Home / జన సేన / తెలుగు త‌మ్ముళ్ల అక్ర‌మాల‌పై దుమ్మెత్తి పోసిన ప‌వ‌న్‌.. ఆగ‌డాలు మాన‌కుంటే రోడ్డుకీడుస్తామ‌ని హెచ్చ‌రిక‌

తెలుగు త‌మ్ముళ్ల అక్ర‌మాల‌పై దుమ్మెత్తి పోసిన ప‌వ‌న్‌.. ఆగ‌డాలు మాన‌కుంటే రోడ్డుకీడుస్తామ‌ని హెచ్చ‌రిక‌

వయ‌సు మ‌ళ్లిన ముఖ్య‌మంత్రి గారు.. రాష్ట్రం బాధ్య‌త‌లు ఇక జ‌న‌సేన‌కి అప్ప‌గించండి.. జ‌న‌సేన పార్టీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి ఎలాంటి క‌ష్టం రాకుండా చూసుకుంటుంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సూచించారు.. జ‌న‌సేన పోరాట యాత్ర‌లో భాగంగా చీపురుప‌ల్లి, భోగాపురం, విజ‌య‌న‌గ‌రంల‌లో జ‌రిగిన నిర‌స‌న క‌వాతు అనంత‌రం ప్ర‌జ‌ల నుద్దేసించి మాట్లాడిన ఆయ‌న‌., తెలుగుదేశం పార్టీ నేత‌ల అవినీతి-అక్ర‌మాల చిట్టాను జ‌నం ముందు ఉంచారు.. చీపురుప‌ల్లి సెంట‌ర్లో మాజీ ఎమ్మెల్యే భార్య పేరు మీద ఇసుక ఎలా దోచేస్తున్నారో వివ‌రించిన ఆయ‌న‌., భోగాపురంలో ధ‌గా ప‌డిన ప్ర‌జ‌ల‌కి అండ‌గా ఉంటానంటూ భ‌రోసా ఇచ్చారు.. ఫెర్రో అల్లాయిస్ కంపెనీల కార్మికుల క‌ష్టాల‌పై మాట్లాడిన ప‌వ‌న్‌., జ‌న‌సేన వారికి అండగా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు.. గొడ్డు చాకిరీ చేస్తున్న వారి జీవితాల‌కి ఓ భ‌రోసా క‌ల్పించాల్సిన బాధ్య‌త‌ ప్ర‌భుత్వాల‌పై ఉంద‌న్నారు.. క‌నీస వైద్య స‌దుపాయాలు కూడా లేని దుస్థితిని ఎత్తి చూపారు.. భోగాపురంలో మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల‌పైనా, ఎయిర్‌పోర్టు నిర్వాసితుల స‌మ‌స్య‌ల‌పైనా మాట్లాడారు.. డీ నోటిఫై చేసిన భూముల్ని ఎందుకు తిరిగి ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు..
న‌వ నిర్మాణ దీక్ష‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌కి ప‌వ‌న్ గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు.. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల్ని ప‌వ‌న్ రెచ్చ గొడుతున్నాడు అంటున్నారు.. నేను రెచ్చ‌గొట్ట‌డంలా నిజాలు చెబుతున్నాన‌న్నారు.. తెలుగు దేశం పార్టీ పాల‌న‌లో శృతిమించిన అవినీతి, అక్ర‌మాలను న‌డిరోడ్డు మీద ప్ర‌శ్నిస్తున్నాన్నారు.. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, భూ క‌బ్జాలు, దౌర్జ‌న్యాలు, ప్ర‌తి విష‌యంలో తెలుగు త‌మ్ముళ్ల ఆగ‌డాలు పెచ్చు మీరాయ‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల ముందు పెడుతున్నాన‌న్నారు.. ఈ దోపిడి ఇలాగే కొన‌సాగితే, అస‌లు రెచ్చ‌గొట్ట‌డం అంటే ఏంటో..? ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రెచ్చ‌గొడితే ఎలా వుంటుందో చూస్తార‌ని హెచ్చ‌రించారు.. ఎయిర్‌పోర్టు పేరుతో మీరు చేసిన నిర్వాకానికి ఆరుగురు ఆడ‌బిడ్డ‌ల పెళ్లిళ్లు ఆగిపోయాయ‌న్న సంగ‌తి మీకు తెలుసా అంటూ ముఖ్య‌మంత్రిని ప్ర‌శ్నించారు.. అస‌లు విమానాశ్ర‌యానికి ఎన్ని ఎక‌రాల భూములు కావాలో మేం తేలుస్తాం.. భోగాపురం చుట్టూ భూములు కొని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న టీడీపీ నేత‌ల జాభితాని కూడా వివ‌రాల‌తో స‌హా బ‌య‌ట‌పెడ‌తామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు..

రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి ప‌రిపాల‌న చేస్తున్న‌ట్టు లేద‌ని, ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీస్ సెష‌న్‌లా ఉంద‌న్నారు.. పుష్క‌రాల‌కీ, దీక్ష‌ల‌కి కోటాను కోట్లు ఖ‌ర్చు చేసేందుకు మీ ద‌గ్గ‌ర డ‌బ్బుంటుంది గానీ , మ‌త్స్య‌కారుల అవ‌స‌రాలు తీర్చే జెట్టీలు క‌ట్టేందుకు మాత్రం మీ ద‌గ్గ‌ర డ‌బ్బుండ‌దా అంటూ నిల‌దీశారు..

ఇక విజ‌య‌న‌గ‌రంలో జోరు వాన‌లో సైతం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ప‌వ‌న్‌కి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.. ఆయ‌న స్పీచ్ ఆధ్యంతం త‌డుస్తూ నిల‌బ‌డి విన్నారు.. త‌న‌ను ఇంత‌గా ఆధ‌రించిన ఉత్త‌రాంద్ర ప్ర‌జ‌ల్ని జీవితంలో మ‌ర్చిపోనన్నారు.. రాజ‌కీయాల్లో ఈ ప్రాంతానికి చెందిన నాయ‌కులు, వారి కుటుంబాలు పాతుకుపోయి, ప‌క్క‌వారికి అవ‌కాశం రాకుండా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.. విజ‌య‌న‌గ‌రాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తామ‌ని ఇచ్చిన హామీ ఎక్క‌డ అంటూ ప్ర‌శ్నించారు.. క‌నీసం స‌రైన తాగునీటిని కూడా అందించ లేక‌పోతోంద‌ని మండిప‌డ్డారు.. 2019లో 175 స్థానాల్లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌న్న ఆయ‌న‌, మ‌న స‌త్తా చాటేందుకు సిద్ధంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాని ఏం అభివృద్దిపై అధికారులు-పాల‌కుల్ని నిదీశారు.. ఇక అధికార‌-విప‌క్ష పార్టీల నేత‌లు జ‌నసేన కార్య‌క‌ర్త‌ల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డాన్ని త‌ప్ప‌బ‌ట్టారు.. మీరు ప‌దే ప‌దే మా జోలికి వ‌స్తుంటే చేతులు ముడుచుకు కూర్చోమ‌న్నారు.. గ‌డ‌చిన ఏడాదిలో40 వేల మంది వేల మంది వ‌ల‌స‌ల‌బాట ప‌ట్ట‌డం ఎవ‌రి పుణ్య‌మో చెప్పాల‌ని న‌డిరోడ్డు మీద నిల‌దీశారు..

Share This:

1,427 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen + 8 =