Home / పవన్ టుడే / నిజ‌మైన స‌ర్వే చేద్దాం రండి.. ప‌చ్చ‌-ప్ర‌తి ప‌చ్చ‌(సాక్షి) మీడియాల‌కి ఓపెన్ ఛాలెంజ్‌..

నిజ‌మైన స‌ర్వే చేద్దాం రండి.. ప‌చ్చ‌-ప్ర‌తి ప‌చ్చ‌(సాక్షి) మీడియాల‌కి ఓపెన్ ఛాలెంజ్‌..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వేడి రాజుకున్న నేప‌ధ్యంలో.. స‌ర్వేలంటూ మీడియా హ‌డావిడి మొద‌లుపెట్టింది.. తెలంగాణ‌లో ప‌రిస్థితులు ఎలా వున్నా., ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ జాత‌ర ఏడాది క్రితం నుంచే మొద‌లుపెట్టేశారు.. ఓ వైపు అధికార పార్టీ త‌రుపున ఏ(సీ)బిఎన్ జ్యోతి కిట్టు మూడు నెల‌ల‌కోసారి ఓ స‌ర్వే వేసేసి.. మ‌ళ్లీ బాబే.. మ‌ళ్లీ బాబే.. అంటూ త‌న రిజ‌ల్ట్ ప్ర‌క‌టించేసి.. త‌మ మ‌హారాజ పోష‌కుల భుజం త‌ట్టుస్తూ వస్తున్నారు.. ఇక ప్ర‌తిప‌క్ష సాక్షీ మీడియా కూడా ఆ వెంట‌నే పేరు మార్చి ఎవ‌రో ఒక‌రితో స‌ర్వే పేరిట ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయించేసి., మా జ‌గ‌నే సిఎం.. మా జ‌గ‌నే సిఎం అంటూ భ‌జ‌న గీతాలాప‌న‌.. ఇద్ద‌రి ల‌క్ష్యం ఒక్క‌టే.. అయితే నువ్వు.. లేక‌పోతే నేను.. రాష్ట్రంలో ప్ర‌త్య‌మ్నాయ రాజ‌కీయ శ‌క్తిగా ఎదుగుతున్న జ‌న‌సేన‌ని న‌యానో., భ‌యానో అడ్డుకోవడం.. జ‌న‌సేనాని వైపు నుంచి జ‌నం దృష్టిని మ‌ర‌ల్చ‌డం.. అయితే సామాజిక మాధ్య‌మాల పుణ్య‌మా అని ఈ స‌ర్వేలు వ‌చ్చిన ప్ర‌తిసారీ.. అది వారికే భ‌స్మాసుర హ‌స్తంగా మారుతూ వ‌స్తోంది..

దీంతో ఆప‌రేష‌న్ బూట‌క‌పు స‌ర్వేల ప‌ర్వం కొత్త సొబ‌గులు అద్ద‌డం మొద‌లు పెట్టారు.. జాతీయ మీడియాతో వున్న ప‌రిచ‌యాల దృష్ట్యా.. ఇక్క‌డ మీడియా ఇచ్చిన స‌ర్వేల‌ని జ‌నం న‌మ్మ‌డం మానేశార‌న్న విష‌యాన్ని తెలుసుకున్న ఆంధ్ర అధికార‌-విప‌క్షాలు.. ఆ మీడియా పేరిట స‌ర్వేలు మొద‌లెట్టేశారు.. వీరి స‌ర్వేల‌కి నిబ‌ద్ద‌త ఉండ‌డానికి ఇవేమీ ఎగ్జిట్ పోల్స్ కాదు.. ల‌క్ష మంది అభిప్రాయాల‌తో దేశానికి ప్ర‌ధాన మంత్రిని నిర్ణ‌యించేసే స‌ర్వేలు అవి.. ఆ స‌ర్వేల‌ను భుజానికెత్తుకుని జ‌నాన్ని మాయ చేసే ప‌నిలో ఇంటి మీడియా., ఇంతి మీడియాలు ఉండ‌నే వున్నాయి.. తాజాగా ప‌చ్చ‌-ప్ర‌తిప‌చ్చ పెయిడ్ బ్యాచ్‌కి ఇండియాటుడే స‌ర్వే రూపంలో చేతికి భాగానే ప‌ని దొరికేసింది.. మ‌రి జ‌నాన్ని మాయ చేయాలి క‌దా..!!!

