Home / సేన సేవ / ధ‌ర్మ‌వ‌రం చేనేత‌ల‌ క‌ష్టాల‌పై జ‌న‌సైన్యం దృష్టి.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం దిశ‌గా నేత‌ల అడుగులు..

ధ‌ర్మ‌వ‌రం చేనేత‌ల‌ క‌ష్టాల‌పై జ‌న‌సైన్యం దృష్టి.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం దిశ‌గా నేత‌ల అడుగులు..

15328182_1842563819312837_1612184383_n

కేంద్ర‌, రాష్ట్రాల్లో కొత్త ప్ర‌భుత్వాలు అధికార ప‌గ్గాలు చేప‌ట్టి రెండున్న‌రేళ్లు గ‌డ‌చిపోయింది.. కానీ ఇచ్చిన హామీలు మాత్రం ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టు ఉన్నాయి.. ఎన్నిక‌ల వేళ ఆయా పార్టీల‌కు మ‌ద్ద‌తు ప‌లికిన జ‌న‌సైన., ఇప్పుడు ఆ హామీలు ఏమ‌య్యాయంటూ ప్ర‌శ్నించేందుకు రెఢీ అయ్యింది.. ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన ధ‌ర్మ‌వ‌రం చేనేత కార్మికులు., ఇప్పుడు పూట‌డ‌వ‌ని ద‌య‌నీయ స్థితిలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు.. నేత‌న్న ఈ దుస్థితికి కార‌ణం ఏంటి..? ప‌్ర‌భుత్వం ఇచ్చిన హామీలు ఎంత వ‌ర‌కు అమ‌ల‌య్యాయి..? చేనేత‌ల బ‌తుకులు పున‌రుజ్జీవం పొందాలంటే ఏం చేయాల‌ని అనే అంశాల‌పై జ‌న‌సైన్యం దృష్టి సారించింది.. ధ‌ర్మ‌వ‌రంలో చేనేత కార్మికుల ఇళ్ల‌కు వెళ్లి ప‌సుపులేటి సందీప్ అనే జ‌న‌సైనికుడు త‌న బృందంతో క‌లిసి చేసిన అధ్య‌య‌నంలో చేనేత‌లు త‌మపై జ‌రుగుతున్న దోపిడిని ఏక‌రువు పెట్టారు..

15328393_1842563822646170_763755308_n

ఆనాటికీ.. ఈనాటికీ ధ‌ర్మ‌వ‌రం చేనేత‌ల క‌ష్టంలో మార్పురాలేదు.. కానీ అడుగ‌డుగునా దోపిడీ పెరిగిపోయింది.. రోజు కూలీతో పూట‌కూడా గ‌డ‌వ‌డం లేదు.. చేనేత కార్మికుడినంటూ రుణం కోసం వెళ్తే బ్యాంకులు త‌ల అడ్డంగా ఊపుతున్నాయి.. కులాల గ్రూపుల్లో ఉన్న‌వారికి మాత్ర‌మే రుణాలు ద‌క్కుతున్నాయి.. చాలామందికి ఇళ్లు కూడా లేవు.. సంపాదించిన మొత్తం అద్దెక‌ట్ట‌డానికి కూడా స‌రిపోవ‌డం లేదు.. ప్ర‌భుత్వాలు చేనేత కార్మికుల పేరుతో మంజూరు చేసిన ఇళ్లు కాస్తా., రాజ‌కీయ ప‌లుకుబ‌డి ఉన్న ద‌ళారులు ఎగ‌రేసుకుపోయారు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో చేనేత‌ల‌కు ఉచిత విద్యుత్ అన్న టీడీపీ., ఇప్పుడు ఆ ఊసు కూడా ఎత్త‌డం లేదంటూ ధ‌ర్మ‌వ‌రం చేనేత కార్మికులు త‌మ స‌మ‌స్య‌ల చిట్టా జ‌న‌సైన్యం ముందు ఉంచారు.. నెల‌కి 600 చొప్పున పెన్ష‌న్ ఇస్తామ‌న్న పాల‌కులు., రెండున్న‌రేళ్ల‌లో కేవ‌లం 5 నెల‌ల పెన్ష‌న్ మాత్ర‌మే చెల్లించ‌గ‌లిగింద‌ని వాపోయారు..

