Home / ఎడిటోరియల్స్ / దీక్షా..ద‌క్ష‌త‌.. అంటే జ‌న‌సేనుడిదే.. ఇదిగో రుజువు..

దీక్షా..ద‌క్ష‌త‌.. అంటే జ‌న‌సేనుడిదే.. ఇదిగో రుజువు..

img-20170103-wa0135

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. ఆయన‌తో ప్ర‌తి ప్ర‌యాణం ఓ జ్ఞాప‌కం.. ఓ అనుభూతి.. పుస్త‌కంలో లిఖించ‌ద‌గ్గ ఓ పేజీ.. ప్ర‌తి విష‌యంలో ఆయ‌న‌కున్న నిబ‌ద్ద‌త‌, నిజాయితీ, పోరాట‌ప‌టిమ ఎంత‌టి వారినైనా ఇట్టే క‌ట్టిపారేస్తుంది.. జ‌న‌సేనుడితో జీవితాంతం న‌డిచేలా చేస్తుంది.. ఓ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త భుజానికి ఎత్తుకున్న త‌ర్వాత‌., మార్గాలు అన్వేషించే క్ర‌మంలో గానీ., బాధితుల్ని ఓదార్చే క్ర‌మంలోగాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లో ఓ రియ‌ల్ లీడ‌ర్ క‌న‌బ‌డ‌తాడు.. నిబ‌ద్ద‌త క‌లిగిన నిజ‌మైన నాయ‌కుడు.. నీటి మూట‌ల్లాంటి హామీలు ఇచ్చే నాయ‌కులున్న నేటి రోజుల్లో నిబ‌ద్ద‌త‌, నిజాయితీ క‌లిగిన నాయ‌కుడు అనే ప‌దానికున్న విలువ ఎంత‌టిదైనా., దానికి అచ్చుపోసి గుద్దిన‌ట్టు స‌రిపోయే వ్య‌క్తి జ‌న‌సేనాని..

img-20170103-wa0171

ఉద్దానం కిడ్నీ బాధితుల విష‌యంలో స‌ర్కారుకి 48 గంట‌ల డెడ్‌లైన్ విధించి., విజ‌యం సాధించే క్ర‌మంలో ప‌వ‌న్‌తో పాటు జ‌ర్నీని ఓ సామాన్య జ‌న‌సైనికుడు సోష‌ల్ మీడియాలో పంచుకున్న‌ప్పుడు.. ఆ సామి గొప్ప న‌లుగురికీ తెలియాల్సిందేన‌ని పించింది.. ఉద్దానం బాధితుల‌ని పరామ‌ర్శించ‌డంతో పాటు వారి స‌మ‌స్య ప‌రిష్కారానికి పోరాడాల‌ని నిర్ణ‌యించుకున్న ప‌వర్‌స్టార్‌., ఇచ్చాపురం వెళ్లే ముందు రోజు రాత్రే గ్రౌండ్ వ‌ర్క్ మొత్తం పూర్తి చేసుకున్నారు.. విశాఖ నుంచి 250 కిలోమీట‌ర్ల జ‌ర్నీ కోసం., త‌న కోసం వేచిఉన్న బాధితుల్ని ప‌రామ‌ర్శించేందుకు ఉద‌యం 7 గంట‌ల‌కే ఆయ‌న ఇచ్ఛాపురం బ‌య‌లుదేరారు.. అక్క‌డి నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు ఉద్దానం బాధితుల కోసం ఆయ‌న చేసిన అలుపెరుగ‌ని పోరాటం తెలుసుకుంటే అంతా హ్యాట్సాఫ్ ప‌వ‌న్ అనాల్సిందే..

img-20170103-wa0170

ఈ జ‌ర్నీలో ప్ర‌తి అడుగులో వెంట న‌డిచిన ఓ జ‌న‌సైనికుడు బ‌య‌టి ప్ర‌పంచం చూడ‌ని మ‌న నాయ‌కుడు ఎలా ఉంటాడు అనే విష‌యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టాడు.. అడుగ‌డుగునా త‌న‌ను ప‌లుక‌రించేందుకు రోడ్ల‌పై వంద‌లాదిగా పోగైఉన్న జ‌నం., అంద‌రికీ అభివాదం చేస్తూ., ఎవ్వ‌రినీ నిరాశ‌ప‌ర్చ‌కుండా అనుకున్న స‌మ‌యానికి., త‌న కోసం వేచిచూస్తున్న ఆ జీవ‌శ్చ‌వాల వ‌ద్ద‌కు చేరుకున్నారు.. వారిని ప‌రామ‌ర్శించారు.. స‌ర్కారుకి డెడ్‌లైన్ విధించ‌డం ద్వారా వారిలో జీవితంపై న‌మ్మ‌కాన్ని క‌లిగించారు.. బ‌తుకుమీద విశ్వాసం నింపారు..

