Home / పోరు బాట / నిత్యం క‌రువు కాట‌కాలు, వ‌ల‌స బ‌తుకులు.. ప్ర‌కాశం స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేనుడి చూపు..

నిత్యం క‌రువు కాట‌కాలు, వ‌ల‌స బ‌తుకులు.. ప్ర‌కాశం స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేనుడి చూపు..

img-20170103-wa0000

అనంత త‌ర్వాత ఒంగోలే ఎందుకు..? ప‌్ర‌త్యేక హోదా పోరాటంలో నాలుగో అడుగుకి జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌కాశం జిల్లానే ఎందుకు ఎంచుకున్నారు..? ప‌్ర‌తి జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లో., ప్ర‌త్య‌ర్ధి పార్టీల నాయ‌కుల్లో ఈ ప్ర‌శ్న‌పైనే ప్ర‌స్తుతం అంత‌ర్మ‌ధ‌నం కొన‌సాగుతోంది.. జ‌న‌సేనుడి వ‌ద్ద మాత్రం ఈ ప్ర‌శ్న‌ల‌కి పూర్తి స్థాయిలో స్ప‌ష్ట‌త ఉంది.. పేరుకి రాజ‌ధాని న‌గ‌రం గుంటూరు ప‌క్క‌న ఉన్నా., ప్ర‌కాశం జిల్లాలో ప‌రిస్థితులు కూడా అనంత‌పురం జిల్లాలానే ఉంటాయి.. నిత్యం క‌రువు కాట‌కాలు ఒంగోలు జిల్లాలో రాజ్య‌మేలుతుంటాయి.. చెప్పుకోవ‌డానికి ఒంగోలు గిత్త మిన‌హా ఏమీ లేదు.. ఇక్క‌డికి కేటాయించిన ప్రాజెక్టులు ప‌క్క జిల్లాల‌కి త‌ర‌లిపోతాయి.. వ‌చ్చిన ప్రాజెక్టులు ఒక్క అడుగు ముందుకి క‌ద‌ల‌వు.. పంట‌లు పండ‌వు, పండించిన వాణిజ్య పంట‌ల‌కి గిట్టుబాటు ఉండ‌దు.. దీంతో ఊళ్ల‌కి ఊళ్లు వ‌ల‌స‌బాట ప‌ట్టేశాయి.. అందుకే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌కాశం జిల్లాని ఎంచుకున్నారు..

pkdistfloried

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌కాశం జిల్లా ప‌శ్చిమ ప్రాంతంలో క‌రువు కోర‌ల కాటుకి ఊర్ల‌కి ఊర్లు ఖాళీ అయిపోయాయి.. ఎర్ర‌గొండ‌పాలెం ప‌రిస‌ర ప్రాంతాల్లో చాలా ఊర్ల‌లో జ‌నం ., ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ప్ప క‌న‌బ‌డ‌రు.. భ‌వ‌న నిర్మాణ కార్మికులుగా హైద‌రాబాద్‌, క‌ర్ణాట‌క త‌దిత‌ర ప్రాంతాల‌కు కుటుంబాల‌తో స‌హా వ‌ల‌స‌లు పోతుంటారు.. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తే., ఇలాంటి వారి క‌ష్టాలు తీర‌తాయ‌న్న‌ది జన‌సేనాని ఉద్దేశం.. ఇక క‌నిగిరి ప్రాంతాన్ని ఫ్లోరిన్ భూతం ప‌ట్టిపీడిస్తోంది.. ఈ ప్రాంతాన్ని ఫ్లోరిన్ ర‌హిత ప్రాంతంగా చేస్తామ‌న్న నేత‌ల మాట‌లు., ద‌శాబ‌ద్దాల త‌ర‌బ‌డి ఎన్నిక‌ల హామీల లిస్టులోనే మిగిలిపోయింది..

ds_322_jobsite_veligonda_2009_pic1

ప్ర‌కాశం జిల్లా క‌రువు కాట‌కాల‌కు ప్ర‌ధాన‌మైన మ‌రోకార‌ణం సాగునీటి ఎద్ద‌డి.. వ‌ర్షాలు లేక అనావృష్టి రాజ్య‌మేలితే., ఈ క‌ష్టాలు మ‌రీ ఎక్కువ‌గా ఉంటాయి.. విత్తు మొల‌కెత్తే ప‌రిస్థితులు ఉండ‌వు., మొల‌కెత్తిన విత్తు., మొక్క‌స్థాయిలోనే ఎండిపోతూ., రైతుల కంట ర‌క్తాన్ని నింపుతూ ఉంటాయి.. ఏటా అతివృష్టి, అనావృష్టి ఏదో ఒక‌దానికి ప్ర‌కాశం జిల్లా బ‌లి అవ్యాల్సిందే.. ఈ ప్రాంతానికి ఉన్న ఒకే ఒక వెలుగుధార వెలిగొండ ప్రాజెక్టు.. జిల్లా వాసుల 50 ఏళ్ల క‌ల‌.. నిర్మాణం ప్రారంభ‌మైన నాడు రెండేళ్ల‌లో పూర్తి చేసేస్తామ‌ని పాల‌కులు నీటిమూట‌ల హామీలు ఇచ్చారు.. ఇప్ప‌టికీ దిక్కులేని ప‌రిస్థితి.. ఒక అడుగు ముందుకి ప‌డితే., రెండ‌డుగులు వెన‌క్కి అన్న చందంగా ప‌నులు న‌డుస్తున్నాయి.. వెలిగొండ పూర్త‌యితే ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీటి క‌ష్టాలు తీర‌తాయి.. అయితే నాయ‌కుల‌కి జిల్లాకి వచ్చిన‌ప్పుడు మిన‌హా వెలిగొండ అనేది గుర్తే ఉండ‌దు.. ఆర్ధిక వ‌న‌రుల విడుద‌ల‌లో జాప్య‌మే ప్రాజెక్టు ప‌నుల న‌త్త‌న‌డ‌క‌కు కార‌ణం.. హోదా సిద్దిస్తే., ఈ క‌ల నెర‌వేర‌డం తేలికే..

