Home / జన సేన / నిత్యం కొత్త చేరిక‌లు.. విశాఖ‌లో పార్టీ ప‌టిష్టం.. స‌మ‌ర‌శంఖం పూరించిన జ‌న‌సేనుడు.

నిత్యం కొత్త చేరిక‌లు.. విశాఖ‌లో పార్టీ ప‌టిష్టం.. స‌మ‌ర‌శంఖం పూరించిన జ‌న‌సేనుడు.

జ‌న‌సేన అంటే కుర్రాళ్లేనా.. కాదు జ‌న‌సేన అంటే పెడ‌దోవ ప‌డుతున్న స‌మాజాన్ని గాడిన పెట్టే మేధావులు.. జ‌న‌సేన అంటే దేశాన్ని కాపు కాసే సైనికులు, జ‌న‌సేన అంటే దేశ ప్ర‌తిష్ట‌ని విశ్వ‌విప‌ణిలో రెప‌రెప‌లాడించిన క్రీడాకారులు, జ‌న‌సేన అంటే స‌మాజానికి దిశానిర్ధేశం చేసే విద్యావేత్త‌లు, కార్పోరేట్లు, నిబ‌ద్ద‌త‌తో కూడిన రాజ‌కీయాలు చేసే నిజాయితీతో కూడిన ర‌క్తం గ‌ల నాయ‌కులు.. అందుకే గురువారం గుండెల నిండా ఊపిరి లంఘించి మ‌రీ, ప‌వనుడు స‌మ‌ర‌శంఖం పూరించాడు.. త‌న బ‌లం ప‌ది శాతం అన్న వారి చెవులు చిల్లులు ప‌డేలా., ఈ క్ష‌ణం సై అన్నా ఎన్నిక‌ల‌కి సిద్ధం.. అంటూ విశాఖ నుంచి స‌మ‌ర‌నాధం చేశాడు..

జ‌న‌సేన పార్టీని బ‌లోపేతం చేసే ప్ర‌క్రియ‌లో భాగంగా మ‌లివిడ‌త పోరాట యాత్ర‌లో కొత్త‌ర‌క్తం ఎక్కించే ప్ర‌క్రియ‌కి ద్వారాలు తెరిచారు.. జ‌న‌సేన అధినేత ఎప్పుడు ఎప్పుడు త‌లుపులు తీస్తారా అని ఎదురు చూసిన వివిధ వ‌ర్గాలు(రాజ‌కీయ ప్ర‌ముఖులు, విద్యావేత్త‌లు, మేధావులు, స్వ‌చ్చంద సంస్థ‌ల నిర్వాహ‌కులు, మాజీ సైనికులు) ఆయ‌న స‌మ‌క్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు ఎగ‌బ‌డ్డారు.. ఒక్కొక్క‌రూ వంద‌, వేల మందితో స‌మాన‌మైన శ‌క్తులన్నీ జ‌న‌సేన గూటికి క్యూ క‌ట్ట‌డం మొద‌లు పెట్టాయి.. వారి రాక జ‌న‌సేన‌కి ఊహించిన‌దానికి మించి జ‌వ‌స‌త్వాలు ఇవ్వ‌డం ఖాయం..

తాజా చేరిక‌ల్లో మాజీ సైనికులు పెద్ద సంఖ్య‌లో కుటుంబాల‌తో స‌హా వ‌చ్చి జ‌న‌సేన కండువా భుజాన వేసుకోవ‌డం కీల‌కాంశం.. ఇన్నాళ్లు ప్రాణాల‌కు తెగించి దేశ ర‌క్ష‌ణ బాధ్య‌త‌లు చూసిన వీరంతా., ఇకనుంచి జ‌న‌సైనికులుగా స‌మాజ ర‌క్ష‌ణ బాధ్య‌త‌లు చూస్తామ‌ని జ‌న‌సేన అధినేత‌కి మాటిచ్చారు.. స‌మ‌స‌మాజ స్థాప‌న‌కి జ‌న‌సేన చేసే కృషిలో తామూ భాగ‌స్వాముల‌వుతామంటూ ప్ర‌తిజ్ఞ చేశారు..

మాజీ సైనికులకి నాలుగు సెంట్ల భూమి ఇవ్వ‌లేరా..?