ఇంత‌కీ జాతీయ మీడియాకీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌కి అదే నాయ‌కుల‌కీ వున్న లింకేంటి అంటే.. ఆ లింకు ఈ నాటిది కాదు.. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మృతి చెందిన నాటి నుంచి ప్ర‌తిప‌చ్చ నేత జ‌గ‌న్‌., సొంత మీడియాతో పాటు వాడింది ఎక్కువ జాతీయ మీడియానే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెట్టేందుకు సాక్షీని వాడితే., సొనియ‌మ్మ‌ని భ‌య‌పెట్టేందుకు జాతీయ మీడియాకి ప‌ని చెప్పేవారు.. సాక్షి మిన‌హా అప్ప‌ట్లో మ‌రే తెలుగు మీడియాకీ వైఎస్ కుటుంబం నుంచి ఇంట‌ర్వూలు దొరికేవి కాదు.. ఇందుకు జాతీయ మీడియా మాత్రం మిన‌హాయింపు.. ఈ మ‌ధ్య ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కీర్తి కూడా జాతీయ స్థాయిలో వినుడు వినుడు రామాయ ణ గాధ అయ్యింది.. దీంతో ఆ ప‌రిచ‌యాలే., నేటి 10 వేల మొబైల్ వినియోగ‌దారుల అభిప్రాయాల‌తో కూడిన స‌ర్వే…

ప్ర‌తిప‌క్ష‌పు క‌నుస‌న్న‌ల్లోని మీడియా జ‌గ‌న్ సిఎం అంటే., ఇప్ప‌టికీ ప‌చ్చ మీడియా మాత్రం మ‌ళ్లీ బాబే అంటూ భ‌జాయించేస్తూ ఉంటాయి.. ఇవ‌న్నీ చూసి విసిగిపోయిన జ‌నం.. ఒక్క‌సారి నిఖార్స‌యిన స‌ర్వే వ‌స్తే.. ఈ గోల‌కి స్వ‌స్తి ప‌ల‌కొచ్చ‌గ‌ద‌.. అన్న ఆలోచ‌న‌లో ప‌డ్డారు.. జ‌న‌సైనికులు అయితే ఏకంగా ఆ ప‌చ్చ‌-ప్ర‌తిప‌చ్చ మీడియాల‌కి స‌వాలు విసురుతున్నారు.. మీరు వేసే స‌ర్వేలకి వున్న విలువ ఏంటో జ‌నానికి అర్ధం అయిపోయింది.. అంతా క‌లసి ఖ‌చ్చిత‌మైన స‌ర్వే వేద్దాం.. మీరు ఎంపిక చేసిన ముగ్గురు పాత్రికేయుల్ని(జర్న‌లిస్టుల్ని) లేదా స‌ర్వేలు వేయ‌డంలో చేయి తిరిగిన అనుభ‌వ‌జ్ఞుల్ని అధికార ప‌క్షం త‌రుపున ఓ జ‌ట్టుని., ప్ర‌తిప‌క్షం త‌రుపున ఓ జ‌ట్టునీ పంపండి.. మా జ‌ట్టు కూడా మీకు తోడొస్తుంది.. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి మూడు జ‌ట్ల నుంచి ముగ్గురు వెళ్లి ప్ర‌జాభిప్రాయం సేక‌రిద్దాం.. నిజాయితీగా, నిబ‌ద్ద‌త‌గా ఓ స‌ర్వే చేద్దాం.. అప్పుడు ఎవ‌రి ద‌మ్ము ఏంటో జ‌నానికి చెబుదాం.. ఇది జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మాత్ర‌మే కాదు.. వీరి వెగ‌టుపుట్టే చ‌ర్య‌ల‌కి విసిగిపోయిన కొంద‌రు పాత్రికేయులు కూడా విసురుతున్న స‌వాలు.. మా స‌వాలు స్వీక‌రించేందుకు టీడీపీ-వైసీపీలు సిద్ధ‌మా..? రాష్ట్రంలో ఎవ‌రి ద‌మ్ము ఏంటో తేల్చుకుందాం..? జ‌న‌బ‌లం ఎవ‌రికి ఉందో తేల్చుకుందాం..? సైయ్యా..

Share This:

3,214 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 5 =