Home / పెన్ పోటు / నిజం నిప్పులాంటిది.. ఆల‌స్యం అయినా అబ‌ద్ధాన్ని ద‌హించివేస్తుంది..

నిజం నిప్పులాంటిది.. ఆల‌స్యం అయినా అబ‌ద్ధాన్ని ద‌హించివేస్తుంది..

సత్యమేవ జయతే అంటూ దెయ్యాలు “వేదాలు” వల్లిస్తున్నాయి?
దుర్మార్గులు “సన్మార్గం” గురించి మాట్లాడుతున్నారు!

ప్రస్తుత మన రాజకీయ-మీడియా పరిస్థితులు చూస్తుంటే, నరకాసురుల బాధ వదులుతున్నదని సంతోషించాలా లేక బకాసురుల బాధ మొదలు అవుతున్నదని భయపడేలా అనేది అర్ధం కావడం లేదు.

“రవి ప్రకాష్ చేయని దుర్మార్గాలు లేవు. కుల గజ్జిని వ్యాప్తి చేసాడు. సమాజాన్ని బ్రష్టు పట్టించాడు” అంటూ” విజయసాయి రెడ్డి” ఆవేదనని వ్యక్తం చేసారు. నిజమే. రవిప్రకాష్ మామూలు దుర్మార్గుడు కాదు పరమ దుర్మార్గుడు. తన ఛానల్ టీఆర్పీ కోసం తెలంగాణ ఉద్యమాన్ని నాడు రెచ్చగొట్టాడు. రాష్ట్ర విభజన కారకుల్లో ఈ రవి ప్రకాష్ కూడా ఒక్కడు అనేది కూడా నిజం. బురద పాములను విష నాగులుగా తయారు చేసి తన ఛానల్’లో ప్రయోగిస్తూ ఎందరో జీవితాలతో ఆడుకున్నాడు. బాబుకి రవి ప్రకాష్, రవి ప్రకాష్’కి బాబు అండగా ఉంటూ సమాజాన్ని విచ్ఛన్నం చేసారు అనేది కూడా నిజం కావచ్చు.

అయితే తెలంగాణ ఉద్యమాన్ని బీరు, బిర్యానీలు పంచి రెచ్చగొట్టిన ప్రముఖ నాయకుడు “విసారె” పక్కనే ఉన్నారు. ఆ ప్రముఖ యువ నాయకుడు తదనంతం పార్టీ పెట్టి, సీఎం కావాలని పట్టుబట్టలు కట్టుకొని నాటినుండి నేటివరకు వేచి చూస్తూనే ఉన్నాడు. ఆయన గురించి కూడా “విసారె” ట్వీట్ చేసి ఉంటే బాగుండేది. ఆ యువనాయకుడు, నాటి యువ ఛానల్స్’తోనూ కొంత మంది బాబులు –బురద కాలువకుంట్లతో కలిసి ఆడిన నాటకాలపై కూడా “విసారె” ట్వీట్స్ చేసి ఉంటే బాగుండేది. రాష్ట్ర విభజనలో “విసారె” పాత్రపై కూడా వివరించి చెప్పి ఉంటే బాగుండేది. కానీ చేయడు

“విసారె” చెప్పినట్లు రవిప్రకాష్ కుల గజ్జిని వ్యాప్తి చేసాడు అనేది కాదనలేని నిజం. కానీ మరి కాపులకి రిజర్వేషన్స్ తీస్తేనేగాని రెడ్లకి ఆధిపత్యం రాదు అని నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానందం రెడ్డిలు కాపులకి అన్యాయం చేశారు అని అంటారు. కాపులను రావులపాలెంలో కొట్టించిన కోట్ల విజయ భాస్కర రెడ్డి కూడా కుల గజ్జితోనే పాలించారు అంటారు? రెడ్డి రాజులకు కూడా కుల గజ్జి ఉన్నదనేది చరిత్ర చెబుతున్నది. నిన్న రాజన్న కూడా కుల గజ్జితోనే పాలించేరు అనేది నిజం కాదా? కమ్మని పాలకులు తన వర్గానికి పెద్ద పేట వేస్తే, దొడ్డలు తమ వర్గానికి పెద్ద పేట వేసికొన్నారు అనేది అందరికి తెలిసిందే. అలాగే కమ్మని మీడియా, దొడ్డల మీడియా అణగారిన వర్గాలను అణచివేసేవే.