ramayapatnam-beach

ఇదంతా ఒక ఎత్త‌యితే పండించిన శ‌న‌గ‌, పొగాకుల‌కి గిట్టుబాటు ఉండ‌దు., స‌రుకు నెల‌ల త‌ర‌బ‌డి కోల్డు స్టోరేజిల్లో మ‌గ్గుతూనే ఉంటాయి.. ఇక ప్ర‌కాశం వాసుల మ‌రో క‌ల రామాయ‌ప‌ట్నం పోర్టు.. ఇది కాస్త ప‌క్క‌జిల్లా నేత‌ల ప‌లుకుబ‌డితో దుర్గిరాజుప‌ట్నానికి త‌ర‌లిపోయింది.. దీనిపై అధికార, విప‌క్షాల‌కి ఉన్న నిబ‌ద్ద‌త నేతి బీర‌లో నేతి చంద‌మే.. ప్ర‌జాసంఘాలు మాత్ర‌మే పోర్టు సాధ‌న స‌మితి పేరిట పోరాటం చేస్తున్నాయి.. దీంతో పోర్టు వ‌స్తే ఉపాధి దొరుకుతుంద‌న్న ఆశ‌లు కూడా ఆవిర‌య్యాయి..

పేరుకి అటు నెల్లూరుకి, ఇటు గుంటూరుకి మ‌ధ్య‌న ఉన్నా., నిత్యం క‌రువు విల‌య‌తాండ‌వ‌మే.. ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే అనంత‌ను మించిన క్లిష్ట‌ప‌రిస్థితులు ఒంగోలులో ఉన్నాయి.. ఇలాంటి జిల్లాల‌కు ప్ర‌త్యేక హోదా అవ‌స‌రాన్ని., నాయ‌కుల‌కి క‌న‌బ‌డ‌ని స‌మ‌స్య‌ల్ని ఎలుగెత్తేందుకే జ‌న‌సేనాని త‌న నాలుగో స‌భ ఇక్క‌డ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.. అన్నీ అనుకున్న‌ట్టు పూర్త‌యితే నెలాఖ‌రుకి ఒంగోలు వేదిక‌గా ప‌వ‌ర్‌స్టార్ ప్ర‌జ‌ల ప‌క్షాన గ‌ర్జిస్తారు..

Share This:

2,477 views

About Syamkumar Lebaka

Check Also

పార్టీలుగా పోటీప‌డ‌దాం.. ప్ర‌జాస‌మ‌స్య‌ల విష‌యంలో ఒక్క‌ట‌వుదాం-జ‌న‌సేన‌

జ‌న‌సేన పార్టీ పుట్టుక ల‌క్ష్యం ఏంటి అనే విష‌యం ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాటం చేసిన ప్ర‌తి సారీ బ‌హిర్గ‌త‌మ‌వుతూనే …

One comment

 1. సోమిశెట్టి శ్రీనివాస్

  *SAVE PRAKASAM*

  నా ప్రకాశం జిల్లా…
  వికాసం ఇసుమంతైనా కానరాని జిల్లా…
  ఎన్నికలలో నేతల హామిలు భ’ల్లా’నే…
  ‘ఎన్నొ’కలల్లో జనత ఎప్పటికి అ’ల్లా’నే…

  గొంతు మూగబోయిన జిల్లా ప్రజ’ల్లా’రా…

  అందరం కలిసి ఎలుగెత్తి చెపుద్దాం ఆ ప్రజానాయకులకు…

  ఇకనైనా మౌనం విడనాడండి…
  జిల్లాను అభివృద్ధి ఫదం లోకి నడిపించండి…

  లేదా…

  జనం నుంచి జనం కోసం జిల్లాను బాగుచేయడానికి ఒక్కడు ముందుకు వస్తాడు…

  అతనే…
  మార్పు మనలోనే మొదలు అయి…మన సమాజంలో మార్పు తీసుకోని వస్తుంది…
  అని నమ్మే ఓ సామాన్యుడు…
  మనలోంచే ఓవరో ఒక్కడు…

  మీ..
  సోమిశెట్టి శ్రీనివాస్
  9640080400
  *Save Prakasam*
  Save Trees ? Save Life ?Save Earth ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three + eighteen =