Home / ఎడిటోరియల్స్ / తెలుగు మీడియాలో ప‌వ‌న్ క్రేజ్‌.. హాట్ కేకులుగా జ‌న‌సేనాని వార్త‌లు..

తెలుగు మీడియాలో ప‌వ‌న్ క్రేజ్‌.. హాట్ కేకులుగా జ‌న‌సేనాని వార్త‌లు..

20161115_133351

నేను ట్రెండ్‌ని ఫాలో అవ్వ‌ను.. క్రియేట్ చేస్తా.. ఈ డైలాగ్ జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి అచ్చుగుద్దిన‌ట్టు సెట్ అవుతుంది.. సినిమా కెరియ‌ర్, పొలిటిక‌ల్ జ‌ర్నీ రెండింటా ఆయ‌న వేసే ప్ర‌తి అడుగు సంచ‌ల‌న‌మే.. పైర‌సీ అయిపోయిన సినిమా ఇండ‌స్ట్రీ హిట్ కొట్టినా., ఒక్క మాట‌తో ఓ పార్టీని అధికార పీఠం ఎక్కించినా., అది ఆయ‌న‌కే చెల్లు.. అందుకే ఆది నుంచి ప‌వ‌ర్‌స్టార్ మీడియాకి ఓ కామ‌దేనువుగా మారారు.. జ‌న‌సేనాని వార్త‌ల‌కు ఉన్న క్రేజీ దృష్ట్యా., ప‌త్రిక‌లు, చాన‌ళ్లు, ఇంటెర్నెట్ మీడియా అన్న తేడా లేకుండా అంతా ఆయ‌న వార్త‌ల్ని క్యాష్ చేసుకోవ‌డానికి బాగా రుచిమ‌రిగారు.. జ‌న‌సేన పార్టీ ప్రారంభించిన నాటి నుంచి ఈ హోరు మ‌రీ ఎక్కువైంది.. ప‌వ‌న్ పేరు క‌న‌బ‌డితే చాలు., జ‌నం ట‌క్కున అక్క‌డ ఆగిపోయి విష‌యం ఏంటి అని తెలుసుకుని మ‌రీ వెళ్తారు.. అందుకే విష‌యం ఉన్నా లేకున్నా., నిత్యం ప‌వ‌ర్‌స్టార్‌పై ఏదో ఒక వార్త రాయ‌డం., వారి రేటింగ్ పెంచుకోవ‌డం మీడియాకు నిత్య‌కృత్య‌మైపోయింది..

20161115_133405ఇక ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా ప‌వ‌ర్‌స్టార్ పోరాటం మొద‌లు పెట్టాక‌., ఈ వార్త‌ల ప‌రంప‌ర మ‌రింత ఎక్కువైంది.. ప‌వ‌న్ మాట్లాడినా వార్తే., మాట్లాడ‌కున్నా వార్తే., ఆయ‌న బ‌య‌టికి వ‌చ్చినా వార్తే., రాకున్నా వార్తే అన్న‌ట్టు ప‌రిస్థితులు మారిపోయాయి.. జ‌న‌సేనాని నిర్వ‌హిస్తున్న చైత‌న్య స‌భ‌లల వార్త‌లు మీడియాకి పండ‌గే.. ప‌ది రోజుల ముందు మొద‌లు పెట్టి., స‌భ గ‌డ‌చిన ప‌ది రోజుల త‌ర్వాతి వ‌ర‌కు అంత‌టా అదే చ‌ర్చ‌.. ఆయ‌న ఎలా స్టేజీ పైకి వ‌చ్చారు అన్న విష‌యం ద‌గ్గ‌ర నుంచి ఎలా మొద‌లు పెట్టారు.. ఎలా ముగించారు.. ఎవ‌రెవ‌ర్ని విమ‌ర్శించారు.. ఎవ‌రిని విమ‌ర్శించ‌లేదు.. ఇలా ఒక్కో అంశం ఒక్కో రోజు అడేస్తున్నాయి..

తాజాగా అనంత స‌భ సూప‌ర్ స‌క్సెస్‌తో మీడియా సృష్టి అయిన కొత్త కోణాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.. పుకార్లు సృష్టించ‌డం., త‌మ వార్త‌ల‌తో వాటిని చిల‌వ‌లు ప‌ల‌వ‌లు చేయ‌డం మొద‌లు పెట్టేశారు కొంద‌రు పాత్రికేయ మిత్రులు.. నిజానిజాల‌ను ప‌క్క‌న పెట్టి., ఓ ఎమ్మెల్యే పార్టీలోకి వ‌స్తున్నాడ‌ని., ప‌వ‌న్ త‌ర్వాతి స‌భ ఎక్క‌డ పెడ‌తారో మాకు తెలుసు అని., జ‌నానికి ఆస‌క్తి రేపే అంశాల‌తో కూడిన‌ క‌థ‌నాల‌ను బాగా స‌ర్కిలేట్ చేస్తూ., త‌మ ప‌బ్బం గ‌డిపేసుకుంటున్నారు.. వార్త ఏదైనా అందులో జ‌న‌సేనాని పేరు ఉంటే అది హాట్ కేక్‌గా మార‌డంతో., మీడియా మొత్తాన్ని ప‌వ‌న్ క్రేజీ ఊపేస్తోంది.. వార్త‌లు రాస్తే రాశారుగాని., జ‌న‌సేనాని విష‌యంలో జ‌నాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు మాత్రం చేయ‌కండి., త‌ర్వాత అది మీకే సెల్ఫ్ గోల్ అవుతుంది జాగ్ర‌త్త‌..

Share This:

1,371 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనాని ”మౌనం” తుపాను ముందు ప్ర‌శాంత‌తే..

ఐదు సంవ‌త్స‌రాల క్రితం జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం సాధించారు..? ఒక్క సీటు అయినా గెలుస్తారా..? అస‌లు ఎన్నిక‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − 3 =