Home / పోరు బాట / త్వ‌ర‌లో జ‌న‌సేనాని నాలుగో స‌భ‌.. స్పాట్‌, డేట్‌ల‌పై ముమ్మ‌రంగా క‌స‌ర‌త్తు..

త్వ‌ర‌లో జ‌న‌సేనాని నాలుగో స‌భ‌.. స్పాట్‌, డేట్‌ల‌పై ముమ్మ‌రంగా క‌స‌ర‌త్తు..

ముచ్చ‌ట‌గా మూడు స‌భ‌లు.. తాను చెప్పాల‌నుకున్న‌దేంటి..? తాను చేయాల‌నుకున్న‌దేంటి..? త‌న పోరాటం ఎవ‌రిపై..? అనే అంశాన్ని సూటిగా ప్ర‌జ‌ల ముందుంచేశాడు.. జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్‌.. ప్ర‌జ‌ల త‌రుపున తాను పోరాడుతా.. పోరాటం చేస్తూనే ఉంటాన‌ని చెబుతూనే., పాల‌కుల‌కీ హెచ్చ‌రిక‌లు పంపాడు.. భ్ర‌ష్టు ప‌ట్టిన మీ రాజ‌కీయాల పైనే నా పోరాటం అంటూ ప్ర‌కంప‌న‌లు రేపాడు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా క‌థ‌న‌రంగంలోకి దిగిన జ‌న‌సేనాని., ఆ దిశ‌గా మ‌రో అడుగు వేసేందుకు రెఢీ అవుతున్నాడు.. ఇప్ప‌టికే ముచ్చ‌ట‌గా మూడు స‌భ‌ల‌తో స‌మ‌స్య‌ల్లో ఉన్న ప్ర‌తి తెలుగువాడినీ త‌న‌వైపు తిప్పుకున్న ఆయ‌న‌., నాలుగో మీటింగ్‌కి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. తొలి స‌భ తిరుప‌తిలో పెట్టిన ప‌వ‌ర్‌స్టార్‌, మ‌లిస‌భ‌ని కాకినాడ వేదిక‌గా చేసుకున్నారు.. ఏ కాకినాడ వేదిక‌గా నేటి ప్ర‌ధాని ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని బాస చేశారో., అక్క‌డి నుంచే త‌న నిర‌స‌న తెల‌పాల‌న్న కార‌ణం చేతే వేదిక అక్క‌డికి వెళ్లింది.. మూడో స‌భ అనంత‌లో పెట్టారు.. అనంత అంటే క‌రువు., క‌రువు అంటే అనంత అన్న నానుడి ఉంది.. అనంత అన్న పేరుకి త‌గ్గ‌ట్టు ఆ జిల్లా అనంత‌కోటి స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతుంటుంది.. ప్ర‌త్యేక హోదా ఆవ‌శ్య‌క‌త ఇలాంటి జిల్లాల‌కి ఎంత ఉందో చాటి చెప్పేందుకే., మూడో స‌భ‌కి అనంతని వేదిక‌గా చేసుకున్నారు ప‌వ‌ర్‌స్టార్‌…

మ‌రి నాలుగో స‌భ ఎక్క‌డ‌.. పార్టీ శ్రేణులు ప్ర‌స్తుతం ఇదే స‌మ‌స్య‌పై తీవ్ర‌మైన క‌స‌ర‌త్తులు చేస్తోంది.. సామీ మా జిల్లాకి రండి.. మా ఊరికి రండి.. మీరు అడుగు పెడితే స‌మ‌స్య‌లు మా ద‌రిచేర‌వు అన్న విజ్ఞ‌ప్తులు, విజ్ఞాప‌న‌లు రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి వ‌స్తున్నాయి.. అనంత లాంటి ప‌రిస్థితులే నెల‌కొన్న ఉత్త‌రాంధ్ర జిల్లాలు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా లాంటి చోట్ల స‌మ‌స్య‌ల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది.. స‌మ‌స్య‌లు ఎక్క‌డ ఉంటే తాను అక్క‌డే ఉంటాన‌ని ప‌వ‌న్ చెప్పారు కాబ‌ట్టి., సిక్కోలు అంశం ప‌రిశీల‌న‌లో ఉంది.. ఇటీవ‌ల నీటి స‌మ‌స్య‌కు సంబంధించి జిల్లాలో పార్టీ కోశాధికారి రాఘ‌వ‌య్య ప‌ర్య‌టించిన నేప‌ధ్యంలో జ‌న‌సేనాని మా జిల్లాకే వ‌స్తార‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో కూడా బ‌ల‌ప‌డింది..