పాత సైన్యం కొత్త సైన్యంగా మారి త‌న‌వెంట న‌డిచేందుకు సిద్ధ‌ప‌డ‌డంతో జ‌న‌సేనుడు వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.. ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యానికి మాజీ సైనికులు నిరాశా, నిస్ప్రుహ‌ల‌కి లోనుకావ‌డం స‌మాజానికే శాప‌మ‌న్నారు.. పాల‌కుల త‌రుపున ఎక్స్ ఆర్మీకి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఆయ‌న‌, వారి కోసం జ‌న‌సేన పార్టీలో ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు.. జ‌న‌సైన్యానికి మీ అనుభ‌వం అవ‌స‌ర‌మ‌న్నారు.. భ‌గ‌వంతుడు మీలా దేశానికి సేవ చేసే అవ‌కాశం నాకివ్వ‌లేద‌న్న ప‌వ‌న్‌., రాజ‌కీయాల ద్వారా ఆ అవ‌కాశం ద‌క్కింద‌న్నారు.. అంద‌రి స‌హ‌కారంతో ముందుకి వెళ్తాన‌న్న ఆయ‌న స‌మాజంలో పెరిగిపోతున్న ఆర్ధిక అస‌మాన‌త‌ల ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. డ‌బ్బున్నోడు మ‌రింత డ‌బ్బున్నోడిగా మారుతుంటే, పేద‌వాడు మ‌రింత పేదోడిగా మిగిలిపోతున్నార‌న్నారు.. మాజీ సైన్యానికి ఇళ్లు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితుల‌పై జ‌న‌సేనాని ధ్వ‌జ‌మెత్తారు.. ప‌క్షికే సొంత గూడు ఉంటుంది.. అలాంటిది దేశం కోసం ప్రాణాల‌కు తెగించి కాపు కాసిన సైన్యానికి నాలుగు సెంట్ల భూమి ఇవ్వ‌లేరా అంటూ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు..

విద్యావేత్త‌లు, వైద్యులు, ప్ర‌ముఖుల చేరిక..

అంత‌కు ముందు విశాఖ‌ప‌ట్నం అక్క‌య్య‌పాలెంలోని క‌ళావాణి ఆడిటోరియంలో మ‌రికొంద‌రు దిగ్గ‌జాలు జ‌న‌సేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.. వీరిలో వివిధ పార్టీల‌కి చెందిన నాయ‌కులు, విద్యావేత్త‌లు, డాక్ట‌ర్లు, వివిధ రంగాల ప్ర‌ముఖులు ఉన్నారు.. ప్ర‌ముఖ విద్యావేత్త ఆలీవ‌ర్ రాయ్‌(కేధ‌రీన్ ఎడ్యుకేష‌న‌ల్ సొసైటీ భీమిలి) , బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ‌, బొగ్గు శ్రీనివాస‌రావు, డాక్ట‌ర్‌. ఎం ముర‌ళీ, గుంటూరు భార‌తీ వెంక‌టేశ్వ‌రిల‌తో పాటు మ‌రో 16 మంది ప్ర‌ముఖులు, వారి అనుచ‌రుల‌తో స‌హా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌మ‌క్షంలో జ‌న‌సేన‌లోకి చేరారు.. వీరంతా ఎలాంటి ప‌ద‌వులు ఆశించ‌కుండా స్వ‌చ్చందంగా జ‌న‌సైనికులుగా మారిపోయారు.. ఉత్త‌రాంధ్ర‌, విశాఖ‌ల్లో రోజు రోజుకీ పెరుగుతున్న జ‌న‌సేన బ‌లాన్ని చూసి ప‌దిశాతం అన్న వారికి వినిపించేలా, క‌నిపించేలా., స‌య్యా అంటూ స‌వాలు విసురుతూ ఇదే వేదిక‌పై నుంచి ప‌వ‌నుడు శంఖం పూరించి స‌మ‌ర‌నాదం చేశారు..

                                                                                    Advertisement..

Share This:

1,997 views

About Syamkumar Lebaka

Check Also

పెనుగొండ‌ని శ్రీ వాస‌వీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ‌గా మారుస్తాం-జ‌న‌సేనాని..

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చాక పెనుగొండ ఊరి పేరును ‘శ్రీ వాస‌వి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ’గా మారుస్తామ‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 + nineteen =