Home / జన సేన / నాన‌క్‌రాంగూడా ఘ‌ట‌నాస్థ‌లికి జ‌న‌సేన టీం.. యాజ‌మాన్యంపై చ‌ర్య‌ల‌కు డిమాండ్‌..

నాన‌క్‌రాంగూడా ఘ‌ట‌నాస్థ‌లికి జ‌న‌సేన టీం.. యాజ‌మాన్యంపై చ‌ర్య‌ల‌కు డిమాండ్‌..

9brk55aa img-20161209-wa0051

హైద‌రాబాద్ నాన‌క్‌రామ్‌గూడాలో నిర్మాణంలో ఉన్న భ‌వ‌నం కూలిన ఘ‌ట‌నాస్థ‌లిని జ‌న‌సేన తెలంగాణ విభాగం ప్ర‌తినిధులు సంద‌ర్శించారు.. దుర్ఘ‌ట‌నకు కార‌ణాల‌పై ఆరా తీసిన టీం జ‌న‌సేన‌., బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు.. ఘ‌ట‌న‌లో మృతుల‌కి కుటుంబాల‌కి జ‌న‌సేనాని త‌రుపున సంతాపం ప్ర‌క‌టించారు.. మృతుల కుటుంబాల‌కు ఒక్కోక్క‌రికీ 25 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని డిమాండ్ చేశారు.. భ‌వ‌న నిర్మాణానికి సంబంధించి అనుమ‌తుల‌పై ఆరా తీసిన జ‌న‌సేన నేత‌లు., అక్ర‌మంగా నిర్మాణం చేప‌ట్టిన య‌జ‌మానిని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.. ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు నాలుగు రోజులు హ‌డావిడి చేసి మ‌ర్చిపోతున్నార‌ని ఆరోపించారు.. మ‌రోసారి ఇలాంటివి పున‌రావృతం  కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు.. పార్టీ వ్య‌వ‌హారాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, జ‌న‌సేన ఉపాధ్య‌క్షులు మ‌హేంద‌ర్‌రెడ్డితో పాటు తెలంగాణ విభాగం ఇన్‌ఛార్జ్ శంక‌ర్‌గౌడ్, పార్టీ ప్ర‌తినిధులు రియాజ్‌, పి.న‌ర‌సింహ త‌దిత‌రులు ఘ‌ట‌నాస్థ‌లిని సంద‌ర్శించిన‌వారిలో ఉన్నారు..

Share This:

620 views

About Syamkumar Lebaka

Check Also

క‌వాతు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కాదు.. బాధ్య‌త‌గా ఉండ‌మ‌ని హెచ్చ‌రిక‌-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ క‌వాతు సూప‌ర్ స‌క్సెస్‌తో ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతుంటే., జ‌న‌సేనాని మాత్రం త‌న బాధ్య‌త‌ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × 5 =