Home / జన సేన / త‌ప్పెవ‌రిదో తేల్చేస్తాం.. వివ‌రాలు ఇవ్వండి..కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కి జ‌న‌సేనాని విజ్ఞ‌ప్తి….

త‌ప్పెవ‌రిదో తేల్చేస్తాం.. వివ‌రాలు ఇవ్వండి..కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కి జ‌న‌సేనాని విజ్ఞ‌ప్తి….

పార‌ద‌ర్శ‌క‌త‌.. వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో ఈ ప‌దం కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం.. చేత‌ల్లో అంటే కాస్త ఆలోచించాల్సిందే.. పార‌ద‌ర్శ‌క‌త‌తో కూడిన రాజ‌కీయాలు చేయాలంటే ప్ర‌జ‌ల‌కి నిజాలు చెప్పాలి.. మ‌రి అది సాధ్య ప‌డుతుందా..? ఓట్లేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌కి నిజం ఎందుకు చెప్ప‌రు.. రాజ‌కీయం అంటే ప్ర‌జా సేవ‌.. గెలిపించిన జ‌నానికి జ‌వాబుదారీతం.. అనే రెండు ప‌దాలు మాత్ర‌మేన‌ని భావించే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వేస్తున్న ప్ర‌శ్న ఇదే.. ఇన్నాళ్లు ఎప్పుడో ఒక‌సారి క‌న‌బ‌డ‌తాడు.. ఏదో మాట్లాడి వెళ్లిపోతాడు.. ఈయ‌న‌కి పాలిటిక్స్ ఎందుకు అని విమ‌ర్శించిన నోళ్లు.. ఇప్పుడు తెర‌వ‌చ్చు.. జ‌న‌సేనాని అస‌లైన రాజ‌కీయం.. స్వ‌తంత్రం వ‌చ్చిన 70 ఏళ్ల త‌ర్వాత ప్ర‌జ‌ల కోసం పాలిటిక్స్ మొద‌లు పెట్టారు.. అర్ధంకాని మాట‌ల‌తో జ‌నాన్ని మోసం చేస్తున్న ప్ర‌భుత్వాల భ‌ర‌తం ప‌ట్టేందుకు., త‌న‌లోని అస‌లు సిస‌లు రాజ‌కీయ నాయ‌కుడ్ని బ‌య‌టికి తీశారు..

ఇది తొలి అడుగు మాత్ర‌మే.. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ.. వాస్తవాల నిర్ధార‌ణ క‌మిటీ.. రాష్ట్ర విభ‌జ‌నకి సంబంధించిన హామీల ఉల్లంఘ‌న‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎదుర్కొంటున్న ఆర్ధిక స‌మ‌స్య‌లు.. ఈ వ్య‌వ‌హారంలో కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేస్తున్న భిన్న‌మైన వాద‌న‌లు.. ముందుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌త్యేక హోదా అంశంపై గ‌ళం ఎత్తిన‌ప్పుడు., ఎన్నిక‌ల హామీ నెర‌వేర్చ‌మంటూ గొంతెత్తిన‌ప్పుడు.. కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీ అంటే., దాన్ని స్వీక‌రించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఒప్పుకుంది.. పైగా ప్యాకేజీ ఆహా.. ఓహో అంటూ ప్ర‌క‌ట‌న‌లు కూడా చేసింది.. ఇప్పుడేమో స‌రిప‌డ నిధులు ఇవ్వ‌డం లేదంటోంది.. అటు కేంద్రం హోదాకి మించిన ప్యాకేజీ ఇచ్చామంటోంది… 2014లో ఈ రెండు ప్ర‌భుత్వాల ఏర్పాటుకి త‌న‌వంతు స‌హ‌కారం అందించిన జ‌న‌సేనాని., ఇప్పుడు ప్ర‌జ‌ల్లో ఉన్న తిక‌మ‌క‌ని తొల‌గించాల్సిన బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నారు.. అందుకు కార‌ణం జవాబుదారీత‌నం.. అటు మోడీ ఇటు చంద్ర‌బాబుల గెలుపు వ‌ల్ల మేలు జ‌రుగుతుంద‌ని భావించారు.. వేచిచూశారు.. కానీ కేంద్ర‌-రాష్ట్రాల తీరు వ‌ల్ల అసంతృప్తి.. తీవ్ర‌మైన అసంతృప్తి.. ఆ అసంతృప్తే JFC ఏర్పాటుకి నాంది ప‌లికింది..

