Home / పవన్ టుడే / దెందులూరుపై జ‌న‌సేనాని దండ‌యాత్ర‌..రౌడీ ఎమ్మెల్యేపై ఫైర్‌.. చ‌ర్య‌ల‌కి డిమాండ్‌..

దెందులూరుపై జ‌న‌సేనాని దండ‌యాత్ర‌..రౌడీ ఎమ్మెల్యేపై ఫైర్‌.. చ‌ర్య‌ల‌కి డిమాండ్‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దెందులూరుపై దండ‌యాత్ర చేశారు.. అక్క‌డ త‌న బ‌లం.. బ‌ల‌గం ప్ర‌త్య‌ర్ధుల‌కి రుచి చూపించి మ‌రీ వ‌చ్చారు.. ముఖ్యంగా అరాచ‌కాలు, అక్ర‌మాల‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన దెందులూరు ఎమ్మెల్యేకి చుక్క‌లు చూపించారు.. ఇలాంటి రౌడీల‌కి తాను భ‌య‌ప‌డ‌న‌ని చెప్పక‌నే చెప్పారు.. 27 కేసుల్లో నింధితుడిగా ఉన్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ల‌క్ష్యంగా కాస్త ఘాటుగానే విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు.. అదే స‌మ‌యంలో అత‌న్ని ప్ర‌భుత్వ విప్ చేసిన టీడీపీనీ దెందులూరు ఎన్టీఆర్ బొమ్మ సాక్షిగా నిల‌దీశారు.. దాడులు, దౌర్జ‌న్యాల‌తో ప్ర‌జ‌ల్ని నానా ఇబ్బందుల‌కి గురిచేస్తున్న చింత‌మ‌నేనిని తిట్టేందుకే వ‌చ్చాన‌ని చెప్పి మ‌రీ చెడామ‌డా వాయించేశారు.. శాస‌న‌స‌భ్యుల్ని క్ర‌మ‌శిక్ష‌ణ‌లో ఉంచాల్సిన ఆ ఎమ్మెల్యేకే క్ర‌మ‌శిక్ష‌ణ లేదంటూ ఎద్దేవాచేశారు.. అలాంటి ఎమ్మెల్యేకి విప్ అనే ప‌ద‌వి క‌ట్ట‌బెట‌క్టిన టీడీపీకి తాను ఎందుకు అండ‌గా నిల‌బ‌డాల‌ని ప్ర‌శ్నించారు..

దెందులూరు ఎమ్మెల్యే మాట‌ల‌కి తాను బెదిరిపోన‌న్న ప‌వ‌న్‌., 16 ఏళ్ల వ‌య‌సులోనే ఆకు రైడీల‌ను త‌న్ని త‌రిమాన‌ని చెప్పారు.. గాలి రౌడీలు, ఆకు రౌడీలకు తాను భ‌య‌ప‌డ‌న‌న్న ఆయ‌న‌., ఒక్క సైగ చేస్తే కాళ్ళు విరగ్గొట్టి కూర్చోబెడతారంటూ హెచ్చ‌రించారు.. ఆ రౌడీ ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి అదుపు చేస్తారనే నమ్మకంపోయిందనప్పారు. ముఖ్యమంత్రికీ, వారి అబ్బాయి లోకేశ్ కీ దెందులూరు ఎమ్మెల్యే అంటే భయం అన్నారు. దెందులూరు వేదిక‌గా డీజీపీకి కూడా సూచ‌న చేశారు.. చ‌ట్ట వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కి పాల్ప‌డుతూ, రాజ్యాంగేత‌ర శ‌క్తిగా వ్య‌వ‌హ‌రిస్తున్న రౌడీ ఎమ్మెల్యేని అదుపు చేయాల్సిన బాధ్య‌త‌ను గుర్తు చేశారు.. ఈ విష‌యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం సెక్రెటరీ, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీ స్పందించాల‌ని డిమాండ్ చేశారు.. పోలీస్, జ్యూడీషియరీ ఈ విషయంలో పని చేయకపోతే… ప్రజలు తమ పని తాము చేయాల్సి వ‌స్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు అమోదయోగ్యమైన పరిపాలన ఉంటే భరిస్తారు., లేకపోతే తన్ని తరిమేస్తారని హెచ్చ‌రించారు… ఆడపిల్లలను, మహిళలను బూతులు తిడితే చూస్తూ ఊరుకోబోమ‌న్నారు.. ప్ర‌జాగ్ర‌హాన్ని చ‌దిచూడాల్సి వ‌స్తుంద‌న్నారు..సింగ‌పూర్ త‌ర‌హా రాజ‌ధాని క‌డ‌తామ‌న్న ముఖ్య‌మంత్రికి., దెందులూరు ఎమ్మెల్యే లాంటి వారిని సింగ‌పూర్‌లో ఏం చేస్తారో తెలియ‌దా అంటూ ప్ర‌శ్నించారు.. సింగ‌పూర్‌లో ఇలా చేస్తే బెత్తంతో కొడ‌తార‌న్న ఆయ‌న‌ అదే సౌదీలో ఏకంగా తల తీసేస్తారన్నారు. అమెరికా, ఇంగ్లాండ్ ల్లో ఇటువంటి వాళ్ళని చట్ట సభల్లోకి అడుగుపెట్టనీయర‌న్నారు మ‌న దేశంలో నేర‌స్తుల్నిచ‌ట్ట స‌భ‌ల‌కి వెళ్ల‌కుండా చేయ‌లేక సుప్రీం కోర్టు చేతులెత్తేసింద‌న్నారు..       Advertisement.

దళిత కార్మికుడిపై దాడి చేసి కులం పేరుతో దూషిస్తే ఏం చేస్తున్నారని పోలీసుల్ని నిల‌దీశారు..? వ‌ఋద్దుల్ని తిడుతుంటే ప్ర‌భుత్వం ఏం చేస్తుదంటూ నిల‌దీశారు..దెందులూరు ఎమ్మెల్యే అక్రమాలు, అక్రమ ఆస్తులపై సుమోటోగా హైకోర్టు కేసు తీసుకోవాలి.. . ప్రజల్లో, యువతలో చేవ చచ్చిపోలేదన్నారు.దెందులూరు ఎమ్మెల్యే అదుపులోకి తీసుకుంటారా లేదా అంటూ నిల‌దీశారు…ఎమ్మార్వో వనజాక్షి మీద దాడి చేసినప్పుడే సక్రమంగా స్పందించి చర్యలు తీసుకొంటే ఈ దుస్థితి ఇక్కడ అబ్బుతున్న అనుమానేమ‌న్నారు..జ‌న‌సేన అధికారంలోరి వ‌స్తే పార్టీ మేనిఫెస్టో ద్వారా మీ స‌మ‌స్య‌లు తీరుస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు..

Advertisement.

Share This:

1,249 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 − 3 =