కాటమరాయుడు షూటింగ్లో బిజీ బిజీగా ఉన్న జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కలిశారు.. తన కుమార్తె వివాహ మహోత్సవానికి ఆహ్వానించారు.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన సన్నిహితులతో కలిసి ఆన్నపూర్ణ స్టూడియోస్‌లోని కాటమరాయుడు సెట్‌కి వచ్చిన దత్తన్న., పెళ్లి పత్రిక స్వయంగా అందజేశారు.. తప్పకుండా తన ఇంట జరిగే శుభకార్యానికి హాజరుకావాలని పవన్‌కి విజ్ఞప్తి చేశారు.. అందుకు జనసేనాని నుంచి కూడా సానుకూల స్పందన వ్యక్తమయ్యింది.. అనంతరం పలు అంశాలపై ఇద్దరు నేతలు పిచ్చాపాటి చర్చలు జరిపారు..