Home / జన సేన / ధ‌వ‌ళేశ్వ‌రం బ్రిడ్జి క‌వాతు.. దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు రేపాలి-జ‌న‌సేనాని పిలుపు.

ధ‌వ‌ళేశ్వ‌రం బ్రిడ్జి క‌వాతు.. దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు రేపాలి-జ‌న‌సేనాని పిలుపు.

మార్పు తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి మొద‌ల‌వ్వాలి..
ధవ‌ళేశ్వ‌రం బ్రిడ్జి నుంచి జ‌న‌సేన స‌త్తా చాటుదాం.
సీట్లు ఇప్పిస్తామ‌ని చెప్పే వారిని న‌మ్మ‌కండి.
జ‌న‌బాట‌కి అంతా స‌హ‌క‌రించండి.
తూర్పు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో జ‌న‌సేనాని.

ధ‌వ‌ళేశ్వ‌రం బ్రిడ్జి నుంచి జ‌న‌సేన పార్టీ స‌త్తాని దేశ వ్యాపితం చేయాల‌ని ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కార్య‌క‌ర్త‌ల‌కి పిలుపునిచ్చారు.. ప‌శ్చిమ టూర్ ముగియ‌నున్న నేప‌ధ్యంలో క‌వాతు, తూర్పులో పోరాట యాత్ర‌ల‌పై ఆ జిల్లా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మైన ఆయ‌న‌, భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌, పార్టీ నిర్మాణంపై కీల‌క ప్ర‌సంగం చేశారు..ధ‌వ‌ళేశ్వ‌రం బ్రిడ్జి క‌వాతు త‌ర్వాత దేశం మొత్తం జ‌న‌సేన గురించే మాట్లాడుకోవాల‌న్నారు.. క‌వాతుకి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లంతా స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. జ‌న‌సేన పార్టీకి తూర్పు గోదావ‌రి జ‌ల్లా ఆయువుప‌ట్ట‌న్న జ‌న‌సేనాని., 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో 20 నుంచి 22 రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు తెలిపారు.15వ తేదీ క‌వాతుతో తూర్పులో అడుగుపెట్టాక‌, జిల్లాపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తాన‌న్నారు.. తూర్పు గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పు, రాష్ట్రం మొత్తాన్ని ప్ర‌భావితం చేస్తుందని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.. పార్టీలో ఉన్న నాయ‌కులు ఏం చేయ‌క‌పోయినా ప‌ర్వాలేదు గానీ., ఉన్న‌దాన్ని చెడ‌గొట్ట‌కుండా ఉంటే అద్భుతాలు సాధించ‌వ‌చ్చంటూ కొంత మందికి చుర‌క‌లు కూడా అంటించారు.. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డే వారిని, ప‌ని చేసేవారిని గుర్తించి ముందుకి తీసుకువెళ్లాల‌ని సూచించారు.. జ‌న‌సేన పార్టీకి తూర్పు గోదావ‌రి జిల్లా చాలా బ‌ల‌మున్న జిల్లా అన్న ఆయ‌న‌.,. అక్క‌డ ప‌ట్టు సాధించ‌లేక పోతే, ఆ త‌ప్పు నాయ‌కుల‌దేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. పార్టీలో కోట‌రీలు క‌ట్టే విధానానికి తాను వ్య‌తిరేక‌మంటూ త‌న ఉద్దేశాన్ని విస్ప‌ష్టంగా తెలిపారు..తాను ఎంతో విశాల దృక్ప‌దంతో, చిత్త‌శుద్దితో ముందుకి వెళ్తుంటే, కొంత మంది చిన్న చిన్న ఆలోచ‌న‌ల‌తో ఉన్నార‌న్నారు..
పితానికి మిన‌హా ఎవ్వ‌రికీ సీటు ఇవ్వ‌లేదు.
పితాని బాల‌కృష్ణ మిన‌హా జ‌న‌సేన పార్టీ నుంచి ఎవ‌రికీ సీటు ఇవ్వ‌లేదని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.. పార్టీ టిక్కెట్లు ఇస్తామని గానీ, ఇప్పిస్తామ‌ని గానీ ఎవ‌రు చెప్పినా న‌మ్మొద్ద‌న్నారు. టిక్కెట్ల కేటాయింపు వ్య‌వ‌హారం చూడ‌డానికి ఓ క‌మిటీ ఉంటుంద‌న్న జ‌న‌సేనాని., కేటాయింపు విధానంలో పార‌ద‌ర్శ‌క‌త ఉంటుంద‌ని తెలిపారు.
ఇత‌ర పార్టీల‌తో పోలిస్తే నిర్మాణం కాస్త ఆల‌స్య‌మైనా, ప‌క్కాగా ఉంటుందన్నారు. కాస్త సంయ‌మ‌నం-స‌హ‌నం పాటించాల‌ని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కి సూచించారు.. ఇప్పుడు వేసిన ఏ క‌మిటీ పూర్తి స్థాయి క‌మిటీ కాద‌ని తెలిపారు.. పార్టీలో త‌న‌తో స‌హా ఎవ‌రికీ ఎలాంటి అధికారాలు లేవన్నారు.. ప‌ద‌వుల రూపంలో బాధ్య‌త‌లు మాత్ర‌మే తీసుకున్న‌ట్టు చెప్పారు.. క‌మిటీల నియామ‌కంలో ఎమైనా లోపాలు ఉంటే పార్టీ పెద్ద‌ల‌కి తెల‌పాల‌న్నారు.. మ‌రో ఐదారు రోజుల్లో విజ‌య‌వాడ‌లో పార్టీ నూత‌న కార్యాల‌యం ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు. 2009 త‌ర్వాత ప‌రిమిత వ‌న‌రుల‌తో, ఎవ‌రూ తోడ్పాటు అందించ‌కున్నా, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుల స‌హ‌కారం లేకున్నా, పార్టీని ముందుకి తీసుకెళ్తున్నామ‌ని చెప్పిన ప‌వ‌న్‌., ఇప్పుడిప్పుడే కొంత మంది నాయ‌కులు జ‌న‌సేనలో చేరేందుకు సిద్ధ‌మైన‌ట్టు చెప్పారు. జ‌న‌సేన మీద పెరుగుతున్న న‌మ్మ‌కానికి ఇది సంకేత‌మ‌న్నారు. ప్ర‌శ్నిస్తాం అంటే ప్ర‌శ్నిస్తూనే ఉంటామ‌ని అర్ధం కాదన్న ఆయ‌న‌ ప్ర‌శ్నించ‌డం ద్వారా అధికారాన్ని స్థాపిస్తామ‌ని తెలిపారు..

జ‌న‌బాట కార్య‌క్ర‌మాన్ని ముందుకి తీసుకువెళ్లాల‌ని కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కి జ‌న‌సేనాని విజ్ఞ‌ప్తి చేశారు. కొత్త ఓట‌రు న‌మోదుని ప్ర‌తి కార్య‌క‌ర్త ఓ బాధ్య‌త‌గా తీసుకోవాలన్నారు.. జ‌న‌బాట కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు..

Share This:

1,485 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − ten =