Home / ఎడిటోరియల్స్ / తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా జ‌న‌సేన ఆవిర్భావ మ‌హాస‌భ అఫీషియ‌ల్ పోస్ట‌ర్లు..

తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా జ‌న‌సేన ఆవిర్భావ మ‌హాస‌భ అఫీషియ‌ల్ పోస్ట‌ర్లు..

అడ్డ‌దిడ్డంగా., అస్త‌వ్య‌స్థంగా జ‌రిగిన తెలుగు ప్ర‌జ‌ల విభ‌జ‌నని ప్ర‌శ్నించేందుకు ప్ర‌కంప‌న‌లు రేపుతూ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం నుంచి ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటం చేస్తూనే ఉంది.. ప్ర‌జ‌ల‌కి మంచి జ‌రుగుతుంది అన్న చోట ఆ మంచికి ఎలా మ‌ద్ద‌తు ప‌లికిందో., ఆ మంచి ప్ర‌జ‌ల‌కి ఉప‌యోగ‌ప‌డడం లేద‌న్న‌ప్పుడు అదే ప్ర‌జాకోర్టులో నిల‌దీస్తూ వ‌చ్చింది.. ముఖ్యంగా చాలా అంశాల్లో ఉత్తరాధిప‌త్య రాజ‌కీయాల‌కి వ్య‌తిరేకంగా పోరుబావుటా ఎగుర‌వేసి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వాన్ని చాటిన మ‌హానాయకుల స్ఫూర్తిని కాపాడుతూ వ‌చ్చారు.. హ‌స్తిన‌లో మ‌న ఆత్మ‌గౌర‌వాన్ని అమ్మ‌కానికి పెట్టిన నాయ‌కుల‌కి సిగ్గు వ‌చ్చేలా చేశారు.. ఇప్పుడు తెలుగు ప్ర‌జ‌ల కోసం మ‌రోసారి ప్ర‌త్యేక హోదా ఉద్య‌మ నిర్మాణంలో, విభ‌జ‌న హామీల అమ‌లు ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్న జ‌న‌సేనాని., అదే త‌రుణంలో ముందుకి వ‌చ్చిన ఆవిర్భావ‌దినోత్స‌వాన్ని ఓ మ‌హాస‌భ‌గా జ‌రిపి., త‌న మ‌హాసేన‌లో ఉద్య‌మ‌స్ఫూర్తిని నింపేందుకు రెడీ అయ్యారు..

జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ మ‌హాస‌భ ఎలా ఉండాలని తెలుగువారు భావిస్తున్నారో., అదే ఆత్మ‌గౌర‌వ స్ఫూర్తిని ర‌గిల్చేలా ప్ర‌తి అడుగునీ రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు.. ఇప్ప‌టికే స‌భా ప్రాంగ‌ణానికి అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు నామ‌క‌ర‌ణం చేసిన జ‌న‌సేనాని., గోడ‌ప‌త్రిక‌ల్లో సైతం అదే ఆత్మ‌గౌర‌వ స్ఫూర్తిని క‌న‌బ‌రుస్తూ త్యాగ‌ధ‌నుల‌కి వంద‌నం అంటూ ప్ర‌చురించారు.. తెలుగు యోధులు, తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడేందుకు ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెట్టిన‌ టంగుటూరి ప్ర‌కాశం పంతులు, పొట్టి శ్రీరాములు, బూర్గుల రామ‌కృష్ణారావుల చిత్ర‌ప‌టాల‌ను పోస్ట‌ర్‌పై ప్ర‌చురించారు.. ఆనాడు నానా అవ‌మానాలు ప‌డుతున్న తెలుగుజాతి కోసం., తెలుగువారికి ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి కోసం.. ఆంధ్ర‌భాష‌ను కాపాడ‌డం కోసం ఉద్య‌మించిన మ‌న మ‌హ‌నీయుల ప్ర‌స్తావ‌న ద్వారా పోరాట స్ఫూర్తిని ర‌గాల్చాల‌న్న కాంక్ష‌ను జ‌న‌సేన అధినేత క‌న‌బ‌ర్చారు..

