి జ‌న‌సేన ఊర‌ట‌.. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో చురుగ్గా..

చేతిలో అధికారం లేదు.. చేతినిండా డ‌బ్బు లేదు.. కానీ చేయాల‌న్న మ‌న‌సు మాత్రం ఉంది.. నాయ‌కుడు అందించిన స్ఫూర్తి గుండెల నిండా ఉంది.. ఆ స్ఫూర్తి ప్ర‌తి తెలుగు వాడిని తాకింది.. బిక్కు బిక్కు మంటూ బ‌తుకుతున్న కాలం వెళ్ల‌దీస్తున్న బాధితుల‌కి ఆస‌రాగా నిలిచింది.. తిత్లీ తుపాను విధ్వంసం జ‌రిగిన ప్రాంతంలో గ‌డ‌చిన రెండు వారాలుగా జ‌న‌సేన అధినేత ఇచ్చిన పిలుపుతో జ‌న‌సైన్యం చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల స్థాయిని చెప్పే మాట ఇది.. ఉత్త‌రాంధ్ర.. కోస్తాంధ్ర‌.. రాయ‌ల‌సీమ‌.. తెలంగాణ‌.. దేశం.. విదేశం.. ఒకే ఒక్క పిలుపుతో మూల మూల‌ల ఉన్న జ‌న‌సైనికుల్లో స్పందించారు.. అది ఏ స్థాయిలో అంటే ఓ టాప్ హీరో(రామ్‌చ‌ర‌ణ్‌).. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇచ్చిన హామీ కోసం 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకోగా., జ‌న‌సైనికులు రంగంలోకి దిగారు.. ప్ర‌భుత్వం నుంచి ఇచ్చిన బియ్యం, పప్పు ఉప్పులు అందాయో లేదో తెలియ‌దు గానీ., జ‌న‌సైనికులు చేసిన సాయం మాత్రం తిత్లీ ప్ర‌భావిత ప్రాంతాల్లోని దాదాపు ప్ర‌తి గ్రామానికీ అందింది.. ప‌లానా గ్రామంలో ప్ర‌జ‌లు ఇబ్బందిలో ఉన్నారు.. వారికి తిన‌డానికి తిండి కూడా లేదు అన్న వార్త చెవిన ప‌డితే చాలు విదేశాల్లో ఉన్న జ‌న‌సైనికులు కూడా స్థానిక కార్య‌క‌ర్త‌ల‌తో క‌ల‌సి, ఆ గ్రామాల్లో వాలిపోయి అక్క‌డ బాధితుల‌కి క‌డుపు నింపే ప‌నిని భుజాన వేసుకున్నారు..

తిత్లీ విధ్వంసం సృష్టించిన మ‌రుస‌టి రోజు నుంచే ప్ర‌భావిత ప్రాంతాల్లో ఆ జిల్లాకి చెందిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు బాధితుల‌కి బాస‌ట‌గా నిలిచే ప‌నిని భుజాన వేసుకున్నారు.. స్థాయిని భ‌ట్టి గ్రామాల్లో ఆక‌లితో అల‌మ‌టిస్తున్న బాధితుల‌కి ఆహారం, నీరు అందిస్తూ వ‌చ్చారు.. జ‌న‌సేనాని ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా సైతం సిక్కోలు జిల్లాకి చెందిన స్థానిక జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల స‌హాయక చ‌ర్య‌లు కొన‌సాగాయి.. తిత్లీ న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు ఆరు రోజుల పాటు 45 గ్రామాల్లో ప‌ర్య‌టించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. వెళ్లిన ప్ర‌తి గ్రామం నుంచి ఎవ‌రో ఒక‌రికి ఆ గ్రామంలో స‌మ‌స్య‌ల గురించి, వారికి సాయం చేయ‌మ‌నీ చెబుతూనే ఉన్నారు.. జ‌న‌సైనికుల‌కి కూడా ప్ర‌తి అడుగులో విజ్ఞాప‌న‌లు చేస్తూనే వ‌చ్చారు.. పార్టీ అధినేత పిలుపు అందుకున్న కార్య‌క‌ర్త‌లు ప్ర‌తి జిల్లా నుంచి క‌దిలి ముందుకి వ‌చ్చారు. . ఆయా గ్రామాల్లో ప‌ర్య‌టిస్తూ,, అక్క‌డే వంట‌లు చేసి బాధితుల‌కి అందించిన తీరు జ‌న‌సేవ ప‌ట్ల జ‌న‌సైన్యానికి ఉన్న అంకిత భావాన్ని తెలియ‌చేస్తోంది..

