Home / జన సేన / తూర్పులో ప‌వ‌న్ అడుగుపెట్ట‌క ముందే జ‌న‌సేన ప్ర‌భంజ‌నం.. గోదారి ప‌ర‌వ‌ళ్ల‌ని త‌ల‌పిస్తున్న చేరిక‌లు..

తూర్పులో ప‌వ‌న్ అడుగుపెట్ట‌క ముందే జ‌న‌సేన ప్ర‌భంజ‌నం.. గోదారి ప‌ర‌వ‌ళ్ల‌ని త‌ల‌పిస్తున్న చేరిక‌లు..

కులాల మ‌ధ్య కుంప‌ట్లు రాజేసీ., ఆ మంట‌ల్లో చ‌లికాచుకునే రాజ‌కీయాలు వేళ్లూనుకున్న నేటి వ్య‌వ‌స్థ‌లో.. కులాల్ని క‌లిపేస్తామ‌నే ఓ స‌రికొత్త ఆలోచ‌నా విధానానికి ప‌దునుపెట్టి.. అది కేవ‌లం ఆలోచ‌న మాత్ర‌మే కాదు.. క‌లిపేస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తూర్పు గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర ప్రారంభించ‌క ముందే పొలిటిక‌ల్ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నారు.. మొన్న భీమ‌వ‌రంలో వివిధ వ‌ర్గాల నాయ‌కులు, ప్ర‌జ‌లు జ‌న‌సేనుడి సిద్ధాంతాల‌కి ఫిదా అయ్యి., తెల్లా తెల్ల‌ని జెండా మోయ‌డానికి సిద్ధ‌ప‌డిపోగా., నిన్న తూర్పుగోదావ‌రి జిల్లాలో బ‌ల‌మైన వ‌ర్గానికి చెందిన బీసీలు(శెట్టిబ‌లిజ‌)లు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇవాల్టికివాళ ఎస్సీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖుల‌తో పాటు ప‌లువురు ప‌వ‌న్ సేన‌లో చేరిపోయారు..

 

తూర్పు నుంచి జ‌న‌సేన‌కి ప‌ర‌వ‌ళ్లు తొక్కే వ‌ర‌ద గోదారిని త‌ల‌పిస్తున్న చేరిక‌లు., ఆ ప్ర‌వాహపు జ‌డిలో ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌ని తుడిచిపెట్టేస్తాయ‌న్న సంకేతాల‌ను వెలువ‌రుస్తున్నాయి.. ఓ వ‌ర్గంతో పార్టీని నింపేయాలంటే ఎప్పుడో ఆ ప‌ని చేసే వాడిని అంటున్న ప‌వ‌న్‌., అన్ని వ‌ర్గాల‌ను క‌లిపి ఓ గూటి కింద‌కి ఎలా తీసుకువ‌స్తున్నాడో ప్ర‌త్య‌ర్ధుల‌కి అర్ధం కావ‌డం లేదు.. ప్ర‌స్తుతం రాష్ట్రాన్ని ఏలుతున్న అధికార‌-విప‌క్షాలు ఆయా వ‌ర్గాల‌ను విభ‌జించి పంచేసుకున్నాయి.. ప‌లానా వ‌ర్గం ఓట్లు తెలుగుదేశం పార్టీకి మాత్ర‌మే ప‌డ‌తాయి.. ఆ వ‌ర్గం ఓట్లు కేవ‌లం వైసీపీకి మాత్ర‌మే ప‌డ‌తాయి అంటూ ఓ విభ‌జ‌న రేఖ‌ని గీసేశాయి.. అయితే త‌న ఆలోచ‌నా విధానంతో., ఆ గీత‌ల్ని, కుహ‌నా రాజ‌కీయ శ‌క్తులు బ‌ల‌వంతంగా రాసిన రాతల్ని చెరిపేసిన జ‌న‌సేనాని., అందరి మ‌ధ్య అంత‌రాల్ని మాయం చేసేశారు..

ఇప్పుడు జ‌న‌సేన దెబ్బ‌కి ప‌చ్చ‌టి ప‌ల్లెల్లో ఐక్య‌తా రాగం వినిపిస్తోంది.. రాజ‌కీయాల్లో పార్టీకి ఓ కులం ఆధిపత్యం ప్ర‌ద‌ర్శించే ధోర‌ణి మారిపోయి., బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌నే ముందుంచి న‌డిచే ప‌రిస్థితులు కాన‌వ‌స్తున్నాయి.. ముఖ్యంగా కోన‌సీమ ప్రాంతంలో ఇలాంటి వాతావ‌ర‌ణం కొట్టొచ్చిన‌ట్టు క‌న‌బ‌డుతోంది.. ఇక్క‌డ మ‌రో చిత్ర‌మైన విష‌యం.. చెప్పుకోద‌గిన విష‌యం ఏమంటే., జ‌న‌సేన ప్ర‌భావం ముందు ప్ర‌జ‌లపై ప్ర‌భావం చూప‌గా., ప్ర‌జ‌ల మార్పుని గ్ర‌హించిన నాయ‌కులు సైతం మారిపోతున్నారు.. రాజ‌కీయం అంటే కేవ‌లం అధికారం అన్న ధోర‌ణి మార్చుకుని., సామాన్య కార్య‌క‌ర్త‌లుగా ప‌ని చేస్తామంటూ నాయ‌కులు సైతం జ‌న‌సేన‌లోకి త‌ర‌లివ‌స్తున్నారు..

ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు డాక్ట‌ర్ పి.పుల్లారావు చెప్పిన విధంగా., పార్టీలోకి వ‌చ్చే ఏ ఒక్క‌రికీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎలాంటి ప‌ద‌వులు ఇస్తామ‌న్న హామీలు ఇవ్వ‌డం లేదు.. అయితే మొద‌టి టిక్కెట్టు ప్ర‌క‌టించే ముందు వ‌ర‌కు ఎవ్వ‌రికీ తెలియ‌దు.. 2009లో ఆనాడు ఓ వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తి మ‌హిళ‌కి టిక్కెట్ ప్ర‌క‌టించిన వ్య‌వ‌హారం సంచ‌ల‌నం అయితే., నేటి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నిర్ణ‌యానికీ., నాటి నిర్ణ‌యానికీ పొంత లేదు.. రెండు నిర్ణ‌యాల‌కి మ‌ధ్య వున్న బేధం.. నేటి జ‌న‌సేనుడి నిర్ణ‌యం స్పాట్‌లో తీసుకున్న‌దే అయినా., ఆయ‌న ఎంచుకున్న‌ది మాత్రం గెలుపు గుర్రాన్నేన‌న్న‌ది గోదావ‌రి జిల్లాల్లో టాక్‌.. పితాని బాల‌కృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప‌ని చేసి., ఇప్పుడు జ‌న‌సేన తీర్ధం పుచ్చుకున్నారు.. పార్టీలు మారే వారికి ప్రాధాన్య‌త వుంటుందా అన్న అనుమానాలు కొంత మందిలో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. అయితే పితాని కానిస్టేబుల్‌గా ప‌నిచేసి, ఉద్యోగం వ‌దులుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.. కేవ‌లం ఆయ‌న వ‌ద్ద డ‌బ్బు లేద‌న్న కార‌ణంగానే., సీటు ఇస్తాన‌ని ఆశ చూపి ఆ పార్టీ మోసం చేసింది.. అయితే రాజ‌కీయాల‌కి డ‌బ్బు ప్ర‌ధానం కాదు.. నాయ‌కుడికి ప్ర‌జాధ‌ర‌ణ‌., ప్ర‌జ‌ల‌కి సేవ చేసే నాయ‌కుడి అవ‌స‌రాన్ని గుర్తించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మొద‌టి సీటుని చాలా గ‌ర్వంగా ఓ బీసీకి ప్ర‌క‌టించారు..

జ‌న‌సేన పార్టీలో ఇలాంటి ఖ‌చ్చిత‌మైన నిర్ణ‌యాలు ఉంటాయ‌ని తెలిసినా., ఇంకా చాలా మంది చూపు జ‌న‌సేన జెండా మీద ప‌డిన‌ట్టు స‌మాచారం.. ప‌శ్చ‌మ‌లో చివ‌రి విడ‌త పోరాట యాత్ర‌తో పాటు తూర్పు గోదావ‌రి జిల్లా యాత్ర‌లో పెద్ద ఎత్తున చేరిక‌లు ఉండనున్న‌ట్టు తెలుస్తోంది.. అధికార‌మూ లేదు.. ప్ర‌తిప‌క్ష‌మూ కాదు.. కేవ‌లం ప్ర‌జా ప‌క్షాన నిల‌చి., కులాల‌ని క‌లిపేస్తూ.. జ‌న‌బలంతో బ‌ల‌ప‌డుతున్న పార్టీ.. అదీ నేటి కుతంత్రాల‌తో కూడిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో జ‌న‌సేన మాత్ర‌మేన‌న‌డం ఏ మాత్రం అతిశ‌యోక్తి కాద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌..

Advertisement..

Share This:

5,753 views

About Syamkumar Lebaka

Check Also

స్థానిక ఎన్నిక‌ల్లోనూ జీరో బ‌డ్జెట్ -జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

రాబోయే రోజుల్లో జ‌న‌సేన పార్టీ ఓ స్ప‌ష్ట‌మైన విజ‌న్‌తో ముందుకు వెళ్తుంద‌ని సిబిఐ మాజీ జేడీ, విశాఖ ఎంపి అభ్య‌ర్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × one =