Home / జన సేన / దేశ రాజ‌కీయాల్లో సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా మారిన జ‌న‌సేనుడు.. ప‌వ‌న్‌తో మాట‌లు పంచుకున్న బీఎస్పీ నేత‌లు..

దేశ రాజ‌కీయాల్లో సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా మారిన జ‌న‌సేనుడు.. ప‌వ‌న్‌తో మాట‌లు పంచుకున్న బీఎస్పీ నేత‌లు..

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో., ప్ర‌జ‌ల త‌రుపున పోరాడే విష‌యంలో జ‌న‌సేనుడి శైలే వేరు.. ప్ర‌భుత్వాలు ప్ర‌జా వ్య‌తిరేక విధానాలు అవ‌లంభిస్తున్న‌ప్పుడు., వాటిని ఎదుర్కోవ‌డం ఎలా..? అనే విష‌యంలో ఆయ‌న‌కి ఆయ‌నే సాటి.. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే నేటి త‌రం రాజ‌కీయ నాయ‌కుల‌కి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఓ దిక్సూచి.. అవును ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ర‌గిలిన ప్ర‌త్యేక హోదా ఉద్య‌మ‌మే అందుకు ఉదాహ‌ర‌ణ‌.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కి చేసిన ద్రోహానికి నిర‌స‌న‌గా నిర్మించిన ఉద్య‌మానికి ఆయ‌నే ఆద్యుడు.. జేఎఫ్‌సీతో జ‌న‌సేన అధినేత ముంద‌డుగు వేశాకే., హోదా క్రెడిట్ మొత్తం ఆమాంతం ఆయ‌న పోకెట్‌లో ఎక్క‌డ వేసుకుంటారోన‌న్న ఆందోళ‌న‌లో అధికార‌-విప‌క్షాల్లో మొద‌లైంది.. ఇక అవిశ్వాసం పెట్టి కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని పిలుపు ఇచ్చినా, ఆమ‌ర‌ణ‌దీక్ష చేప‌డ‌తానంటూ మోడీ స‌ర్కారు వెన్నులో వ‌ణుకు పుట్టించినా ఆయ‌న‌కే చెల్లు.. జ‌న‌సేనుడి రాజ‌కీయ తంత్రం రాష్ట్రంలో రాజ్య‌మేలుతున్న పార్టీల‌కి కంట‌కింపుగా ఉంటే., ఉత్త‌రాధి పార్టీల‌ని మాత్రం ఆయ‌న విప‌రీతంగా ఆక‌ర్షిస్తున్నారు..

జ‌న‌సేన అధినేత అనంత ప‌ర్య‌ట‌న అనంత‌రం ఆమ్ ఆద్మీ పార్టీ నేత వీరేంద్ర అక్క‌డ క‌రువు ప‌రిస్థితుల‌పై మ‌రింత అధ్య‌య‌నానికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని వ‌చ్చి క‌ల‌వ‌గా., తాజాగా బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) నేత‌లు హైద‌రాబాద్ వ‌చ్చి మ‌రీ ఆయ‌న్ని క‌లిసి వెళ్లారు.. మంగ‌ళ‌వారం జ‌న‌సేన ప‌రిపాల‌నా కార్యాల‌యానికి విచ్చేసిన‌ ఆ పార్టీ రాజ్య స‌భ స‌భ్యులు వీర్‌సింగ్‌తో పాటు బీఎస్పీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల స‌మ‌న్వ‌య‌క‌ర్త గౌరీప్ర‌సాద్ ఉపాస‌క్‌, బీఎస్పీ తెలంగాణ విభాగం నేత బాల‌య్య‌లు మ‌ర్యాద పూర్వ‌కంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని క‌లిశారు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా-విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల అమ‌లులో జాప్యంపై జ‌న‌సేనానితో బీఎస్పీ నేత‌లు చ‌ర్చించారు.. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ప‌ర‌స్ప‌రం చ‌ర్చ‌లు జ‌రిపారు.. ప‌లు కీల‌క అంశాల‌పై ఈ చ‌ర్చ సాగిన‌ట్టు తెలుస్తోంది.. మిగిలిన పార్టీల నేత‌లు హోదా మ‌ద్ద‌తు కోసం హైద‌రాబాద్ టూ హ‌స్తిన అంటూ ప‌రుగులు పెడుతుంటే., జ‌న‌సేనుడి కూర్చున్న చోటు నుంచే త‌న ప‌ని తాను చేసేస్తుండ‌డం గ‌మ‌నార్హం..

Share This:

3,464 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen + six =