Home / జన సేన / తూర్పు గోదావ‌రిలో మారుతున్న స‌మీక‌ర‌ణాలు.. పోలిటిక్స్‌లో జ‌న‌సేన ప్ర‌కంప‌న‌లు..

తూర్పు గోదావ‌రిలో మారుతున్న స‌మీక‌ర‌ణాలు.. పోలిటిక్స్‌లో జ‌న‌సేన ప్ర‌కంప‌న‌లు..

img-20161216-wa0053 img-20161216-wa0056 img-20161216-wa0058

ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలో జ‌న‌సేనానికి ఉన్న క్రేజీ వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు.. ఆయ‌న క‌ను సైగ‌ల‌తో జన‌సేన జెండా ప‌ట్టిన వారి సంఖ్య లెక్క‌పెట్ట‌లేం.. కుల‌, మ‌త‌, వ‌యో బేధాలు మ‌ర‌చి అంతా సేనాని వెనుక సైన్యంగా మారిపోయారు.. నిన్న, మొన్న‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌, ఆయ‌న పార్టీకి పెరిగే క్రేజీపై పెద్ద‌గా ఎవ‌రికీ బెంగ‌లేదు.. కానీ ఎప్పుడైతే అనంత స‌భ‌లో ఆయ‌న 2019 ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించారో., అప్పుడు అస‌లు కాక మొద‌లైంది.. రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో పెను మార్పులు సంభ‌వించాయి.. ముఖ్యంగా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ఈ మార్పు స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతూ వ‌చ్చింది.. ప‌వ‌ర్‌లో ఉన్న‌వారు., లేని వారు కూడా త‌మ భ‌విష్య‌త్తుపై బెంగ‌లో ప‌డిపోయారు..

ఇదంతా శాంపిల్ అయితే., తూర్పుగోదావ‌రి జిల్లాలో సినిమా ట్రైల‌ర్‌తో పాటు టైటిల్స్ కూడా మొద‌ల‌య్యాయి.. యువ‌త స్వ‌చ్చందంగా జ‌న‌సేన కోసం ముందుకు క‌దిలింది.. క్షేత్ర‌స్థాయి నుంచి త‌మ బ‌లాన్ని మ‌రింత పెంచుకునే దిశ‌గా వ్యూహాలు ర‌చించే ప‌నిని చేప‌ట్టాయి.. చాప‌కింద నీరులా జ‌న‌సేన‌ని బ‌లోపేతం చేయ‌డం ఎలా అనే అంశంపై దృష్టి సారించింది.. పార్టీ త‌మ‌కు ఏమీ ఇస్తుంద‌నే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి పార్టీ కోసం తాము ఏం చేయ‌గ‌లం అనే అంశాల‌పై దృష్టి సారించారు.. బూత్ స్థాయిలో పార్టీని ప‌టిష్ట ప‌రిచేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి అనే అంశాల‌పై ప్రాంతాల వారీగా చ‌ర్చ‌లు మొద‌లు పెట్టారు..

తుని డివిజ‌న్‌లోని సూరవ‌రం గ్రామంలో శుక్ర‌వారం జ‌న‌సైన్యం పై అంశాల‌పై చర్చించింది.. పార్టీ ప‌టిష్ట‌త కోసం ఆ డివిజ‌న్ నుంచి ముందుకు వ‌చ్చిన యువ‌కులు త‌మ అభిప్రాయాల‌ను ఒక‌రితో ఒక‌రు పంచుకున్నారు.. ఒక‌రికి ఒక‌రు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చుకున్నారు.. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి మీటింగ్‌లు జ‌ర‌పాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.. జ‌న‌సైన్యం నిర్వ‌హించిన ఈ భేటీ ఒక్క తునిలోనే కాక‌., తూర్పుగోదావ‌రి జిల్లా వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.. జ‌న‌సేన వ్యూహం ఏంటి..? ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఏఏ అంశాల‌పై చ‌ర్చించారు..? పార్టీ ప్ర‌స్తుత బ‌లం ఎంత‌..? యువ‌కులంతా క‌లిసి క‌ట్టుగా జ‌న‌సేన‌కు ప‌నిచేస్తే., త‌మ ప‌రిస్థితి ఏంటి అన్న గ‌ణాంకాల వైపు నేత‌ల చూపు ప‌డింది.. అయితే క్షేత్ర‌స్థాయి నిర్మాణం వైపు జ‌న‌సేన దృష్టి సారించిన నేప‌ధ్యంలో., 2019కి ప‌వ‌న్ ప‌వ‌నంలో అంతా తుడిచిపెట్టుకుపోవ‌డం ఖాయం అన్న‌ది విశ్లేష‌కుల అంచ‌నా..

Share This:

1,308 views

About Syamkumar Lebaka

Check Also

జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులు.. గాజువాక ఖ‌ర్చు ఎంతో తెలుసా..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధులు గెలుపు కోసం కోట్ల రూపాయిలు కుమ్మ‌రించి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు నానా పాట్లు ప‌డ‌తారు.. అయితే ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seven + fourteen =