Home / జన సేన / ద‌ద్ద‌రిల్లిన ధ‌వ‌ళేశ్వ‌రం.. క‌వాతుకి క‌ధం తొక్కిన ల‌క్ష‌లాది మంది జ‌న‌సైన్యం..

ద‌ద్ద‌రిల్లిన ధ‌వ‌ళేశ్వ‌రం.. క‌వాతుకి క‌ధం తొక్కిన ల‌క్ష‌లాది మంది జ‌న‌సైన్యం..

వ‌ర‌ద గోదావ‌రి జ‌న రూపం దాల్చి ఉర‌క‌లెత్తిన చందంగా.. ధ‌వ‌ళేశ్వ‌రం నుంచి ఉగ్ర‌రూపం దాల్చి ఉప్పొంగిన చందంగా.. జ‌న ఉప్పెన రాజ‌మండ్రిపై విరుచుకుప‌డింది.. మ‌హా సేన తోడు రాగా.. మ‌హా క‌వాతుతో జ‌న‌సేనుడు తూర్పులో ఘ‌నంగా అడుగు పెట్టారు.. రండి.. మ‌నం న‌డిస్తే.. దేశం మొత్తం మాట్లాడుకోవాలి అన్న జ‌న‌సేనాని పిలుపుకి ఉన్న ప‌వ‌ర్ సాక్ష్యాత్క‌రించిన వేళ‌.. ఆ ఘ‌ట్టం వ‌ర్ణ‌నాతీతం.. నవశకం రాజకీయాలను ఆవిష్కరించే క్రమంలో కవాతుగా తరలివచ్చి.. సర్ ఆర్థర్ కాటన్ వారధి దాటిన … జనసేనానికి జనగోదావరి హర్షధ్వానాలతో అభిషేకించింది. జ‌న‌ప్ర‌వాహ ఉదృతిలో 2 గంట‌ల 45 నిమిషాల‌కి ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ ఎక్కిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్, వేదిక వ‌ద్ద‌కి చేరుకోవ‌డానికి మూడు గంట‌ల‌కి పైగా స‌మ‌యం ప‌ట్టింది.. విజ్జేశ్వ‌రం వ‌ద్ద వాహ‌న‌శ్రేణి బ్యారేజ్ పై అడుగు పెట్ట‌డంతోనే పారా గ్లైడ‌ర్లు గ్రాండ్ వెల్క‌మ్ ప‌లికారు.. ఆకాశంలో ఎగురుతూ ఆయ‌న‌పై పూల వ‌ర్షం కురిపించారు.. అక్క‌డి నుంచి జ‌న‌సంద్రాన్ని దాటి క‌వాతు ప్రారంభ వేదిక పిచ్చుకలంక చేరుకోవ‌డానికి గంటకు పైగా స‌మ‌యం ప‌ట్ట‌డం ప‌రిస్థితికి అద్దం ప‌ట్టే అంశం..

పిచ్చుక‌లంక నుంచి జ‌న‌సేనాని క‌వాతు చేయాల్సి ఉంది.. అయితే జ‌న ఉప్పెన ఇసుక రాల‌నంత ఒత్తుగా ఉండ‌డంతో ఆయ‌న‌కి కిందికి అడుగు
పెట్టే అవ‌కాశం చిక్క‌లేదు.. బ్యారేజీ సామ‌ర్ధ్యానికి కొన్ని రెట్ల జ‌నం ఆయ‌న చుట్టూ చేరిపోయారు.. దీంతో వాహ‌న దీంతో వాహ‌న‌శ్రేణి కూడా ముందుకి క‌ద‌ల‌డానికి జ‌న ఉప్పెన‌కి ఎదురీదాల్సి వ‌చ్చింది. ధ‌వ‌ళేశ్వ‌ర్యం బ్రిడ్జ్ నుంచి ఎటు చూసినా కొన్ని కిలోమీట‌ర్ల దూరం ల‌క్ష‌లాది జ‌న‌సైనికులు వ‌చ్చార‌న్న ఆన‌వాలు చూపుతూ శ్వేత‌రుధిర‌వ‌ర్ణ భ‌రిత‌మై క‌నువిందు చేసింది.. జ‌న‌సైనికులు పెద్ద పెట్టున సిఎం..సిఎం అంటూ చేసిన నినాదాలు., జ‌న‌సేనాని చెప్పిన‌దానికంటే కాస్త ఎక్కువ‌గానే శ‌బ్దం ఢిల్లీని తాకింది. ల‌క్షాల‌దిగా త‌ర‌లి వ‌చ్చిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు జ‌య‌జ‌య ధ్వానాలు చేస్తుంటే, వారిని ఉత్సాహప‌రిచేందుకు ఆయ‌న కూడా మ‌ధ్య మ‌ధ్య‌న కారు టాప్ మీదికి వ‌చ్చి ఉక్కు పిడికిలి గాలిలోకి లంఘిస్తూ ముందుకి సాగారు.. జ‌న‌సైన్య‌పు ప్ర‌వాహ ఉదృతికి ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారీజీ ప‌ట్ట‌క పోవ‌డంతో, కొన్ని వేల మంది లాకుల పైకి ఎక్కారు. మ‌రి కొన్ని వేల మంది గోదావ‌రీ ప్ర‌వాహానికి అడ్డంగా క‌వాతు చేశారు. ఆడ‌, మ‌గ‌, చిన్నా,పెద్దా, కులం,మతం బేధాలు మ‌ర‌చి, అన్ని వ‌ర్గాలు క‌వాతులో మేముసైతం అంటూ జ‌న‌సేన అధినేత వెనుక క‌దం తొక్కాయి. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ కాలువ దాటిన స‌మ‌యంలో, ఓ వైపు జ‌ల‌ప్ర‌వాహం ఉరుకులు పెడుతుంటే, అంత‌కు మించిన జ‌న‌ప్ర‌వాహం గంట‌ల త‌ర‌బ‌డి వంతెన దాటుతూ క‌నిపించిన దృశ్యం క‌నువిందు చేసింది. జ‌న‌సేన పార్టీ జెండాల‌తో పాటు జ‌న‌సేనాని ఫోటోలు, విప్ల‌వ వీరుడు చేగువేరా, దేశ నాయ‌కుల ఫొటోలు చేతబూని, జాతీయ‌త‌ని చాటుతూ జ‌న‌సైనికులు అనుస‌రించారు…

