Home / జన సేన / నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఏక‌మౌతున్న ఔత్సాహికులు, ప్ర‌భ‌లశ‌క్తిగా జ‌న‌సేన‌..

నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఏక‌మౌతున్న ఔత్సాహికులు, ప్ర‌భ‌లశ‌క్తిగా జ‌న‌సేన‌..

img-20161220-wa0060

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్దంగా ఉండే అభిమానుల సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటుంది.. ఇందులో ఆయ‌న్ని హీరోగా ఆభిమానించే వారు కొంద‌రు అయితే., జ‌న‌సేన పార్టీ అధినేత‌గా, నికార్స‌యిన పొలిటీషియ‌న్‌గా ఆరాధించేవారు మ‌రికొంద‌రు.. ఓవ‌రాల్‌గా అంద‌రి ల‌క్ష్యం ఒక్క‌టే.. మ‌రి వీరంతా ఏక‌తాటిపైకి రావాలంటే., ఏం చేయాలి..? రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న జ‌న‌సేన ఔత్సాహికుల స‌మావేశాలు అందుకోస‌మే.. ఇప్ప‌టికే తూర్పుగోదావ‌రి జిల్లా వ్యాప్తంగా ఔత్సాహికుల భేటీలు కొన‌సాగుతుండ‌గా., తాజాగా ప్ర‌కాశం జిల్లాలోనూ మొద‌ల‌య్యాయి.. జిల్లాలో కీల‌క‌మైన గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఆరు మండ‌ల కార్య‌క‌ర్త‌లు స‌మావేశ‌మ‌య్యారు..

img-20161220-wa0061

బెల్లంకొండ సాయిబాబు నేతృత్వంలో జ‌రిగిన ఈ ఔత్సాహికుల భేటీలో పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు.. ముఖ్యంగా జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు., ఇత‌ర పార్టీల‌కు దూరంగా ఉంటూ స్వ‌యం ప్ర‌తిప‌త్తి సాధించాల‌నే అంశాన్ని ప్ర‌తిపాధించారు.. కిందిస్థాయిలో ఎవ‌రికైనా ఇబ్బందులు వ‌స్తే., మండ‌ల‌స్థాయి, నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో బాధ్య‌త‌లు స్వీక‌రించే జ‌న‌సైనికులు వారికి అండ‌గా నిల‌బ‌డాల‌ని ప‌లువురు సూచించారు.. అయితే పార్టీని స‌మ‌స్య‌ల్లోకి నెట్టే ప‌నుల‌కి దూరంగా ఉంటూ., ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, సేవా కార్య‌క్ర‌మాల‌పై దృష్టి సారించాల‌ని స‌మావేశం నిర్వ‌హించిన జ‌న‌సేన నేత సాయిబాబు కార్య‌క‌ర్త‌ల‌కి సూచించారు..

Share This:

700 views

About Syamkumar Lebaka

Check Also

కాకినాడ సెజ్‌లో జ‌న‌సేనాని.. బాధితుల వెత‌లు విన్న ప‌వ‌న్‌.. విత్ ఫోటో గ్యాల‌రీ..

కాకినాడ సెజ్‌..కేవీ రావు అక్ర‌మాల‌పై బాధితుల పోరాటానికి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురువారం ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు.. యూ.కొత్త‌ప‌ల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 3 =