Home / జన సేన / ద‌శావ‌తార వెంక‌టేశ్వ‌రుని బ్ర‌హ్మోత్స‌వాల్లో జ‌న‌సేనాని..

ద‌శావ‌తార వెంక‌టేశ్వ‌రుని బ్ర‌హ్మోత్స‌వాల్లో జ‌న‌సేనాని..

మంగ‌ళ‌గిరి ద‌శావ‌తార వెంక‌టేశ్వ‌ర స్వామి వారిని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ద‌ర్శించుకున్నారు.. బుధ‌వారం ఉద‌యం 8 గంట‌ల స‌మ‌యంలో ఆల‌యానికి విచ్చేసిన జ‌న‌సేనానికి వేద పండితులు, ఆల‌య నిర్వాహ‌కులు పూర్ణ‌కుంభంతో ఆహ్వానం ప‌లికారు.. ద‌శావ‌తార వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగుతున్న నేప‌ధ్యంలో స్వామి వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చారు.. ముందుగా వేద‌పండితుల మంత్రోచ్చ‌ర‌ణ‌ల మ‌ధ్య ధ్వ‌జ‌స్థంభం వ‌ద్ద‌ శాస్త్రోక్తంగా క‌ల‌శ‌పూజ నిర్వ‌హించారు.. అనంత‌రం స్వామి వారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. జ‌న‌సేన అధినేత‌కు వేద‌పండితులు తీర్ధ‌ప్ర‌సాదాలు అందించారు.. ఆయ‌న‌తో పాటు ప‌లువురు పార్టీ ప్ర‌ముఖులు స్వామి వారిని ద‌ర్శించుకున్న వారిలో ఉన్నారు. గ‌త నాలుగు రోజులుగా పార్టీ కార్య‌క్ర‌మాల్లో బిజీ బిజీగా గ‌డుపుతున్న ప‌వ‌న్‌., నిత్యం త‌న కోసం వ‌చ్చిన అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను సైతం క‌లుస్తూ వారు చెబుతున్న స‌మ‌స్య‌లు వింటున్నారు.. మంగ‌ళ‌వారం సాయంత్రం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో సాధార‌ణ ప్ర‌జానీకాన్ని కూడా క‌ల‌సి వారి స‌మ‌స్య‌లు స్వ‌యంగా అడిగి తెలుసుకున్నారు..

Share This:

294 views

About Syamkumar Lebaka

Check Also

కేంద్ర బ‌డ్జెట్ నిరాశ ప‌ర్చింది.. ఏపీ స‌ర్కారు స్ప‌ష్ట‌త తీసుకోవాలి-జ‌న‌సేన పార్టీ

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × four =