అదే స‌మ‌యంలో ఏజెన్సీలోని ముంపు గ్రామాల ప్ర‌జ‌లు జ‌న‌సేనాని త‌మ ప్రాంతానికి వ‌స్తే ఏదో చెప్పాల‌ని., త‌మ స‌మ‌స్య‌లు ఏక‌రువు పెట్టాల‌ని ఆశ‌తో ఉన్నారు.. దీంతో పాటు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కూడా ప‌రిశీల‌న‌లో ఉంది.. ఆయ‌న ఓటు హ‌క్కు ఏలూరులో న‌మోదు చేయించుకోవ‌డం ద‌గ్గ‌ర్నుంచి., ఆక్వా ఫుడ్ పార్క్ పంచాయితీ ప‌వ‌న్ వ‌ద్ద‌కు రావ‌డం., ఈ విష‌యాన్ని ఆయ‌న సీరియ‌స్‌గా తీసుకోవ‌డ వంటి అంశాలు ఇక్క‌డ ప్ర‌స్తావ‌న‌కి వ‌స్తున్నాయి.. ప్ర‌జాభిప్రాయానికి వ్య‌తిరేకంగా ఫుడ్ పార్క్ ప‌నులు వేగం పుంజుకోవ‌డంతో., వారి త‌రుపున పోరాటం చేయాల్సిన ప‌రిస్థితుల్ని ఇటీవ‌ల ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించిన జ‌న‌సేన ప్ర‌తినిధి బృందం ప‌వ‌న్ ఎదుట ఉంచింది..

దీంతో పాటు నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల పేర్లు కూడా ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.. ప్ర‌త్యేక హోదా ప్ర‌ధాన అజెండా క‌నుక నాలుగో స‌భ‌కి ఉత్త‌రాంధ్రే ఉత్త‌మ‌మ‌న్న అభిప్రాయం పార్టీ శ్రేణులు వ్య‌క్త ప‌రిచిట్టు తెలుస్తోంది.. అయితే అదే స‌మ‌యంలో భీమ‌వ‌రం ఆక్వా ఫుడ్ పార్క్ బాధితుల త‌రుపున పోరాటం లాంటి అంశాలు పోటీ ప‌డుతున్నాయి.. రెండు, మూడు రోజుల్లో నాలుగో స‌భ స్పాట్ ఎక్క‌డ అనే అంశానికి సంబంధించి క‌ర‌స‌ర్తు ఓ కొలిక్కి రానున్న‌ట్టు తెలుస్తోంది.. ప్లేస్ ఓకే అయిపోతే డిసెంబ‌ర్‌లోనే స‌భ ఉండే అవ‌కాశాలు ఉన్నాయి.. స‌ర్వే రిపోర్టులు తారుమారై త‌ల‌లు ప‌ట్టుకుంటున్న పొలిటిక‌ల్ ప్ర‌త్య‌ర్ధులారా… కాచుకోండి..

Share This:

1,337 views

About Syamkumar Lebaka

Check Also

క‌డ‌ప‌ కోట‌లో పాగా వేసేదెవ‌రు.? జ‌న‌సేన చ‌రిత్ర సృష్టించ‌నుందా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు.. ఏలయినా ముఖ్య‌మంత్రి అయిపోవాల‌ని క‌ల‌లు కంటున్న ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి, తిరిగి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × 3 =