యూఎస్‌, యూకేతో పాటు అర‌బ్ దేశాలు, ఆసియా దేశాలు తేడా లేకుండా ప్ర‌తి జ‌న‌సైనికుడు తిత్లీ బాధితుల కోసం ముందుకి క‌దిలారు.. సిక్కోలు నుంచి నెల్లూరు, అనంత వ‌ర‌కు నాయ‌కులు సైతం తిత్లీ బాధితుల‌కి స్వ‌యంగా సేవ చేసేందుకు ముందుకి వ‌చ్చారు.. గ్రామాల్లో నిత్యావ‌స‌రాలతో పాటు దుప్ప‌ట్లు, దుస్తులు, విద్యార్ధుల‌కి పుస్త‌కాలు, పెన్నులు పంపిణీ చేశారు.. భామిని మండ‌లం బ‌త్తిలి గ్రామంలో మ‌స్క‌ట్ జ‌న‌సేన వాలంట‌రీ వింగ్ సాయం అందించిన‌ప్పుడు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఏ స్థాయిలో బాధితుల‌ని ఆదుకున్నారు అన్న సంగ‌తి అర్ధ‌మ‌య్యింది..

తూర్పు గోదావ‌రి జిల్లాకి చెందిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు తిత్లీ బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన‌ప్పుడు, తీవ్రంగా న‌ష్టం చ‌విచూసిన వ‌జ్ర‌పుకొత్తూరు, మంథ‌స మండ‌లాల్లో ప‌ర్య‌టించి, ప్ర‌తి గ్రామంలో తీవ్రంగా న‌ష్ట‌పోయిన కుటుంబాల‌ని గుర్తించి, మొత్తం 220 కుటుంబాల‌కి చేయూత‌ని అందించారు.. దాదాపు అన్ని జిల్లాల నుంచి ఎంతో కొంత సాయం తిత్లీ బాధితుల‌కి అందింది.. జ‌న‌సేన త‌రుపున అందుతున్న తిత్లీ సాయాన్ని మోనిట‌ర్ చేసేందుకు ఓ ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ని కూడా ఆ పార్టీ అధినేత ఏర్పాటు చేశారు.. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన సాయం అంతా ఒక ఎత్త‌యితే.. ఇక మీద‌ట చేసే సాయం మౌలిక వ‌స‌తులు క‌ల్పించే దిశ‌గా ఉండాల‌న్న ఆలోచ‌న కొంత మంది విదేశాల్లో ఉన్న జ‌న‌సైనికుల్లో ఉంది.. ఆ ద‌శ‌గా అడుగులు కూడా ప‌డుతున్నాయి.. ఎలాంటి అధికారం, ఆర్ధిక బ‌లం లేక‌పోయినా,, చేయాలి అన్న మ‌న‌సు ఉంటే ఎలాగైనా ప్ర‌జా సేవ చేయొచ్చు అని సిక్కోలు జిల్లాకి సంబంధించి ఇప్ప‌టికే జ‌న‌సేనాని రెండుసార్లు నిరూపించారు.. ఉద్దానం బాధితుల్ని ఆదుకోలేమ‌ని ప్ర‌భుత్వాలు చేతులు ఎత్తేసిన క్ర‌మంలో ఉద్దానానికి ఊపిరి పోసేందుకు నేనున్నానంటూ ముందుకి వ‌చ్చిన తీరు, తిత్లీ తుపాను బాధితుల‌కి సాయం చేసిన తీరు ఆ ప్రాంత ప్ర‌జ‌ల గుండెల్లో ఆయ‌న‌కి చెర‌గ‌ని స్థానం క‌ల్పించాయ‌ని చెప్ప‌వ‌చ్చు..

Share This:

938 views

About Syamkumar Lebaka

Check Also

కేంద్ర బ‌డ్జెట్ నిరాశ ప‌ర్చింది.. ఏపీ స‌ర్కారు స్ప‌ష్ట‌త తీసుకోవాలి-జ‌న‌సేన పార్టీ

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fourteen − 12 =