Home / పోరు బాట / దళం క‌దిలింది.. దండు క‌దిలింది.. అనంత దండ‌యాత్ర‌కు జ‌న‌సైన్యం క‌దిలింది..

దళం క‌దిలింది.. దండు క‌దిలింది.. అనంత దండ‌యాత్ర‌కు జ‌న‌సైన్యం క‌దిలింది..

14906975_703479773160904_538117045942846291_n 14925747_229131237499048_7028585569161250401_n 14938202_2152574458300464_4205924873740380051_n 14980672_2152574438300466_6156094729386435865_n 15037347_1814136272156021_2419173516102537004_n fb_img_14786859261253591 img-20161109-wa0003ప్ర‌త్యేక హోదా విష‌యంలో హామీ ఇచ్చి ఆంధ్రుల‌కి వెన్నుపోటు పొడిచిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ ప్ర‌క‌టించిన యుద్ధం తారా స్థాయికి చేరింది.. హోదా ఇస్తారా.. చ‌స్తారా..? అంటూ జ‌న‌సేనాని కాల‌ర్ ప‌ట్టుకుని ప్ర‌శ్నించేందుకు రెఢీ అయితే., ఆయ‌న‌కు తామంతా అండ‌గా ఉన్నామ‌ని చాటి చెప్పేందుకు ల‌క్ష‌లాధి మంది జ‌న‌సైనికులు అనంత‌కు ప‌య‌న‌మ‌య్యారు.. కొంద‌రు వారం ముందు, మ‌రికొంద‌రు రెండు రోజుల ముందు., ఇంకొంద‌రు బుధ‌వారం అనంత‌కు చేరుకున్నారు.. ఒక రోజు ముందే వేలాదిగా జ‌నం ప్రాంగ‌ణం వ‌ద్ద మోహ‌రించారు.. ఇక స‌భ జ‌రిగే నేటి రోజుకి ఇక్క‌డ‌కు చేరేలా మ‌రికొంత మంది ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి బ‌య‌లుదేరారు.. నేటి త‌రం రాజ‌కీయ నాయ‌కుల మాదిరి., జ‌న‌స‌మీక‌ర‌ణ అనే ప‌దాన్ని పూర్తిగా మార్చేస్తూ., ఎవ‌రికి వారుగా సొంత వాహ‌నాల్లో అనంత‌కు చేరుకుంటున్నారు.. ఇద్ద‌రు నుంచి ఐదుగురు వ‌ర‌కు ఫ్రెండ్స్ సొంత ఖ‌ర్చుల‌తో వాహ‌నాలు ఏర్పాటు చేసుకుని మ‌రీ., సేనాని గ‌ర్జ‌న‌తో స్వ‌రం క‌లిపేందుకు త‌ర‌లివ‌స్తున్నారు..

ఇప్ప‌టికే ప్ర‌ధాన వేదిక ప్రాంత‌మంతా అక్క‌డికి చేర‌కున్న వేలాది మంది జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో కిక్కిరిసి పోయింది.. స్థానిక జూనియ‌ర్ క‌ళాశాలగ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన నాగిరెడ్డి ప్రాంగ‌ణం రాత్రే నిండిపోయింది.. ఇంకా భారీ సంఖ్య‌లో జ‌న‌సైన్యం త‌ర‌లివ‌స్తూనే ఉన్నారు.. అటు పోలీసులు కూడా భ‌ద్ర‌తా ఏర్పాట్లపై నిరంత‌రాయంగా స‌మీక్షిస్తూనే ఉన్నారు.. ఇవాళ మ‌ధ్యాహ్నంకి జ‌న‌సేనాని అనంత‌కు చేరుకుంటారు.. ఆ కాసేప‌టికే వేదిక వ‌ద్ద‌కు వ‌చ్చి., సుమారు నాలుగు గంట‌ల ప్రాంతంలో త‌న ప్ర‌సంగం ప్రారంభిస్తారు..

pos

ఇక గ‌త అనుభ‌వాల దృష్ట్యా ల‌క్ష‌లాధిగా త‌ర‌లివ‌చ్చే అభిమానులు ఎలాంటి అడ్వంచ‌ర్లు చేయోద్దని., ప‌వ‌ర్‌స్టార్‌ని చూసేందుకు మేడ‌లు, మిద్దెలు, స్థంభాలు లాంటివి ఎక్క‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ ప్రాంగ‌ణంకి అన్ని వైపులా బ్యాన‌ర్లు ఏర్పాటు చేశారు.. తెలుగు రాష్ట్రాల చ‌రిత్ర‌లో స‌భల వ‌ద్ద ఇలాంటి బ్యాన‌ర్లు ఏర్పాటు చేసిన మ‌రో లీడ‌ర్ లేడంటే., ప‌వ‌ర్‌స్టార్ ద‌మ్ము ఏంటో అర్ధం అవుతుంది.. ప‌వ‌ర్‌టుడే త‌రుపున కూడా నిబ‌ద్ద‌త క‌లిగిన జ‌న‌సైన్యానికి సేనాని త‌రుపున విజ్ఞ‌ప్తి చేస్తున్నాం.. హోదా ఉద్య‌మంలో జ‌న‌సేనానికి మ‌ద్ద‌తు ప‌లికేందుకు దూర‌తీరాల నుంచి అనంత త‌ర‌లివ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రు., ఎవ‌రికి వారుగా క్ర‌మ‌శిక్ష‌ణ పాటించండి.. ముఖ్యంగా సేనాని ప్రాంగ‌ణానికి చేరే స‌మ‌యంలో ఆయ‌న్ని చూసేందుకు ఎగ‌బ‌డ‌వ‌ద్దు.. తొక్కిస‌లాట‌ల‌కి తావివ్వొద్దు.. సేనాని వేదిక నుంచి అంద‌రికీ క‌న‌బ‌డేలా నిర్వాహ‌కులు ఏర్పాట్లు చేశారు.. ప‌వ‌న్ ప్ర‌సంగం స‌మ‌యంలో గాని., ఆయ‌న వ‌చ్చేట‌ప్పుడు, వెళ్లేట‌ప్పుడు సంయ‌మ‌నం పాటించండి.. మీ మీ ఇళ్ల‌కు సేఫ్‌గా తిరిగి వెళ్లండి.. మీ వాళ్లు మీ కోసం ఎదురు చూస్తూ ఉంటార‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోండి..

మ‌నం చేయాల్సింద‌ల్లా వేయిగొంతుక‌లు ఒక్క‌టిగా., కేంద్ర‌, రాష్ట్రాల్లో పాల‌కుల పీఠాలు క‌దిలేలా సేనానికి మ‌ద్ద‌తుగా గ‌ర్జించ‌డ‌మే..

Share This:

1,408 views

About Syamkumar Lebaka

Check Also

క‌డ‌ప‌ కోట‌లో పాగా వేసేదెవ‌రు.? జ‌న‌సేన చ‌రిత్ర సృష్టించ‌నుందా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు.. ఏలయినా ముఖ్య‌మంత్రి అయిపోవాల‌ని క‌ల‌లు కంటున్న ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి, తిరిగి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × four =