Home / ఎడిటోరియల్స్ / తిరుమ‌ల తీర్ధాల్లో జ‌న‌సేనుడి విహారం.. సోష‌ల్ మీడియాలో వీడియోలు ట్రెండింగ్‌..

తిరుమ‌ల తీర్ధాల్లో జ‌న‌సేనుడి విహారం.. సోష‌ల్ మీడియాలో వీడియోలు ట్రెండింగ్‌..

ఏసీ గ‌దులు.. చుట్టూ ప‌రివారం.. కావాల్సినంత క్రేజీ.. దాహం అన్న ఆలోచ‌న రాక‌ముందే క్యూ క‌ట్టే మిన‌ర‌ల్ వాట‌ర్ బాటిళ్లు.. ఏం కావాల‌న్నా క్ష‌ణాల్లో కాళ్ల ద‌గ్గ‌ర వాలిపోయేంత శ‌క్తి.. ఇవేమీ ఆయ‌న‌కి సంతృప్తినివ్వ‌లేదు.. ఓ తెల్ల‌టి పంచె.. దోవ‌తి.. ఉన్న‌ది ప‌ది మందికీ పంచ‌డం .. ప‌ది మందికీ సేవ చేయ‌డం.. వారి స‌మ‌స్య‌లు తీర్చ‌డం.. తీర్ధాలు తిర‌గ‌డం., కొండాకోన‌ల్లో సెల‌యేటిధార‌ల‌తో సేద‌తీర‌డం.. అత్యంత సామాన్య జీవితం గ‌డ‌ప‌డం.. ఇవన్నీ ఆయ‌న‌కి ఎంతో సంతృప్తినిచ్చిన అంశాలు.. అందుకే ఆయ‌న కొన్ని కోట్ల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన జ‌న‌సేనుడ‌య్యాడు..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురించి కొన్ని కొన్ని విష‌యాలు విన్న‌ప్పుడు అతిశ‌యోక్తిగా అనిపించినా., చూసిన‌ప్పుడు మాత్రం ఆయ‌న అంతే అని ఒప్పుకొక త‌ప్ప‌దు.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధి శిభిరాల్లో అయితే జ‌న‌సేనుడు వేసే అడుగులు చూసి అసూయ క‌ల‌గ‌క మాన‌దు.. మేమెందుకు ఇలా చేయ‌లేక‌పోతున్నామా అన్న ఆసూయ నాయ‌కుల్లో., మా నాయ‌కుడు ఇలా చేయ‌గ‌ల‌డా అన్న ఆలోచ‌న ఆయా పార్టీల శ్రేణుల్లో నిరంత‌రం ర‌గులుతూనే ఉంటుంది.. ఇంకా చెప్పాలంటే పైకి త‌మ నాయ‌కుల‌కి భ‌జ‌న చేసినా., లోలోప‌ల మాత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిజంగా మ‌గాడ్రా బుజ్జీ.. ఆయ‌న నిజ‌మైన నాయ‌కుడు అని ఒప్పుకునే ప‌రిస్థితులో ఎక్కువ‌.. నిజంగా గుండెల మీద చెయ్యేసుకుంటే ఆ శ‌బ్దం విన‌బ‌డుతుంది..

తాజాగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి అలిపిరి మార్గం ద్వారా సామాన్య భ‌క్తుల‌తో క‌ల‌సి న‌డిచి కొండెక్కిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. తాను వివిఐపీ అయినా ఎక్క‌డా ఆ సౌక‌ర్యాలు కోరుకోలేదు.. అంద‌రితో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా క్యూలో వెళ్లి ఆ దేవ‌దేవుని ద‌ర్శించుకున్నారు.. ఇక రెండో రోజు తిరుమ‌ల గిరుల్లోని తీర్ధాలు క‌లియ‌దిరిగేందుకు బ‌య‌టికి వ‌చ్చిన జ‌న‌సేనాని., మ‌రింత ఆక‌ట్టుకున్నారు.. మిన‌ర‌ల్ వాట‌ర్ బాటిల్ అదీ కాస్ట్‌లీది.. సీల్ ఉందా లేదా అని చూసుకుని మ‌రీ తాగే విఐపీల‌కి భిన్నంగా., ఆకాశ‌గంగ తీర్ధంలో కొండ బొరియ‌ల నుంచి వ‌చ్చే జ‌ల‌ప్ర‌సాదాన్ని ప‌దే ప‌దేయ ఆశ్వాదిస్తూ.. అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రిచారు..

ప్ర‌కృతి సిద్ధ‌మైన వ‌న‌మూలిక‌లు, వేళ్ళ‌లో ఊరుతూ వ‌చ్చే ఆ నీటి ప‌విత్ర‌త గురించి స్థానికుల నుంచి తెలుసుకున్న ఆయ‌న‌., మ‌ళ్లీ మ‌ళ్లీ ఆ నీటిని ఆశ్వాదించారు.. సుమారు 300ల‌కు పైగా ఉన్న తిరుమ‌ల తీర్ధాల వివ‌రాలు తెలుసుకుని త‌రించారు.. పంచెక‌ట్టు., దోవ‌తిలో ఆయ‌న్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయిన భ‌క్తులు, కొండ‌తీర్ధం సేవించ‌డం చూసి జ‌న‌సేనుడు నిజంగా జ‌న‌సేనుడే అని చెవులు కొరుక్కొవ‌డం క‌నిపించింది.. సామాజిక మాధ్య‌మాల్లో ఆ వీడియోలు చూసిన జ‌నం కూడా నిజంగా ఆయ‌న సామాన్యుడే., ఆయ‌న గురించి విన్న‌ది నిజ‌మే అని మాట్లాడుకోవ‌డ‌మూ వినిపిస్తోంది..

నిస్వార్ధ రాజ‌కీయాలు చేయాలంటే., నిస్వార్ధ రాజ‌కీయాల‌తో ప్ర‌జ‌ల‌కు సేవ చేయాలంటే స‌ర్వసంఘ ప‌రిత్యాగి కావాలి.. అన్నింటినీ వ‌దులుకోవాలి.. ఇదే ఆయ‌న సిద్ధాంతం.. మాట‌ల్లో కాదు చేత‌ల్లో క‌న‌బ‌డుతోందా.. అంద‌రికీ..

Share This:

3,797 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − 6 =