జనసేన అధినేత పవన్కళ్యాణ్ దసరా శరన్నవరాత్రుల సందర్బంగా అమ్మావారి దీక్ష చేపట్టనున్నారు. 9 రోజుల పాటు ఆయన దీక్షలో ఉంటారు. ఈ నెల 10వ తేదీ ఉదయం దేవీ పూజ అనంతరం దీక్షను స్వీకరించనున్న ఆయన, విజయదశమి వరకు కొనసాగిస్తారు. ఆ తొమ్మిది రోజులు జనసేన అధినేత పాలు, పండ్లని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. పోలవరంలో పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో పవన్కళ్యాణ్ స్వయంగా విషయాన్ని వెల్లడించారు. గడచిన 25 ఏళ్లుగా ఆయన దసరా శరన్నవరాత్రుల దీక్షలు బూనే వారు.. గతంలో ప్రతి ఏటా చాతుర్మాస దీక్ష కూడా చేస్తుండేవాడినని పార్టీ నేతలకి వివరించారు.. నవరాత్రుల ముందు నుంచి దీక్ష చేపట్టి 45 రోజుల పాటు కొనసాగించే వారు.. అయితే ఈ సారి పోరాట యాత్ర నేపధ్యంలో నవరాత్రుల 9 రోజుల మాత్రమే దీక్షలో ఉండనున్నారు..
శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్బంగా 10వ తేదీన పట్టిసీమ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దీక్షను ప్రారంభించనున్నట్టు సమాచరం.. ఉదయం 9.52 నిమిషాలకి జరిగే ప్రత్యేక పూజల అనంతరం దీక్షను ప్రారంభిస్తారు. ఈ తొమ్మిది రోజులు జనసేన అధినేత ఘనాహారం స్వీకరించరు.. పోరాట యాత్ర సమయంలో కొన్ని ప్రాంతాల్లో ప్రసంగించాల్సి ఉన్న నేపధ్యంలో పళ్లు, పాలు మాత్రమే స్వీకరిస్తారు. ఉపవాస దీక్షలో మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు మంచి ఆలోచనలు వస్తాయని, పార్టీ నాయకులతో జనసేనాని చెప్పారు. అందుకే గత 25 ఏళ్లుగా దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు..
ఇక స్వతహాగా ఇంటి దైవం ఆంజనేయస్వామితో పాటు అమ్మవారి పూజ అన్నా, మహాశివుని పూజ అంటే జనసేనానికి మక్కువ ఎక్కువ. ఆయన గొప్ప శివభక్తుడు కూడా అని సన్నిహితులు చెబుతారు.. కార్తీక మాసం ఆధ్యంతం పవన్కళ్యాణ్ అత్యంత నిష్టాగరిష్టలతో ఉపవాస దీక్ష చేపడతారు.. నెల మొత్తం ఒక పూట మాత్రమే ఆయన ఆహారం స్వీకరిస్తారు. గతంలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన శివపార్వతుల కళ్యాణానికి కూడా జనసేనాని హాజరైన సందర్బాలు ఉన్నాయి.. ఏ ప్రాంతానికి వెళ్లినా ఆయన అక్కడ ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం, వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకోవడం అందరికీ తెలిసిన విషయమే.. పశ్చిమ పోరాట యాత్రలో భీమవరంలో మావుళ్లమ్మనీ, జంగారెడ్డిగూడెం నుంచి నరసింహస్వామి, ద్వారకా తిరుమల చిన వెంకన్నని దర్శించుకున్నారు..