Home / పవన్ టుడే / దంగ‌ల్‌పై ప‌వ‌న్ రివ్యూ.. అమీర్‌కు జ‌న‌సేనాని ఫైవ్‌స్టార్ రేటింగ్‌..

దంగ‌ల్‌పై ప‌వ‌న్ రివ్యూ.. అమీర్‌కు జ‌న‌సేనాని ఫైవ్‌స్టార్ రేటింగ్‌..

img-20170101-wa0157img-20170101-wa0158 img-20170101-wa0159

విష‌యం ఏదైనా సూటిగా, నిర్మొక‌మాటంగా అభిప్రాయం వ్య‌క్త ప‌ర‌చ‌డంలో జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ర్వాతే ఎవ‌రైనా.. అయితే ప్ర‌తిసారీ ఆయ‌న నేరుగా మీడియా ముఖంగా మాట్లాడ‌టం వీలుకాదు.. కాబ‌ట్టి.. సామాజిక మాధ్య‌మం ట్విట్ట‌ర్‌ను అందుకు వేదిక‌గా ఎంచుకున్నారు.. అయితే మిలియ‌న్ పైగా ఫాలోవ‌ర్లు క‌లిగిన ప‌వర్‌స్టార్‌., త‌న అకౌంట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం సామాజిక అంశాలు, ప్ర‌జా స‌మ‌స్య‌లు, రాజ‌కీయ అంశాల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించిన జ‌న‌సేనాని., తొలి సారి ఓ సినిమాపై త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.. బాలీవుడ్ బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కొడుతున్న మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ లేటెస్ట్ మూవీ దంగ‌ల్ న‌టీన‌టులు, సాంకేతిక‌వ‌ర్గంపై ఆయ‌న ప్రశంస‌ల వ‌ర్షం కురిపించారు.. ఇటీవ‌లే దంగ‌ల్ చూశాన‌న్న జ‌న‌సేనాని., చూశాక ఇంత మంచి చిత్రంపై రివ్యూ ఇవ్వ‌క‌పోవ‌డాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నాన‌న్నారు..

మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ బాలీవుడ్‌లో మ‌రోసారి త‌న స‌త్తా ఏంటో నిరూపించుకున్నార‌న్న ప‌వ‌న్‌., అమీర్ అద్భుత న‌ట‌న‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల మ‌న‌సులు మ‌రోసారి దోచుకున్నార‌ని ట్వీట్ చేశారు.. అంత గొప్ప‌న‌టుడు మ‌న భార‌తీయుడు కావ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు.. దంగ‌ల్‌లోని మిగిలిన నటీన‌టుల‌తో పాటు సాంకేతిక నిపుణుల‌పైనా ఆయ‌న ప్రశంస‌లు కురిపించారు.. సాంకేతిక నిపుణుల‌కి త‌న అభినంద‌న‌లు తెలిపిన జ‌న‌సేనాని., ద‌ర్శ‌కుడు నితీష్ క‌థ‌ను ఎంతో చ‌క్క‌గా ప్రేక్ష‌కుల ముందుకి తీసుకువెళ్ల‌గ‌లిగార‌న్నారు.. బ‌బితా పోప‌ట్‌గా న‌టించిన సుహానీ భ‌ట్నాగ‌ర్‌, స‌న్యా మ‌ల్హోత్రాల‌కు, గీతా పోగ‌ట్ పాత్రలో న‌టించిన జైరా వ‌సీం, ఫాతిమా స‌నా షేక్‌ల‌కు ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు.. స్త్రీ శ‌క్తి, సాధికారిత అనే అంశాల‌పై ఈ చిత్రం అంద‌ర్నీ ఆలోచింప‌చేసింద‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు..

ఓవ‌రాల్‌గా దంగ‌ల్ చిత్రానికి, అమీర్‌ఖాన్‌తో పాటు న‌టీన‌ట‌వ‌ర్గానికీ, సాంకేతిక వ‌ర్గానికి జ‌న‌సేనాని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు..

Share This:

565 views

About Syamkumar Lebaka

Check Also

నిజ‌మైన స‌ర్వే చేద్దాం రండి.. ప‌చ్చ‌-ప్ర‌తి ప‌చ్చ‌(సాక్షి) మీడియాల‌కి ఓపెన్ ఛాలెంజ్‌..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వేడి రాజుకున్న నేప‌ధ్యంలో.. స‌ర్వేలంటూ మీడియా హ‌డావిడి మొద‌లుపెట్టింది.. తెలంగాణ‌లో ప‌రిస్థితులు ఎలా వున్నా., ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty + two =