క‌వాతులో కొన్ని ల‌క్ష‌ల మంది జ‌న‌సేనుడ్ని అనుస‌రిస్తే, కాట‌న్ విగ్ర‌హం వ‌ద్ద ఉన్న స‌భా ప్రాంగ‌ణం ఇరువైపులా సుమారు కిలోమీట‌ర్ జ‌నంతో కిక్కిరిసింది. జ‌న‌సేన అధినేత పిలుపుతో ఉద‌యం నుంచే క‌వాతులో ప‌దం క‌లిపేందుకు ల‌క్ష‌లాదిగా జ‌నం ధ‌వ‌ళేశ్వ‌రానికి ఉన్న అన్ని దారుల నుంచి త‌ర‌లివ‌చ్చారు… ప‌వ‌న్ .. క‌వాతుకి మ‌ద్ద‌తుగా మ‌త్స‌కారులు గోదావ‌రిలో ప‌డ‌వ‌ల‌తో పిచ్చుక‌లంక నుంచి ధ‌వ‌ళేశ్వ‌రం వ‌ర‌కు గొలుసు క‌ట్టారు. వంద‌లాది నావ‌లు మూడు వ‌రుస‌ల్లో జ‌న‌సేన జెండాల‌తో ఈదాయి. మ‌రికొంత మంది మ‌త్స్య‌కారులు త‌మ ప‌డ‌వ‌ల‌కి జ‌న‌సేన అధినేత‌కి స్వాగ‌తం ప‌లికే బ్యాన‌ర్ల‌తో కూడిన తెర‌చాప‌ల్ని క‌ట్టారు.. ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజ్ మొత్తం జ‌న‌సేన జెండాలు, తోర‌ణాలు, పార్టీ నాయ‌కుల బ్యాన‌ర్ల‌తో నిండిపోయింది. కొంత మంది జ‌న‌సైనికులు ఓ భారీ ప‌ట్టాపై జాతీయ ప‌తాకం, మ‌ధ్య‌న జ‌న‌సేనుడి ఫోటోని ముద్రించిన చిత్ర‌ప‌టాన్ని ముద్రించి ఊరేగించారు. ఇక గోదావ‌రి మ‌ధ్య‌న ఉన్న దిబ్బ‌లు సైతం జ‌న‌సేన జెండాల‌తో వ‌ర్ణ‌శోభితంగా ద‌ర్శ‌న‌మిచ్చాయి. జ‌న‌సేన అధినేత పిలుపు మేర‌కు జాతీయ వాదాన్ని బ‌ల‌ప‌రుస్తూ క‌వాతు, ఆధ్యంతం జ‌న‌సేన జెండాల‌తో పాటు జాతీయ జెండాలు కూడా రెప‌రెప‌లాడాయి. వామ‌ప‌క్షాలు, ధ‌ళిత సంఘాల మ‌ద్ద‌తు నేప‌ధ్యంలో ఎర్ర‌జెండాలు, నీలి జెండాలు కూడా స‌భా ప్రాంగ‌ణం వ‌ద్ద ద‌ర్శ‌న‌మిచ్చారు. ఉద‌యం 6-7 గంట‌ల ప్రాంతంలోనే క‌వాతుకి త‌ర‌లి వ‌చ్చే జ‌న‌సైనికుల వాహ‌నాల‌తో ర‌హ‌దారులన్నీ వాహ‌నాల‌తో నిండిపోయాయి. అన్ని ల‌క్ష‌ల మంది జ‌న‌సైనికులు క‌వాతుతో క‌థం తొక్కినా, జ‌న‌సేన అధినేత విజ్ఞ‌ప్తితో ప్ర‌తి ఒక్క‌రూ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో క‌దిలి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేశారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌భా స్థ‌లికి చేర‌కునే స‌మ‌యంలో వేదిక‌పై మోగిన ఢ‌మ‌రుక నాదాలు అల‌రించాయి. ఆయ‌న‌ వేదిక పైకి ఎక్క‌గానే తూర్పు గోదావ‌రికి చెందిన ఆడ‌ప‌డుచులు హార‌తులు ఇచ్చి జిల్లాలోని ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. జ‌న‌సేన క‌వాతు ఊహ‌ల‌కి అంద‌ని రీతిలో విజ‌య‌వంతం కావ‌డంతో, పాల‌కులు క‌రెంటు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కేబుల్ ప్ర‌సారాలు నిలిపివేసి త‌న అక్క‌సు తీర్చుకున్నారు..

Share This:

1,283 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 + 9 =