Home / జన సేన / దివిసీమ గ‌డ్డ‌పై జెండా పాతిన జ‌న‌సేన‌.. కృష్ణా జిల్లాలో తొలి అడుగు అదుర్స్‌..

దివిసీమ గ‌డ్డ‌పై జెండా పాతిన జ‌న‌సేన‌.. కృష్ణా జిల్లాలో తొలి అడుగు అదుర్స్‌..

జ‌న‌సేన పార్టీ ఎక్క‌డ ఉంది.. అంటే రాష్ట్ర ప్ర‌జ‌ల గుండెల్లో ఉంది అనే స‌మాధాన‌మే ప్ర‌తి జ‌న‌సేన కార్య‌క‌ర్త నుంచి వ‌స్తుంది.. దీనికి రుజువు ఏంటి..? అనే ప్ర‌త్య‌ర్ధుల ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు ఇచ్చే రోజులు వ‌చ్చేశాయి.. నిజాయితీ, నిబ‌ద్ద‌త‌తో కూడిన రాజ‌కీయాల‌కి స్వాగ‌తం ప‌లుకుతూ ప్ర‌జ‌లు జ‌న‌సేన‌ను మంగ‌ళ‌హార‌తుల‌తో ఆహ్వానిస్తున్నారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సిద్ధాంతాలు న‌చ్చి., ఓ మారుమూల గ్రామ‌స్తులు పార్టీని త‌మ గ్రామంలోకి ఆహ్వానించ‌డం.. అదీ స్వ‌చ్చందంగా., ఇది నిజంగా పార్టీకి, పార్టీ శ్రేణుల‌కి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్నిచ్చే అంశం..

అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం.. రాజ‌కీయ పోరాటాల అడ్డా.. దివిసీమ గ‌డ్డ‌..కృష్ణా జిల్లా రాజ‌కీయాల‌ని ప్ర‌భావితం చేయ‌గ‌లిగే స‌త్తా ఉన్న ప్రాంతం.. ఇక్క‌డ జ‌న‌సేన తొలి అడుగు ప‌డింది.. పార్టీ కోసం ఎడాదిన్న‌ర‌గా అక్ష‌ర య‌జ్ఞం చేస్తున్న నా ఆధ్వ‌ర్యంలో ఆ తొలి అడుగు ప‌డ‌డం ఎంతో ఆనందాన్నిచ్చింది.. నియోజ‌క‌వ‌ర్గంలోని మోపిదేవి మండ‌లం మెర‌క‌న‌ప‌ల్లి గ్రామం.. కాస్త మూరుమూల‌న ఉన్న గ్రామ‌మే అయినా., రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువే.. త‌మ స‌మ‌స్య‌లు తీర్చ‌గ‌ల స‌త్తా ఉన్న పార్టీ జ‌న‌సేన మాత్ర‌మేన‌న్న న‌మ్మ‌కానికి వ‌చ్చిన ఆ గ్రామ‌స్తులు., రాజ‌కీయాల్లో మార్పుని ఆహ్వానిస్తూ.. జ‌న‌సేన జెండా గ‌ద్దెను త‌మ గ్రామంలో ఏర్పాటు చేశారు.. ఈ రోజు నుంచి సేన సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి ఉంటామ‌ని తేల్చిచెప్పారు.. ఈ కార్య‌క్ర‌మానికి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఉన్న జ‌నసేన ముఖ్య‌కార్య‌క‌ర్త‌లంద‌రికీ ఆహ్వానం ప‌లికారు..

జిల్లాలో ప‌డుతున్న తొలి అడుగు కావ‌డంతో పార్టీకి చెందిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కూడా మొత్తం క‌దలివ‌చ్చి త‌మ ఐక్య‌త‌ని చాటారు.. చ‌ల్ల‌ప‌ల్లి మండ‌ల కేంద్రం నుంచి భారీ ర్యాలీగా త‌ర‌లివ‌చ్చి., పార్టీ ఉనికిని ఘ‌నంగా చాటారు.. జెండా గ‌ద్దె ఏర్పాటు చేయ‌డానికి త‌మ వంతు కృషి చేసిన యువ‌కులు దిలీప్‌, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, సీనియ‌ర్ మెగా ఫ్యామిలీ అభిమాని శివ త‌దిత‌రులు ఈ మ‌హ‌త్కార్యాన్ని త‌ల‌పెట్ట‌గా., పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బాట‌లో అతిధులు కూడా అడుగు వేశారు.. పార్టీలో జెండా మోసే కార్య‌క‌ర్తే ముందు అంటూ వారితోనే జ‌న‌సేన గ‌ద్దెను ప్రారంభింపచేశారు..

