Home / జన సేన / ద‌టీజ్ ప‌వ‌ర్‌స్టార్‌…..

ద‌టీజ్ ప‌వ‌ర్‌స్టార్‌…..

sravan-pawan
మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడిగా వెండితెర‌పై అడుగుపెట్టినా, అన‌తికాలంలో తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సాధించ‌గ‌లిగారు.. హీరోగా నంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ సాధించారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. మ‌రి పేరులోనే ప‌వ‌ర్ నింపుకున్న ప‌వ‌ర్‌స్టార్ రాజ‌కీయాల్లోకి ఎందుకు అడుగుపెట్టారు..? ఏం సాధించాల‌న్న‌ది ఆయ‌న ల‌క్ష్యం.. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కి బ‌దులిచ్చే ఓ క‌థ‌నాన్ని నేను ఓ వెబ్ పేజీలో చ‌దివా.. అది చ‌దివిన త‌ర్వాత ద‌టీజ్ జ‌న‌సేనాని అని నాకు అనిపించింది.. దాన్నీ ప‌వ‌న్‌టుడే ద్వారా మ‌రికొంత‌మందికి పంచాల‌ని భావించి మీ ముందు ఉంచుతున్నా..

2009 ఎన్నిక‌ల్లో పీఆర్పీ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌చారం చేసిన సంద‌ర్బంగా చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఆయ‌న మ‌న‌స్సుకి, ల‌క్ష్యానికి అద్దం ప‌ట్టేది.. ఈ విష‌యాన్ని చెప్పింది స్వ‌యానా ఆయ‌న‌పై నిత్యం విమ‌ర్శ‌లు గుప్పించే టిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే కావ‌డం విశేషం.. అప్ప‌ట్లో ఆదిలాబాద్ జిల్లాలో ప్ర‌చారం సంద‌ర్బంగా ఓ గ్రామానికి వెళ్లిన‌ప్పుడు., అక్క‌డ ఓ బోరు వ‌ద్ద నీటి కోసం జ‌నం త‌న్నులాడుకోవ‌డం జ‌న‌సేనాని కంట‌ప‌డిందంట‌.. గుక్కెడు నీటి కోసం కిలోమీట‌రు పొడుగు బిందెల వ‌ర‌స‌., ఒక‌రిని ఒక‌రు తోసుకోవ‌డం., వీట‌న్నింటికంటే ఎక్కువ‌గా ఓ దృశ్యం ప‌వ‌న్‌పై విప‌రీత‌మైన ప్ర‌భావం చూపిందంట‌.. ఓ ముస‌లామె నీటి కోసం నిల‌బ‌డితే ఆమెను తోసేసి అంతా నీరు తీసుకువెళ్తున్నార‌ట‌.. అది చూసిన జ‌న‌సేనానికి ఆ క్ష‌ణం నుంచి నిద్ర ప‌ట్ట‌లేదు.. అంతేకాదు క‌నీసం నీరు కూడా తాగ‌బుద్ది కాలేదంట‌.. తెల్ల‌వార‌క ముందే అప్ప‌ట్లో పీఆర్పీ నేత‌గా ఉన్న శ్రావ‌ణ్‌ని నిద్ర‌లేపి., అంత మంది గుక్కెడు నీటి కోసం కొట్టుకుంటుంటే., త‌న‌కు త‌న బాటిల్‌లో మిన‌ర‌ల్ వాట‌ర్ కూడా తాగాల‌ని పించ‌లేద‌ని చెప్పారు.. అంతేకాదు వెంట‌నే సొంత ఖ‌ర్చుల‌తో నార్నూరులో బోర్ కూడా వేయించి., ఆ త‌ర్వాతే ఆయ‌న నీరు తాగారంట‌..
ఇంకో విష‌యం ఏమంటే అక్క‌డ స్థానిక నేత‌లు ఎన్నిసార్లు బోర్లు వేయించినా నీరు ప‌డ‌లేదంట‌.. ప‌వ‌న్ వేయించిన చోట మాత్రం మంచినీరు ప‌డిందంట‌.. ఎస్ ద‌టీజ్ ప‌వ‌న్‌., మున‌స్ఫూర్తిగా చేసే ఏ ప‌నికైనా దేవుడి అండ ఉంటుంది.. నార్నూరు ప్ర‌జ‌ల దాహ‌ర్తి తీర్చాల‌న్న ప‌వ‌ర్‌స్టార్ సంక‌ల్పంలో నిజాయితీ ఉంది.. ఆయ‌న వారి ద‌ప్పిక తీర్చాలి అనిమాత్ర‌మే భావించారు.. వారి నుంచి ఏమీ ఆశించ‌లేదు.. అందుకే పాతాళ‌గంగ‌మ్మ పెల్లుబికి వ‌చ్చింది..
రాజ‌కీయాల్లో నాయ‌కులు ఎంతో మంది ఉండ‌వ‌చ్చు.. కానీ లీడ‌ర్లు మాత్రం అతికొద్ది మందే ఉంటారు.. ఎదుటివాడి క‌డుపులో ఆక‌లిని చూడ‌గ‌లిగిన‌వాడు.. ఎదుటివాడి బాధ‌ని త‌న బాధ‌గా భావించేవాడు.. ప్ర‌తి స‌మ‌స్య‌కీ ప‌రిష్కారం చూప‌గ‌లిగే వాడు మాత్ర‌మే లీడ‌ర్ కాగ‌లుగుతాడు.. ఇలాంటి వారిలో జ‌న‌సేనాని నంబ‌ర్ వ‌న్ ప్లేస్ లో ఉంటాడు.. ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చారు..? ఏం చేస్తారు..? అని ప్ర‌శ్నించే వారికి నార్నూరు బోరు ఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే.. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ప్ర‌జ‌లు త‌మ గుండెల్లో గుడిక‌ట్టి, దేవుడి స్థానం ఇచ్చారు..

Share This:

2,328 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

One comment

  1. Senaani synyam....

    That is power star*******…..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 4 =