Home / జన సేన / తుమ్మ‌పాల షుగ‌ర్స్ స‌మ‌స్య ప‌రిష్కారానికి 6 వారాల డెడ్‌లైన్‌.. కార్మికులు-రైతుల‌కి జ‌న‌సేనుడి అండ‌.

తుమ్మ‌పాల షుగ‌ర్స్ స‌మ‌స్య ప‌రిష్కారానికి 6 వారాల డెడ్‌లైన్‌.. కార్మికులు-రైతుల‌కి జ‌న‌సేనుడి అండ‌.

40 నెల‌ల క్రితం మూత‌ప‌డిన తుమ్మ‌పాల షుగ‌ర్ ఫ్యాక్ట‌రీని జ‌న‌సేన అధినేత సంద‌ర్శించారు.. పోరాట‌యాత్ర‌లో భాగంగా అన‌కాప‌ల్లి వెళ్లిన ఆయ‌న చ‌క్కెర క‌ర్మాగారాన్ని సంద‌ర్శించి కార్మికుల‌తో స‌మావేశం అయ్యారు.. ఫ్యాక్ట‌రీ మూసివేత కార‌ణంగా జీతాలు లేక కార్మికులు ఇబ్బంది ప‌డుతుంటే ప్ర‌భుత్వం నుంచి క‌నీస స్పంద‌న కొర‌వ‌డ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు.. తుమ్మ‌పాల షుగ‌ర్స్ స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌భుత్వానికి ఆరు నెల‌ల డెడ్‌లైన్ పెట్టారు.. కార్మికుల దీన స్థితి చూసి చ‌లించిన జ‌న‌సేనాని., ఉద్యోగ సంక్షేమ నిధి కోసం రెండు ల‌క్ష‌ల రూపాయిల విరాళం అందించారు.. స‌మ‌స్య ప‌రిష్కారం కాకుంటే దీక్ష‌కు దిగ‌నున్న‌ట్టు కార్మికులు ఆయ‌న‌కు వెల్ల‌డించ‌గా., నాలుగు నుంచి ఆరు వారాలు ప్ర‌భుత్వానికి గ‌డువిద్దామ‌ని., ఈ లోపు స‌మ‌స్య ప‌రిష్కారం కాకుంటే కార్మికులు చేప‌ట్టే దీక్ష‌కి జ‌న‌సేన అండ‌గా నిలుస్తుంద‌ని హామీ ఇచ్చారు..

తుమ్మ‌పాల షుగ‌ర్స్ కార్మికుల్ని తాను క‌ల‌వ‌నున్న‌ట్టు తెలుసుకుని ముఖ్య‌మంత్రి ముందే హ‌డావిడిగా అమ‌రావ‌తిలో మీటింగ్ పెట్టార‌న్న ఆయ‌న‌., 300 కోట్ల ఫ్యాక్ట‌రీని 10 కోట్ల‌కి కాజేయాల‌ని చూస్తున్నార‌ని ఆరోపించారు..ఇలాంటి దోపిడీ కొన‌సాగిస్తే జ‌న‌సేన చూస్తూ ఊరుకోద‌ని హెచ్చ‌రించారు.. తుమ్మ‌పాల క‌ర్మాగారానికి సంబంధించి కార్మికుల‌కీ , చెరుకు రైతుల‌కి జ‌న‌సేన ఎప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని ప‌వ‌న్ భ‌రోసా ఇచ్చారు..

జ‌న‌సేనుడి ముందు స‌మ‌స్య‌ల ఏక‌రువు..

షుగ‌ర్ ఫ్యాక్టరీ కార్మికుల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు జ‌న‌సేన అధినేత వ‌స్తున్నార‌ని తెలుసుకున్న కార్మికులు, రైతులు పాట్లు ఆయ‌న ముందు వెళ్ల‌బోసుకున్నారు.. ఫ్యాక్ట‌రీపై సుమారు 17 వేల 500 కుటుంబాలు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఆధార‌ప‌డి జీవిస్తున్నాయ‌ని జ‌న‌సేనానికి తెలిపారు.. క‌ర్మాగారానికి 12 వేల మంది షేర్ హోల్డ‌ర్స్ ఉండ‌గా., మూడున్న‌రేళ్లుగా మూత ప‌డ‌డంతో అటు కార్మికులు, రైతులు దుర్భ‌ర జీవితాన్ని గ‌డుపుతున్నామంటూ వాపోయారు.. ఇలాంటి దుస్థితిలో పిల్ల‌ల‌కు తిండిపెట్ట‌లేక‌, బ‌డుల‌కి పంప‌లేక ఇబ్బందులు ప‌డుతుంటే., ఆక‌లితో ప‌స్తులంటుంటే జాలి చూపాల్సిన అధికారులు రంజాన్ దీక్ష‌లు అంటూ ఎద్దేవా చేస్తున్నారని మండిప‌డ్డారు. ఫ్యాక్ట‌రీ కోసం ఆందోళ‌న‌లు చేస్తే కేసులు పెట్టార‌ని ఆరోపించారు.. ఇప్ప‌టికే 17 మంది కార్మికులు ఆక‌లికి బ‌ల‌య్యార‌ని తెలిపారు.. కార్మికుల బ‌కాయిలు వెంట‌నే చెల్లించేలా చూడాల‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి విజ్ఞ‌ప్తి చేశారు..

స‌మ‌స్య‌పై ఇప్ప‌టికే స‌ర్కారులో క‌ద‌లిక రాగా., తుమ్మ‌పాల ఆస్తుల్ని ఎలా దోచుకోవాల‌న్న అంశం మీదే చంద్ర‌బాబు స‌ర్కారు దృష్టి సారించ‌డం.. అదే స‌మ‌యంలో త‌మ‌కు జ‌న‌సేన అధినేత అండ దొర‌క‌డంతో., ఎలాగ‌యినా త‌మ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దోరుకుతుంద‌న్న న‌మ్మ‌కాన్ని కార్మికులు-రైతులు వ్య‌క్తం చేశారు..

Share This:

996 views

About Syamkumar Lebaka

Check Also

కాకినాడ సెజ్‌లో జ‌న‌సేనాని.. బాధితుల వెత‌లు విన్న ప‌వ‌న్‌.. విత్ ఫోటో గ్యాల‌రీ..

కాకినాడ సెజ్‌..కేవీ రావు అక్ర‌మాల‌పై బాధితుల పోరాటానికి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురువారం ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు.. యూ.కొత్త‌ప‌ల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five − 1 =