img-20170103-wa0163

అక్క‌డి నుంచి త‌న‌కోసం రోడ్డుపై మూడు కిలోమీట‌ర్ల మేర వేచిచూస్తున్న జ‌న‌స‌మూహం వైపు క‌దిలారు.. త‌మ నాయ‌కుడ్ని చూసేందుకు ఉప్పైనై ఉప్పొంగిన జ‌న‌సంద్రానికి అభివాదం చేశారు.. ఆయ‌న్ని చేరుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన అంద‌రికీ త‌న వెచ్చ‌ని చేతుల‌తో స్ప‌ర్శ‌తో రుచు చూపి., సాయంత్రం నాలుగున్న‌ర‌కి విశాఖ తిరిగి చేరుకున్నారు.. ప్ర‌యాణం మొద‌లైంది మొద‌లు., ముగిసే వ‌ర‌కు అంత ఒత్తిడిలో ఆయ‌న ఎక్క‌డా తొణ‌క‌లేదు.. ఆ మొత్తం స‌మ‌యంలో ఆయ‌న ఆలోచించిన విష‌యం ఒక్క‌టే ఉద్దానం బాధితుల స‌మ‌స్య ప‌రిష్కారం ఎలా..? 500 కిలోమీట‌ర్ల జ‌ర్నీ., ర‌హ‌దారి పొడుగునా కిట‌కిట‌లాడే జ‌నం., వారికి అభివాదం చేస్తూ ముందుకి క‌ద‌ల‌డం.. ప‌రామ‌ర్శ‌లు,,., ప్ర‌తిస్పంద‌న‌లు.. అదీ క‌నీసం మంచినీటిని కూడా తీసుకునే తీరిక లేకుండా.., ఇవేమీ ఆయ‌న్ని అల‌స‌ట‌కి గురిచేయ‌లేక‌పోయాయి..

uddanam2

విశాఖ తిరిగి చేరుకున్న త‌ర్వాత ఆయ‌న విశ్రాంతి తీసుకుంటార‌ని భావించిన జ‌న‌సేన టీంకి షాక్ ఇచ్చారు.. ఓ గంట‌లో అంతా మీట్ అవుతున్నాం.. ఉద్దానం బాధితుల రిలీఫ్ గురించి చ‌ర్చించ‌డానికి అన్న జ‌న‌సేనుడి గొంతు నుంచి వ‌చ్చిన మాట‌లు విని.. ఓ గంట త‌ర్వాత అంతా స‌మావేశం కావ‌డం., నాలుగు గంట‌ల పాటు చ‌ర్చించి., త‌క్ష‌ణం తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ట్విట్ట‌ర్ ద్వారా స్ప‌ష్టంగా స‌ర్కారుకి ఆదేశాలివ్వ‌డం.. అన్నీ జ‌రిగిపోయాయి.. ఇది జ‌స్ట్ ఓ స‌మ‌స్య ప‌రిష్కారానికి ఆయ‌న చేసిన వ‌ర్క‌వుట్‌.. ఉద్దానం బాధితులు ప‌డుగున్న క‌ష్టాల ముందు ఆయ‌న‌కు తిండి, విశ్రాంతి లాంటి అంశాలు పెద్ద‌గా క‌నిపించ‌లేదు.. అదే నిజ‌మైన లీడ‌ర్‌షిప్‌లో ఉన్న క్వాలిటీ.. మ‌రి ఈ లీడ‌ర్ రాష్ట్రానికి పాలిక అయితే., క‌ష్టం అన్న‌మాట జ‌నం దాపుల‌కి రావ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌దు..

Share This:

1,722 views

About Syamkumar Lebaka

Check Also

మార్పు మొద‌లైంది..అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది- అభ్య‌ర్ధుల‌తో జ‌న‌సేనాని..

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన వెంట‌నే నాలుగు రోజులు సీట్లు, ఓట్లు అంటూ హ‌డావిడి చేసిన రాజ‌కీయ పార్టీలు, ఆ పార్టీల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × 5 =