Home / జన సేన / తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేయండి.. అశ్వారావుపేట‌లో జ‌న‌సేనానికి విన‌తిప‌త్రం..!!!

తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేయండి.. అశ్వారావుపేట‌లో జ‌న‌సేనానికి విన‌తిప‌త్రం..!!!

తెలంగాణ‌లో ఎన్నిక‌ల హ‌డావిడి కొన‌సాగుతుండ‌గా., ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోరాట యాత్ర‌లో ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అక్క‌డ పోటీపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు.. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత‌ల‌తో ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలు చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు కూడా.. అయితే ఆ ప్రాంత జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మాత్రం ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.. తెలంగాణ‌లో కూడా జ‌న‌సేన బ‌లంగా ఉంద‌న్న‌ది వారి వాద‌న‌.. సోమ‌వారం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ టూర్‌లో ఎదురైన ఘ‌ట‌నే అందుకు కార‌ణం..

సోమావ‌రం పోల‌వ‌రం ముంపు ప్రాంతాల నిర్వాసిత ప్ర‌జ‌ల్ని ప‌లుక‌రించేందుకు కుక్కునూరు బ‌య‌లుదేరిన జ‌న‌సేనాని, మార్గం మ‌ధ్య‌లో తెలంగాణ మండ‌ల‌మైన అశ్వారావుపేట వెళ్లారు.. అక్క‌డ ఊహించ‌ని రీతిలో పెద్ద ఎత్తున జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.. ఆయ‌న కాన్వాయ్‌ని అడ్డ‌గించి, తెలంగాణ‌లో పోటీ చేయాల‌ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.. అంతే కాదు ఆ ప్రాంత కార్య‌క‌ర్త‌లంతా సంత‌కాలు చేసి మ‌రీ విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.. మా ప్రాంతంలో జ‌న‌సేన మిగిలిన పార్టీలతో పోటీగా బ‌లంగా ఉంద‌నీ, ఇక్క‌డ అభ్య‌ర్ధిని నిల‌బెడితే గెలిపించుకుంటామ‌న్న న‌మ్మ‌కాన్ని ఆ ప్రాంత జ‌న‌సైనికులు వ్య‌క్తం చేశారు.. జ‌న‌సేన అధినేత కూడా వారి విజ్ఞాప‌నను స్వీక‌రించి, ప‌రిశీలిస్తామ‌ని హామీ ఇచ్చారు..

ఇప్ప‌టికే తెలంగాణ ఎన్నిక‌ల‌కి సంబంధించి ఎత్తుల‌, పొత్తులు, క‌స‌ర‌త్తులు పూర్తి కాగా.. నోటిఫికేష‌న్ కోసం పార్టీలు వేయి క‌ళ్ల‌తో వేచిచూస్తున్నాయి.. ఈ నేప‌ధ్యంలో ప్ర‌జ‌ల కోరిక మేర‌కు జ‌న‌సేన అధినేత బ‌రిలోకి దిగుతారా..? ఒంటరిగా పోటీ చేస్తారా..? ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు..? లేక ఎవ‌రితో అయినా పొత్తు ఉంటుందా..? ఈ అంశాల‌పై మ‌రోసారి చ‌ర్చ పుంజుకుంది..

Share This:

1,683 views

About Syamkumar Lebaka

Check Also

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్ని దారులు అటువైపే.. తారా స్థాయికి ప్ర‌వాసగ‌ర్జ‌న హీట్‌..!!!

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అల‌జ‌డి మొద‌లైంది.. డ‌ల్లాస్ వేదిక‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌ర్జన‌కి ముహుర్తం ఖ‌రారైన రోజునే ఆ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × four =