Home / జన సేన / దివ్యాంగుల క్రికెట్ టోర్నీకి జ‌న‌సేన సాయం(5 ల‌క్ష‌ల‌).. వైక‌ల్యం ప్ర‌తిభ‌కి అడ్డుకాద‌న్న జ‌న‌సేన అధినేత‌..

దివ్యాంగుల క్రికెట్ టోర్నీకి జ‌న‌సేన సాయం(5 ల‌క్ష‌ల‌).. వైక‌ల్యం ప్ర‌తిభ‌కి అడ్డుకాద‌న్న జ‌న‌సేన అధినేత‌..

ఆత్మ‌విశ్వాసంతో ప‌ని చేస్తే., ల‌క్ష్యానికి ఏదీ అడ్డురాద‌నే సిద్ధాంతాన్ని బ‌లంగా న‌మ్మే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్., అదే స్పూర్తితో ముందడుగు వేసే ప్ర‌తి ఒక్క‌రికీ చేయూత‌నివ్వ‌డంలోనూ ముందుంటారు.. దివ్యాంగుల క్రికెట్‌కి ఆయ‌న చేసిన సాయం అలాంటిదే.. ఈ నెల 14 నుంచి నాలుగు రోజుల పాటు హైద‌రాబాద్ వేదిక‌గా జాతీయ స్థాయి దివ్యాంగుల క్రికెట్ టోర్నీ జ‌ర‌గ‌నుంది.. హైద‌రాబాద్‌లోని పార్టీ కార్యాల‌యంలో జ‌న‌సేన అధినేత‌ని క‌ల‌సిన బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేష‌న్(బీడీసీఏ) స‌భ్యులు, దివ్యాంగులైన క్రికెట‌ర్లు టోర్నీ వివ‌రాలు ఆయ‌న ముందుంచారు.. 24 రాష్ట్రాల‌కి చెందిన జ‌ట్టు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయ‌ని తెలిపారు..

దివ్యాంగుల క్రికెట్ టోర్న‌మెంట్ పేరు చెప్ప‌గానే క్రీడాకారుల‌ ఆత్మ‌విశ్వాసానికి ఫిదా అయిన జ‌న‌సేనాని, వారిని అభినంధించారు.. వైక‌ల్యం ప్ర‌తిభ‌కి ఏ మాత్రం అడ్డంకి కాద‌ని దివ్యాంగులైన క్రికెట‌ర్లు నిరూపిస్తున్నార‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిప్రాయ‌ప‌డ్డారు.. రెండో దివ్యాంగుల జాతీయ క్రికెట్ టోర్న‌మెంట్ టీ-20 పోటీల‌కు త‌న‌వంతు 5 ల‌క్ష‌ల రూపాయిల ఆర్ధిక సాయాన్ని ప్ర‌క‌టించారు.. ఇందుకు సంబంధించిన చెక్‌ను బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌కి జ‌న‌సేన అధినేత అంద‌జేశారు..

అనంత‌రం దివ్యాంగ క్రికెట్ జాతీయ జ‌ట్టు కెప్టెన్ వ‌సంత‌కుమార్‌, ఏపీ జ‌ట్టు స‌భ్యులు శ్రీనివాసులు, తేజ‌ల‌తో కాసేపు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముచ్చ‌టించారు.. ఆత్మ‌స్థైర్యంతో వారు క్రీడ‌ల్లో పాల్గొన‌డం దివ్యాంగులంద‌రికీ స్ఫూర్తి నిస్తుంద‌ని ఆయ‌న అన్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో బీడీసీఏ చైర్మ‌న్ డా.పి.హ‌రిప్ర‌సాద్‌, కార్య‌ద‌ర్శి కె.రామ్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.. సాధించాల‌న్న త‌ప‌న ఉన్న ఎవ్వ‌రికైనా జ‌న‌సేన చేయూత‌నిస్తుంద‌ని ఆ పార్టీ అధినేత మ‌రోసారి నిరూపించారు.. మొన్న కామ‌న్‌వెల్త్ గోల్డ్ విన్నింగ్ వెయిట్ లిఫ్టర్ రాగాల వెంక‌ట స‌తీష్‌కి 10 ల‌క్ష‌ల ప్రోత్సాహం అందించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., తాజాగా దివ్యాంగుల క్రికెట్ టోర్నీకి త‌న‌వంతు సాయం అంద‌జేయ‌డం గ‌మ‌నార్హం..

Share This:

About Syamkumar Lebaka

Check Also

అస‌లు ‘సూత్ర‌ధారి’.. ”అజ్ఞాత‌వాసి” టీవీ9 ‘ర‌విప్ర‌కాషే’.. కెమెరామెన్ ‘ట్విట్ట‌ర్‌’తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌..

రెండు రోజులుగా వ‌రుస ట్వీట్ల‌తో నారా వారి మీడియా మాఫియాని బెంభేలెత్తిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. శ‌నివారం ఉద‌యం నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × four =

%d bloggers like this: