Home / జన సేన / నా బ‌లం మీకిస్తా.. మీ నుంచి నేనేమీ ఆశించ‌ను.. అర‌కు గిరి’జ‌నం’తో జ‌న‌సేనాని..

నా బ‌లం మీకిస్తా.. మీ నుంచి నేనేమీ ఆశించ‌ను.. అర‌కు గిరి’జ‌నం’తో జ‌న‌సేనాని..

అర‌కు గిరిజ‌నంతో జ‌న‌సేన అధినేత శ్రీ ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ..
ఏజెన్సీ స‌మ‌స్య‌ల‌పై ఆరా..
బాక్సైట్ మైనింగ్ వివ‌రాలు అడిగి తెలుసుకున్న ప‌వ‌న్‌..
బాక్సైట్ త్వ‌కాలు ఆపాల‌న్న గిరిజ‌నులు..
నా బ‌లం మీకిస్తా.. మీరు బ‌ల‌ప‌డితే చాల‌న్న జ‌న‌సేనాని..
తాగునీరు-విద్యా-వైద్యం బాగుచేయాలని గిరిజ‌నం విజ్ఞ‌ప్తి..

అర‌కు అందాల వెనుక దాగి ఉన్న స‌మ‌స్య‌లు మొత్తం త‌న‌కు తెలుసున‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అన్నారు.. ఏజెన్సీ స‌మ‌స్య‌ల‌పై అర‌కులో గిరిజ‌నుల‌తో స‌మావేశ‌మైన ఆయ‌న మ‌న ఆట‌, పాట‌, సంప్ర‌దాయాల‌ను గుర్తించే అభివృద్దిని మాత్ర‌మే జ‌న‌సేన ఆహ్వానిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.. మ‌న ఉనికిని చంపుకునే అభివృద్ది అవ‌స‌రం లేద‌న్నారు.. బాక్సైట్ త‌వ్వ‌కాల‌ని ఆపాల‌న్న గిరిపుత్రుల డిమాండ్‌ని స్వీక‌రించిన జ‌న‌సేనాని., మీ స‌మ‌స్య‌లు తీర్చేందుకు నా బ‌లం మొత్తం మీకిస్తాన‌ని, అందుకు ప్ర‌తిగా నేను ఏమీ ఆశించ‌న‌న్ని తెలిపారు.. అడ‌విబిడ్డ‌లు అన్ని విధాలా బ‌ల‌ప‌డితే అదే త‌న‌కు ప‌దివేల‌ని ఆన్నారు.. స‌మ‌స్య‌ల‌పై పూర్తి స్థాయి అధ్య‌య‌నానికే తాను అర‌కు వ‌చ్చానన్న జ‌న‌సేనాని, గ్రామ‌స్థాయిలో ప‌ర్య‌టించి స‌మ‌స్య‌ల‌పై పూర్తి అవ‌గాహ‌న తెచ్చుకునే వ‌ర‌కు ఇక్క‌డే ఉంటానన్నారు.. అలాగే బాక్సైట్‌కి సంబంధించి అవ‌గాహ‌న కోసం ఆ కొండ ప్రాంతాలను సంద‌ర్శిస్తానన్నారు..
గిరిపుత్రుల‌తో భేటీ సంద‌ర్బంగా ముందుగా వారి స‌మ‌స్య‌లు అడుగ‌గా, దాదాపు ఏజెన్సీ మొత్తం మంచినీటి స‌మ‌స్యే అత్యంత తీవ్ర‌మైన స‌మ‌స్య‌ని వారు ప‌వ‌న్‌కి తెలిపారు.. ప్రాణాలు కాపాడుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన క‌నీస వ‌స‌తి మంచినీటిని కూడా పాల‌కులు త‌మ‌కు ఇవ్వ‌డం లేద‌న్నారు.. పార్టీలు మారినా, నాయ‌కులు మారినా, ఓట్లు వేయించుకుని గిరిజ‌నుల్ని మోసం చేస్తూనే ఉన్నార‌న్నారు.. తాగునీటితో పాటు విద్యా-వైద్యం, ర‌హ‌దారులు వంటి క‌నీస మౌలిక స‌దుపాయాలు త‌మ‌కు క‌ల్పిస్తే చాల‌ని తెలిపారు.. గిరిజ‌నుల అభివృద్ది ఏర్పాటు చేసిన ఐటీడీఏ అధికారుల ద‌గ్గ‌ర నుంచి పాల‌కులు, అధికారులు త‌మను ఏ విధంగా దోచుకుంటున్నార‌న్న విష‌యాన్ని ఆయ‌న ముందు ఉంచారు..

