సీమాంధ్ర హక్కుల సాధనే లక్ష్యంగా అనంతపురం వేదికగా జరుగుతున్న జనసేనాని సభకు సీమాంధ్ర హక్కుల చైతన్య సభగా పవర్‌స్టార్ నామకరణం చేశారు.. ప్రత్యేక హోదా సాధనే ప్రధాన అజెండాగా నిర్వహించ తలపెట్టిన ఈ సభలో పవన్, రాష్ట్రానికి హోదా అవసరం ఏంటి..? దాని వల్ల వచ్చే లాభనష్టాలు ఏంటి..? తదితర అంశాలపై ప్రజల్ని చైతన్య పరచనున్నారు.. అందుకే సభకి సీమాంధ్ర హక్కుల చైతన్య సభగా ఆయన నామకరణం చేశారు.. ఇప్పటికే అనుమతుల ప్రక్రియ పూర్తి కావడంతో అనంత జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.. ఇక అనంత వేదికగా గర్జించేందుకు రెడీ అయిన జనసేనాన., ఈ సందర్బంగా ఆ జిల్లా ఖ్యాతిని చాటిన మహనీయుల్ని స్మరించుకోవాలని భావింస్తున్నారు.. అందుకోసం సభా ప్రాంగణానికి అనంతపురం ముద్దుబిడ్డ, విప్లవ వీరుడు తరిమెల నాగిరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు.. ఇక వేదికకి రాజకీయ దురందరుడు, స్వతంత్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు పేరుని ఎంపిక చేశారు.. ఆంధ్రుల హక్కుల కోసం జరుగుతున్న పోరాటం సందర్బంగా ఈ మహనీయులను స్మరించుకోవడాన్ని గొప్ప భాగ్యంగా భావిస్తున్నట్టు పవన్‌కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు..
ఇప్పటికే జనసేనాని ప్రాధాన్యతని తగ్గించేందుకు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతకి ప్రత్యేక హోదా అంశం ఉన్నట్టుండి గుర్తుకొచ్చేసింది.. మెగా ఆక్వా ఫుడ్ ప్రాజెక్ట్ వ్యవహారంలో, ఆయన ఆ ప్రాంతంలో పర్యటించినా పెద్దగా వర్కవుట్ కాలేదు.. ఆ సమస్య పరిష్కారానికి సర్కారు చొరవ చూపిన వ్యవహారంలో క్రెడిట్ మొత్తం పవన్ ఖాతాలో చేరిపోయింది.. దీంతో ఓ వైపు జనసేనాని సభ అసంబద్దమంటూ ప్రచారం చేస్తూనే., మళ్లీ ప్రత్యేక హోదా అంశాన్ని భుజాన వేసేసుకున్నారు.. ఇలాంటి చర్యలు పవన్ ఇమేజ్‌ని రెట్టింపు చేస్తున్నాయన్నది రాజకీయ విమర్శకుల మాట. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు అంతా మన మంచికే అన్నట్టు ఉన్నాయి.. జనసేన కార్యకర్తలు పారాహుషార్..