జ‌న‌సేన గోడ‌ప‌త్రిక‌లో ప్ర‌చురించిన ముగ్గురు మ‌హ‌నాయుల స్ఫూర్తి ఏపాటిదో చూద్దాం.. ఆయ‌న ఆంధ్ర‌కేస‌రిగా సుప‌రిచితుడు., ఆంగ్లేయుల తుపాకికి రొమ్ముచూపి తెలుగు ఖ్యాతిని విశ్వ‌విఖ్యాతం చేసిన ధీశాలి.. స్వ‌రాజ్య ప‌త్రిక‌తో ప్ర‌జ‌ల్లో స్వ‌రాజ్య‌కాంక్ష నింపిన యోధుడు.. ఆంధ్ర‌రాష్ట్ర తొలి ముఖ్య‌మంత్రి.. ఆయ‌న చూపిన తెగువ నాటి ప్ర‌జ‌ల్లో నింపిన ఉద్య‌మ‌స్ఫూర్తి అజ‌రామ‌రం.. ప్ర‌జ‌లే ఆయ‌న్ని సింహంతో పోల్చ‌డం., ఆ మ‌హ‌నీయుని స్థాయికి నిద‌ర్శ‌నం.. నేటి త‌రం రాజ‌కీయ నాయ‌కుల‌కి టంగుటూరి స్ఫూర్తి, తెగువ అవ‌స‌రం.. అదే స్ఫూర్తిని జ‌న‌సైన్యంలో నింపే ఉద్దేశంతోనే జ‌న‌సేనాని ప్ర‌కాశం పంతులు చిత్ర‌ప‌టాన్ని ప్ర‌చురించారు..

ఉమ్మ‌డి మ‌ద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులు ప‌డుతున్న అవ‌మానాల‌కి వ్య‌తిరేకంగా తెలుగు జాతి ఆత్మ‌గౌర‌వం కోసం ప్రాణాలు అర్పించి అమ‌ర‌జీవి ఖ్యాతి గ‌డించిన త్యాగ‌ధ‌నుడు పొట్టిశ్రీరాములు.. తెలుగుజాతి కోసం 49 రోజుల పాటు ప‌చ్చి గంగ ముట్ట‌కుండా ఆమ‌ర‌ణ‌దీక్ష చేప‌ట్టి., రాష్ట్రం సాధించిన ఆయ‌న త్యాగం స్మ‌ర‌ణీయం., అనుస‌ర‌ణీయం.. రాజ‌కీయ ల‌బ్ది కోసం క‌ప‌ట‌నాట‌కాలు అడుతూ తెలుగు ప్ర‌జల ఎన్నుకున్న ప్ర‌తినిధులు., మ‌న ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టుపెడుతున్న నేప‌ధ్యంలో., మ‌న హ‌క్కుల సాధ‌న కోసం ఈ అమ‌ర‌జీవి స్ఫూర్తితో పోరాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని చెప్ప‌డం కోస‌మే ఆయ‌న చిత్ర‌ప‌టానికి పోస్ట‌ర్‌లో చోటు క‌ల్పించారు..

బూర్గుల రామ‌కృష్ణారావు.. హైద‌రాబాదు రాష్ట్రానికి ప్ర‌జాప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్పుడు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన ఆయ‌న నిజాం వ్య‌తిరేక ఉద్య‌మంలో., ఆంధ్ర‌భాషోద్య‌మంలో త‌న‌దైన ముద్ర వేశారు.. మ‌న మాతృభాష‌ని కాపాడేందుకు మాడ‌పాటి హ‌నుమంత‌రావు, సుర‌వ‌రం ప్ర‌తాప‌రెడ్డి మొద‌లైన వారితో క‌ల‌సి ఆయ‌న చేసిన కృషి ప్ర‌స్తావ‌నార్హం.. ఇక స్వ‌తంత్రస‌మ‌రంలో బూర్గుల పాత్ర కీల‌క‌మైందే.. భ‌ర‌త‌మాత దాస్య‌శృంక‌ల విముక్తి కోసం ఆయ‌న చేసిన పోరాటం స్ఫూర్తిదాయ‌కం..

ఈ ముగ్గురు మ‌హ‌నీయులు త‌మ ప్ర‌తిఅడుగులో పోరాట‌స్ఫూర్తితో పాటు జాతి ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడ‌డంలో త‌మ‌వంతు పాత్ర పోషించారు.. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌జాప్ర‌తినిధుల్లో మాత్ర‌మే కాదు.. ప్ర‌తి తెలుగువాడిలో ఆ త్యాగ‌ధ‌నుల స్ఫూర్తి నింపి హ‌క్కుల సాధ‌న ఉద్య‌మం దిశ‌గా అడుగులు వేయించాల‌న్న‌దే జ‌న‌సేన అధినేత ఆకాంక్ష‌..

 ఇక న‌గ‌రాలు, నియోజ‌క‌వ‌ర్గాలు, మండ‌లాల వారీగా గోడ‌ప‌త్రిక‌ల ఆవిష్క‌ర‌ణ ప‌రంప‌ర మొద‌ల‌య్యింది.. బెజ‌వాడ‌లో జ‌న‌సేన సేవాద‌ళ్ రాష్ట్ర స‌మ‌న్వ‌య‌క‌ర్త రియాజ్‌, పార్టీ నేత న‌గేష్‌, రాష్ట్ర స్థాయి కార్య‌క‌ర్త‌లు పోతిన మ‌హేష్‌, మండ‌లి రాజేష్‌, అమ్మిశెట్టి వాసులు ఆవిర్భావ‌స‌భ వాల్ పోస్ట‌ర్లు ఆవిష్క‌రించారు..

Share This:

1,106 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × one =