గిరిజ‌నుల స‌మ‌స్య‌లు విని చ‌లించిన జ‌న‌సేనాని., ప్ర‌కృతికి ద‌గ్గ‌ర‌గా బ‌త‌కే మీ ద‌గ్గ‌ర ఎలాంటి అవినీతి ఉండ‌ద‌న్నారు.. దాన్ని దాటి ఏదో సాధించుకోవాల‌ని చూసిన‌ప్పుడే ఆ జాడ‌లు క‌నిపిస్తామ‌న్నారు.. అభివృద్దికి మైనింగ్ అవ‌స‌ర‌మే అయినా, అది ఎక్క‌డ‌, ఎలా చేయాల‌న్న అంశానికి సంబంధించి ఒక విధానం అంటూ ఉంటుంద‌న్నారు.. గ్రామంలో 70 శాతం ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భించిన‌ప్పుడే మైనింగ్ లాంటి కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని రూల్ ఉంద‌న్నారు.. భూమిలో ఎక్క‌డ త‌వ్వినా ఏదో ఒక ఖ‌నిజం బ‌య‌టికి వ‌స్తుంద‌ని, ఆఖ‌రుకి అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు ఇంటి కింద త‌వ్వ‌కాలు జ‌రిపినా ఏదో ఖ‌నిజం దొరుకుతుంద‌న్నారు.. అడ‌విబిడ్డ‌ల‌ను భ‌య‌పెట్టి, బ‌ల‌హీనులుగా మార్చి వారిపై పోరాటం చేయ‌డానికి వ‌చ్చాన‌ని జ‌న‌సేనాని భరోసా ఇచ్చారు… ప్ర‌కృతిలో మ‌మేక‌మ్యై బ‌తికినోళ్ల‌ను దానికి దూరం చేస్తే అశాంతి మాత్ర‌మే వ‌స్తుంద‌న్నారు.. ఏసీ గ‌దుల్లో కూర్చుని గిరిజ‌న పాల‌సీలు త‌యారు చేయ‌డం కాదు., తండాల వెంట తిరిగి పాల‌సీలు రాస్తే అవి అడ‌విబిడ్డ‌ల అభివృద్దికి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని సూచించారు..

కొండ కుమ్మ‌రి తెగ‌ను ఎస్టీల్లో చేర్చాల‌ని మిగిలిన గిరిజ‌నులంతా సూచించ‌డంతో, మ‌త్స్య‌కారుల విష‌యంలో ప్ర‌భుత్వం కులాల మ‌ధ్య కుమ్ములాట‌లు రాజేసిన విష‌యాన్ని గుర్తు చేశారు..జ‌న‌సేన పార్టీ ప్ర‌కృతిని ప‌రిర‌క్షించ‌డంతో పాటు కులాల ప్ర‌స్థావ‌న లేని రాజ‌కీయాలు చేస్తుంద‌న్నారు.. తాను ఓట్లు అడిగేందుకో, రాజ‌కీయాలు చేసేందుకో ఇక్క‌డ‌కు రాలేద‌న్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ప్ర‌తి స‌మ‌స్య‌ని క్షుణ్ణంగా ప‌రిశీలించి, వాటి ప‌రిష్కారాలు అన్వేషిస్తాన‌ని హామీ ఇచ్చారు..

Share This:

5,510 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × three =