Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / ద‌క్షిణ భార‌తంపై దాక్షిణ్య‌మేల‌.. జ‌ల్లిక‌ట్టు, కోడిపందాల ర‌ద్దుపై ప‌వ‌న్ ప‌వ‌ర్‌ఫుల్ ఎటాక్‌..

ద‌క్షిణ భార‌తంపై దాక్షిణ్య‌మేల‌.. జ‌ల్లిక‌ట్టు, కోడిపందాల ర‌ద్దుపై ప‌వ‌న్ ప‌వ‌ర్‌ఫుల్ ఎటాక్‌..

c2gqxkeuaaaukre

ద‌క్షిన భార‌త సంప్ర‌దాయ క్రీడ‌లు జ‌ల్లిక‌ట్టు, కోడిపందాల‌పై నిషేధం విధించ‌డంపై జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.. కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు.. జంతుహింస పేరుతో ద్ర‌విడ సంస్కృతిపై కేంద్రం దాడి చేస్తోంద‌ని జ‌న‌సేనాని ఆరోపించారు.. జంతుహింస‌పై కేంద్రానికి ఖ‌చ్చిత‌మైన నిబ‌ద్ద‌త ఉంటే., కోన్ని ల‌క్ష‌ల కోళ్లు, ఆవులు, గేదెల్ని బ‌లితీసుకుంటున్న పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ‌, బీఫ్ వ్యాపారాల‌పై బ్యాన్ విధించాల‌ని జ‌న‌సేనాని డిమాండ్ చేశారు.. కోడి పందాల నిర్వ‌హ‌ణ వెనుక ఓ పురాణ‌కాలం నాటి చ‌రిత్ర‌ను ప‌వ‌న్ ప్ర‌స్తావించారు.. ప‌ర‌మ శివుడు కుక్కుటేశ్వ‌రుడి అవ‌తారంలో రాక్ష‌స సంహారం గావించాడ‌ని., అందుకు సూచిక‌గా తెలుగు ప్ర‌జ‌లు అనాధిగా కోడి పందాలు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నార‌ని ఆయ‌న జ‌న‌సేనాని స్ప‌ష్టం చేశారు.. అలాంటి సంస్కృతిపై ఎలా నిషేధం విధిస్తార‌ని ప్ర‌శ్నించారు..

img_8982 img_8983 img_8984 img_8985

భార‌త‌దేశం బీఫ్ ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల్లో ప్ర‌పంచంలోనే టాప్ ప్లేస్‌లో ఉంద‌న్న ఆయ‌న‌., 2015లో 2.4 బిలియ‌న్ ట‌న్నుల బీఫ్ ఎక్స‌పోర్ట్ జ‌రిగింద‌న్న ఆయ‌న., దీని ద్వారా వ‌చ్చిన ఆదాయం ఐదు బిలియ‌న్ డాల‌ర్లని తెలిపారు.. ఏటా ఈ ఎగుమ‌తులు 14 శాతం వ‌ర‌కు పెరుగుతున్నాయ‌ని అన్నారు.. ఇంత మొత్తం బీఫ్ ఎక్స్‌పోర్టు చేయాలంటే ఎన్ని ఆవుల్ని, గెదెల్ని వ‌ధించాల‌ని ప్ర‌శ్నించారు.. అది జంతుహింస‌గా మీకు క‌న‌బ‌డ‌లేదా., జ‌ల్లిక‌ట్టు మాత్ర‌మే జంతుహింస‌గా క‌న‌బ‌డిందా అంటూ కేంద్రాన్ని నిల‌దీశారు.. తాను పొలాచ్చీ షూటింగ్‌లో ఉన్న సంద‌ర్బంలో జ‌ల్లిక‌ట్టు బ్యాన్‌కి సంబంధించి చాలా మంది కేంద్రం తీరుపై త‌మ బాధ‌ని వెళ్ల‌గ‌క్కార‌ని తెలిపారు..

img_8986 img_8987 img_8988

ఇక పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌స్తే., ఏటా సుమారు 8.4 ల‌క్ష‌ల ట‌న్నుల కోడిమాంసాన్ని వినియోగిస్తున్నాం.. అంత మాంసానికి ఎన్ని కోళ్ల‌ను చంపాలి., ఇది జంతుహింస‌లా క‌న‌బ‌డటం లేదా అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.. ద‌క్షిణ‌భార‌తాన్ని కేంద్రం ఎలా చూస్తుందో చెప్ప‌డానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌న్నారు.. ఇలాంటి ప‌రిస్థితులు సృష్టించ‌డం వ‌ల్ల ప్రాంతీయ అస‌మాన‌త‌లు పెరుగుతాయ‌ని జ‌న‌సేనాని అభిప్రాయ‌ప‌డ్డారు.. నైతిక పైత్యం అనే అంశం., ఈ ప్రాంతాల మ‌ధ్య గీత‌ల‌ను గీస్తుంద‌న్నారు.. జ‌ల్లిక‌ట్టు, కోడిపందాల నిర్వ‌హ‌ణ‌కు జ‌న‌సేన పార్టీ త‌రుపున ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ద్ద‌తు తెలిపారు..

c2lpcxmukaayl1y c2lxca7ukaaziuo

అదే స‌మ‌యంలో త‌న‌కు మాతృభూమిపైనా, సంస్కృతి, ఆవుల‌పైనా ఉన్న గౌర‌వాన్ని కూడా చాటి చెప్పారు.. త‌న ఫాంలో ఉన్న గోశాల‌., జీవామృతం సాయంతో చేసే సేంద్రీయ వ్య‌వ‌సానాన్ని గురించి ఈ ట్వీట్ లో ప్ర‌స్తావించారు..

Share This:

2,322 views

About Syamkumar Lebaka

Check Also

పార్టీ మార్పు వదంతుల‌పై ఘాటుగా స్పందించిన జేడీ..

జ‌న‌సేన పార్టీని వీడుతున్నారంటూ త‌న‌పై వ్యాపిస్తున్న వ‌దంతుల‌పై ఆ పార్టీ విశాఖ పార్ల‌మెంట్ అభ్య‌ర్ధి, సిబిఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ …

One comment

  1. జై జనసేన………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 + sixteen =