img-20161225-wa0085

ఇక సొసైటీ వ్య‌వ‌స్థతో చేనేత‌లు ప‌డుతున్న క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావ‌ని., ఈ అధ్య‌య‌నం జ‌రిపిన జ‌న‌సైనికుడు సందీప్ చెబుతున్నారు.. సొసైటీ వ్య‌వ‌స్థ ద‌ళారుల పాలిట కామ‌దేనువుగా మారింద‌ని చేనేత‌లు ఆరోపిస్తున్నారు.. 100 మ‌గ్గాలు ఉన్న ద‌ళారీ., త‌న వ‌ద్ద ప‌నిచేసే కూలీల పేరుతో అక్ర‌మంగా రుణాలు పొందుతున్నట్టు చెబుతున్నారు.. స‌ర్కారు ముడిస‌రుకుని నేరుగా చేనేత‌ల‌కు అందించి., చీర‌ల్ని నేరుగా కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.. నెలంతా క‌ష్ట‌ప‌డి రెండు చీర‌లు నేస్తే., ఆరువేలు త‌మ‌కు., 20 వేలు ద‌ళారుల జేబుల్లోకి చేరుతున్నాయంటున్నారు.. ఇంకా మాట్లాడితే ధ‌ర్మ‌వ‌రం ప‌ట్టు కాస్తా ద‌ళారీల దెబ్బ‌కి కంచి మార్కెట్‌లో కంచిప‌ట్టుగా మారి అమ్మ‌బ‌డుతోంద‌ని ఆరోపిస్తున్నారు..

img-20161225-wa0088

రాయ‌ల‌సీమ‌లోని ఓ ఎంపి., క‌ర్ణాట‌క బోర్డ‌ర్‌లో వెల‌సిన క‌రెంటు మ‌గ్గాలు ధ‌ర్మ‌వ‌రం చేనేత‌ల క‌డుపు కొడుతున్నాయి.. ఐటీ దాడులు చేసే స్థాయిలో ఇక్క‌డ ద‌ళారులు పాతుకుపోగా., అప్పులు తీర్చ‌లేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే స్థాయిలో చేనేత కార్మికులు ఉన్నారు.. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు నెర‌వేర‌క‌పోవ‌డం., నెర‌వేర్చిన హామీలు నిజ‌మైన ల‌బ్దిదారులకి అంద‌క‌పోవ‌డ‌మే ఈ దుస్థితికి కార‌ణ‌మ‌ని జ‌నసేన కార్య‌క‌ర్త‌లు తేల్చారు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో చెప్పిన ల‌క్షా 50 వేల ఉచిత షెడ్, మ‌గ్గం ఎక్క‌డున్నాయని ప్ర‌శ్నిస్తున్నారు.. ఈ అధ్య‌య‌నంలో సందీప్‌కి, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సుధాక‌ర్‌రెడ్డి, బాబు, నాగార్జున‌లు స‌హ‌క‌రించారు..

ధ‌ర్మ‌వ‌రం చేనత‌ల‌పై జ‌న‌సేన అధ్య‌య‌నం జ‌రిపిన రెండు రోజుల‌కే స్థానిక ఎమ్మెల్యే, హిందూపురం ఎంపిలు చేనేత‌ల స‌మ‌స్య‌ల్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ల‌డం కొస‌మెరుపు.. గిడ్డంగుల నిర్మాణం, గిట్టుబాటు ధ‌ర‌, ముడి ప‌ట్టు స‌ర‌ఫ‌రా త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు..

Share This:

1,891 views

About Syamkumar Lebaka

Check Also

ఆ జ‌న‌సేన అభ్య‌ర్ధి గెలిస్తే.. పుంగ‌నూరు ప్ర‌గ‌తి ప‌థ‌మే..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తీసుకురాబోతున్న మార్పు ఏ స్థాయిలో ఉంటుందంటే.., ఆ పార్టీ అభ్య‌ర్ధులు గెలుపు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్దికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 + six =