Home / జన సేన / తెలంగాణ స్థానిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గుర్తులు గాజుగ్లాసు, బ్యాట్‌..

తెలంగాణ స్థానిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గుర్తులు గాజుగ్లాసు, బ్యాట్‌..

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డం ద్వారా తెలంగాణ‌లో రాజ‌కీయాలు ప్రారంభించిన జ‌న‌సేన పార్టీ., వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న జిల్లా ప‌రిష‌త్‌, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల బ‌రిలో కూడా స‌త్తా చాటాల‌ని నిర్ణ‌యించుకుంది.. మొద‌ట పార్టీ తెలంగాణ బాధ్య‌తులు శంక‌ర్‌గౌడ్‌, అదే ప్రాంతానికి చెందిన పార్టీ ఉపాధ్య‌క్షులు మ‌హేంద‌ర్‌రెడ్డిలు ఇప్ప‌టికే అందుకు సంబంధించి క‌స‌ర‌త్తులు ముమ్మ‌రం చేశారు.. పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సూచ‌న‌తో ఆ ప్రాంతానికి చెందిన కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాలు స్వీక‌రించారు. అంతా పోటీకి సంసిద్ధ‌త వ్య‌క్త ప‌ర‌చ‌డంతో., పార్టీ త‌రుపున పోటీ విష‌యాన్ని తెలంగాణ ఎన్నిక‌ల సంఘానికి తెలియ‌ప‌రిచారు.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కేటాయించిన గాజుగ్లాసు గుర్తును స్థాని సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా కొన‌సాగించాల‌ని కోరారు.. అయితే జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో గుర్తుల్లో గాజు గ్లాసు ల‌భ్య‌త ఉండ‌డంతో., అందుకు తెలంగాణ ఎన్నిక‌ల సంఘం కూడా సుముఖ‌త వ్య‌క్తం చేసింది.. అయితే ఎంపిటీసీ ఎన్నిక‌ల్లో మాత్రం క్రికెట్ బ్యాట్‌ను జ‌న‌సేన పార్టీకి కేటాయించారు.. మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు ఈసీ కేటాయించిన గుర్తుల్లో గాజుగ్లాసు సింబ‌ల్ లేక‌పోవ‌డంతో, కామ‌న్ సింబ‌ల్‌గా క్రికెట్ బ్యాట్‌ను కేటాయించారు.. గుర్తు విష‌యంలో జ‌న‌సేన పార్టీ శ్రేణులు గంద‌ర‌గోళానికి గురి కాకుండా., రెండు గుర్తుల్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని., అదే స‌మ‌యంలో జెడ్పీ ఎన్నిక‌ల్లో ఎవ‌రికైనా బ్యాట్ గుర్తు కేటాయించిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు క‌న్ఫ్య‌జ్ అవ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నాయ‌కులు సూచించారు.. ఈ మేర‌కు ఇప్ప‌టికే పార్టీ ట్విట్ట‌ర్ అకౌంట్ త్వారా గాజుగ్లాసు, బ్యాట్ సింబ‌ల్స్ కేటాయించిన విష‌యాన్ని జ‌న‌సేన పార్టీ వెల్ల‌డించింది.. రెండు గుర్తుల్ని జ‌నంలోకి తీసుకువెళ్లే బాధ్య‌త‌ను జ‌న‌సైనికుల భుజాన వేసింది..
మే 6, 10, 14 తేదీల్లో మూడు విడ‌త‌లుగా తెలంగాణలో మండ‌ల ప‌రిష‌త్‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.. 27వ తేదీ ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి.. సో గాజుగ్లాస్‌తో పాటు బ్యాట్‌ను కూడా అంతా గుర్తుపెట్టుకోవాల‌న్న మాట‌..

Share This:

417 views

About Syamkumar Lebaka

Check Also

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాల అనంత‌రం కృష్ణా జిల్లాకి సంబంధించి రెండు పార్ల‌మెంట్ సెగ్మెంట్‌ల ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జ్‌ల‌ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seven − one =