జ‌న‌సేన ముఖ్య‌కార్య‌క‌ర్త‌లు పోతిన వెంక‌ట‌మ‌హేష్ చేతుల మీదుగా మండ‌లి రాజేష్‌, వాలిశెట్టి మ‌ల్లి, సుగుణ్‌బాబు, బూర‌గ‌డ్డ శ్రీకాంత్‌, న‌ల్లగోపు చ‌ల‌ప‌తి, వెన్న య‌తేంద్ర‌, ఎన్ఆర్ఐ జ‌న‌సేన వింగ్ నుంచి చంద్ర‌శేఖ‌ర్ పొలిశెట్టి, మ‌హిళా కార్య‌క‌ర్త లావ‌ణ్య‌.. అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు రాయ‌పూడి వేణు, ప‌ద్యాల వెంక‌ట‌ప్ర‌సాద్‌, బండ్రెడ్డి హ‌రి, సిద్ధినేని అశోక్‌లు జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.. వంద‌లాదిగా హాజ‌రైన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు గ్రామ‌స్తుల జ‌య‌జ‌య‌ధ్వానాల మ‌ధ్య ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది..

అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ఆహుతులు జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాల‌ను ఏక‌రువు పెట్టారు.. రాబోయే రోజుల్లో పార్టీ ప‌టిష్టానికి చేప‌ట్ట‌బోయే చ‌ర్య‌ల‌కు ప్ర‌తి ఒక్క‌రి స‌హ‌కారాన్ని కోరారు.. అదే స‌మ‌యంలో జ‌న‌సేన‌ను దివిసీమ‌లోకి సాద‌రంగా ఆహ్వానించిన మెర‌క‌న‌ప‌ల్లి గ్రామానికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా., గ్రామంలోని ఏ వ్య‌క్తికి స‌మ‌స్య వ‌చ్చినా తామంతా అండ‌గా నిల‌బ‌డ‌తామ‌ని ముక్త‌కంఠంతో హామీ ఇచ్చారు..

కృష్ణాజిల్లాలో జ‌న‌సేన పార్టీ తొలి అడుగు అదిరిపోయే రీతిలో ప‌డ‌డంతో ప్ర‌త్య‌ర్ధులు ఎంక్వ‌యిరీలు మొద‌లుపెట్టారు.. ఇక ప్ర‌తి అడుగూ ప్ర‌భంజ‌నం కాబోతోంద‌న్న సంకేతాలు కూడా అవ‌నిగ‌డ్డ‌లో వినిపించాయి.. ప్ర‌తి ఊరిలో జ‌న‌సేన స్థూపాలు ఏర్పాటు చేసేందుకు ప‌లువురు ముందుకి వ‌చ్చారు.. పార్టీ గ్రామ‌స్థాయిలో వేళ్లూనుకునేందుకు ఈ ప‌రిస్థితులు స‌హ‌క‌రిస్తాయ‌న్న వ్యాఖ్యానాలు విన‌బ‌డుతున్నాయి.. వ‌చ్చే వారం ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో రెండు గ్రామాల్లో జ‌న‌సేన జెండా రెప‌రెప‌లాడ‌నుండ‌గా., ఈ లోపే మేముసైతం అంటూ త‌మ జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో కార్య‌క‌ర్త‌లు ముందుకి వ‌చ్చారు..

Share This:

4,746 views

About Syamkumar Lebaka

Check Also

డ‌ల్లాస్‌లో ప్ర‌వాస‌గ‌ర్జ‌నకి జ‌న‌సేన కీ నేత‌ల కిక్‌. అమెరికా అదిరిప‌డే రీతిలో స‌భ ఉండాల‌ని పిలుపు.

డ‌ల్లాస్ వేదిక‌గా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన జ‌న‌సేన ప్ర‌వాస గ‌ర్జ‌న అమెరికా చ‌రిత్ర‌లోనే న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఉండాల‌ని పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen − one =