అయితే నేడు రవి ప్రకాష్ పాపం పండి ఉండవచు. కానీ రేపు నేటి దొడ్ల మీడియా పాపం కూడా పండే రోజులు రాబోతున్నాయి. వైసీపీలో సుమారు 54 మందికి ఎమ్మెల్యే seats ఇచ్చికొన్నది కుల గజ్జితో కాదా? వైసీపీలో పదవులను అన్నింటిని తన దొడ్డ సామాజిక వర్గానికే ఇచ్చికొన్నది కుల గజ్జితో కాదా? వైసీపీలో ఉన్న కుల గజ్జి గురించి, సాక్షి, గ్రేట్ ఆంధ్ర లాంటి మీడియా లో వస్తున్న కులగజ్జి ఆధిపత్య వార్తలపై కూడా విసారే ట్వీట్లు పెట్టివుంటే బాగుండేది. కానీ పెట్టరు.

ఎనిమిది శాతం వాటాలు ఉన్న రవి ప్రకాష్ TV9 పై ఆధిపత్యం చేస్తుంటే, ప్రజల్లో ఆరు శాతం వాటాతో అధికారంలోకి వచ్చిన “బాబు” దానిని సమర్ధిస్తూ వచ్చాడు.. రవి ప్రకాష్ అక్రమాలపై కొరడా జులిపించి ఆధిపత్యం దక్కించుకోవాలి అని ఎదురుచూస్తున్నది ప్రజల్లో ఒక్క శాతం ఉన్నతెలంగాణ దొర కాదా..? కమ్మని మీడియా అభినేత పతనంపై నేడు విరుచుకు పడుతున్నది 4 శాతం ఉన్న మరొక అల్ప సామాజిక వర్గ నాయకుడు “విసారే”. ఐదు లేదా పది శాతం కూడా లేని వాళ్ళు ఆధిపత్యం చేస్తుంటే, లేదా ఆధిపత్యం కోసం పోరాడుకొంటుంటే మెజారిటీ వర్గాలు మాత్రం నేటికి నోరు మెదపడం లేదు. నరకాసురుడు అయినా బకాసురుడు అయితే మాకేంటి అనే భయం కావచ్చు.

అయితే ఏడుకొండల్లో కొన్నింటిని మా మతానికి ఇచ్చేస్తాను అన్న నాటి పాలకుడు బూడిదలో కలిసిపోయాడు. రాష్ట్రాన్ని నరికేస్తే ఏలేద్దాం అనే కుట్రదారులు, పార్టీలు ఒక్కొరొక్కరు పతనం చెందుతున్నారు. ఇక మిగిలింది మరొక వర్గ అహంకారుల ఆధిపత్యం మాత్రమే. అది నరకాసురుడు అయినా బకాసురుడు అయినా ఇద్దరు సురులే అనేది అణగారిన వర్గాలు తెలిసికొ నే రోజు వచ్చింది. దొడ్డ నాయకా! రేపటి పతనం మీదే కావచ్చు.

నేటి రవి ప్రకాష్ పతనం రేపటి “సాచ్చి” పతనానికి హెచ్చరిక అని గ్రహించాలి. అధికారం రాబోతుందని అనే అహంకారంతో ట్వీట్లతో సమాజాన్ని భయపెడుతున్న “విసారే”లాంటి వాళ్ళు కూడా అంతం రాక మానదు. కాల గర్భంలో కలిసిపోక తప్పదు. వీరికి కూడా గాలి పిట్టు వస్తున్నది అనేది గ్రహించాలి. అది జూన్, 19 కావచ్చు లేదా జూన్ 24 కావచ్చు. కానీ అక్రమార్కులు, అవినీతిపరులు, A1-A2లు పతనం మాత్రం ఖాయం. సత్యమేవ జయతే…

Share This:

2,252 views

About Syamkumar Lebaka

Check Also

”అజ్ఞాత‌వాసి ర‌విప్ర‌కాష్‌”ది ఎంత క్రిమిన‌ల్ మైండో చూడండి..

వెనుక‌టికి ఒక సామెత ఉంది ”చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది —— గుడిసెలు” అని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − fourteen =