మొన్న లోక్‌స‌త్తా జేపీ, ఇప్పుడు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌ల‌తో భేటీ.. అన్యాయానికి గురైన ఏపీ ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయాలి.. చేయాలి అంటే ముందు కేంద్ర‌-రాష్ట్రాల భిన్నవాద‌ల క‌థ తేల్చాలి.. ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు అబ‌ద్దం ఆడుతున్నారు.. కేంద్ర‌మా..? రాష్ట్ర‌మా..? కేంద్రం ఎవ‌రికీ ఇవ్వ‌నంత ఇచ్చామంటోంది.. టీడీపీ ఇవ్వ‌లేదంటోంది.. ఈ రెండు పార్టీల‌కి మ‌ద్ద‌తు ఇచ్చారు కాబ‌ట్టి.. ప్ర‌జ‌ల‌కి స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంది.. అంద‌రికంటే ఎక్కువ బాధ్య‌త త‌న‌పై ఉంది.. జ‌న‌సేన అధినేత‌లో ఉన్న ఈ జ‌వాబుదారీ త‌న‌మే JFC ఏర్పాటు ఆలోచ‌నికి పురుడు పోసింది..

ఉండ‌వ‌ల్లి, జేపీ లాంటి వాళ్లే ఎందుకు..? ఉండ‌వ‌ల్లితో భేటీ అనంత‌రం ఆ అంశంపై కూడా స్ప‌ష్ట‌త ఇచ్చారు.. విభ‌జ‌న స‌మ‌యంలో సొంత పార్టీని ఎదిరించి., అనంత‌రం రాజ‌కీయ స‌న్యాసం చేసిన వ్య‌క్తి ఉండ‌వ‌ల్లి.. ఆయ‌న అయితేనే ప్ర‌జ‌ల‌కి అర్ధ‌మ‌య్యే భాష‌లో వివ‌రించ‌గ‌ల‌రు.. జేపీకి ఉన్న పాల‌నానుభ‌వం.. వీరిద్ద‌రితో పాటు ఆర్ధిక‌వేత్త‌లు, రాజ‌కీయ‌వేత్త‌లు, సామాజిక‌వేత్త‌లు.. అంద‌రితో క‌లిపి JFC ఏర్పాటు చేయ‌నున్నారు.. JFCలో ఇద్ద‌రి పేర్లు ఖ‌రార‌య్యాయి.. మిగిలిన పేర్లు రెండు రోజుల్లో ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు జ‌న‌సేన అధినేత తెలిపారు..

JFCకి ఇవ్వాల్సిన వివ‌రాలు కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇస్తే.. ఎవ‌రిది త‌ప్పు అనే అంశాన్ని తేలుస్తుంది.. ఎవ‌రు చెప్పేది నిజం అనేది ప్ర‌జ‌ల‌కి వివ‌రిస్తుంది.. కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంబంధిత వివ‌రాలు ఇచ్చేందుకు మీడియా ముఖంగా డెడ్‌లైన్ కూడా ఇచ్చారు.. ఈ నెల 15 లోపు కేంద్రం ఏపీకి ఎన్ని నిధులు ఇచ్చింది అన్న వివ‌రాలు కేంద్రం., రాష్ట్రానికి ఎంత చేరాయ‌న్న విష‌యం రాష్ట్రం చెబితే., క‌మిటీ నిజ‌నిర్ధార‌ణ చేస్తుంద‌ని జ‌న‌సేనాని వెల్ల‌డించారు.. జ‌న‌సేన అధినేత అడుగు వేశారు.. తొలి అడుగు వేశారు.. ఎవ‌రి భండారం ఏంటో బ‌య‌ట‌పెట్టే అడుగు ఇది.. వివ‌రాలు ఇస్తారా..? ప‌్ర‌జ‌ల ఎదుట దోషుల‌మ‌ని ఒప్పుకుంటారా..? మీవంతు నీతిమాలిన రాజ‌కీయాలు ఆయ‌న‌పై ప్ర‌యోగించారుగా., ఇప్పుడు నిజాయితీతో కూడిన రాజ‌కీయాలు ఎలా ఉంటాయో., ఆయ‌న చూపిస్తున్నారు.. కాచుకోండి..

ఉండ‌వ‌ల్లి మాట‌ల్లో ప్ర‌భుత్వాలు అబ‌ద్దాలు చెప్ప‌వు.. కానీ నిజాలు దాస్తాయి.. ఆ నిజాల్ని బ‌హిర్గ‌త ప‌రిచేందుకే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌ని మొద‌లు పెట్టారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రియ‌ల్ పాలిటిక్స్ ఇవాల్టి నుంచి మొద‌లుపెట్టారు.. చెప్పే విష‌యం.. చేసే ప‌నిలో నిబ‌ద్ద‌త ఉంటే త్వ‌ర‌గా వివ‌రాలు ఇచ్చేయండి మ‌రి.. తొలి అడుగే ఇలా ఉంటే.. వివ‌రాలు ఇవ్వ‌కుంటే ఆయ‌న వేసే మ‌లి అడుగుని అస‌లు త‌ట్టుకోలేరు.. జాగ్ర‌త్త‌..

Share This:

1,802 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 + eleven =