Home / జన సేన / నిస్వార్ధ ప్ర‌జా సేవే.. నిస్వార్ధ రాజ‌కీయం.. ఓట్లు లేని వారికి సైతం చేసే సేవ అది..

నిస్వార్ధ ప్ర‌జా సేవే.. నిస్వార్ధ రాజ‌కీయం.. ఓట్లు లేని వారికి సైతం చేసే సేవ అది..

నిస్వార్ధ రాజ‌కీయం అంటే., ఏంటి..? ప‌్ర‌తిఫ‌లాపేక్ష లేకుండా ప్ర‌జా సేవ చేయ‌డం.. ఏ థియ‌రీలో మాట్లాడినా ఇదే ఫైన‌ల్‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేస్తోంది.. చెబుతోంది.. ఇదే.. మాకు ఓట్లు అవ‌స‌రం లేదు.. గెలుపు అవ‌స‌రం లేదు.. ఓట్లు వేసినా., వేయ‌కున్నా ప్ర‌జా సేవ చేస్తాం.. జీవితాంతం చేస్తూనే ఉంటాం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఈ సిద్ధాంతం నుండి స్ఫూర్తి పొందిన పార్టీ కార్య‌క‌ర్త‌లు అలాంటి నిస్వార్ధ సేవ‌ను నిత్యం చేస్తున్నారు.. నిస్వార్ధ సేవ అని ఎలా చెబుతారు.. అంటే ఓటు హ‌క్కు రాని స్కూలు పిల్ల‌ల‌కి కూడా సేవ చేయ‌డం., వారి నుంచి ఏం ఆశించి చేస్తున్న సేవ అది..?

ప్ర‌కాశం జిల్లాలో దాదాపు రెండు వేల మంది విద్యార్ధుల‌కి జ‌న‌సేన సేవాద‌ళం స‌భ్యులు వైద్య ప‌రీక్ష‌లు చేయించి మందులు పంపిణీ చేశారు.. జిల్లాలో మూరుమూల ప్రాంతాలు గిద్ద‌లూరులోని మారుమూల ప్రాంతం అర్ధ‌వీడు మండ‌లంలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌, గురుకుల పాఠ‌శాల‌ల్లో., విద్యార్ధుల‌కి వైద్య ప‌రీక్ష‌లు చేయించి., చిన్న చిన్న స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి హోమియో మందులు పంపిణీ చేశారు.. సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా మ‌రికొంద‌రికి వ్యాక్సిన్స్ వేయించారు..

అటు కంభంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌, జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో కూడా ఉచిత హోమియో వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.. సేవాద‌ళ్ స‌భ్యులు ఆనంద‌ప్ర‌దీప్‌, అలంకార్ శ్రీను, మ‌హ్మ‌ద్ పాషా ఖాద్రీ, కుమార్‌లు ఈ కార్య‌క్ర‌మానికి స‌హ‌క‌రించారు.. ఇక్క‌డ రెండు విష‌యాలు గ‌మ‌నార్హం.. ఒక‌టి స‌ర్కారీ స్కూళ్ల‌లో మంద‌లు పంపిణీ., రెండోది ఓటు హ‌క్కు కూడా రాని చిన్నారుల‌కి చేస్తున్న సేవ‌.. జ‌య‌హో జ‌న‌సైన్యం..

Share This:

About Syamkumar Lebaka

Check Also

అగ్నికి ఆహుతైన ఇళ్లు.. వితంతువుల‌కి జ‌న‌సైనికుల సాయం..

అభాగ్యుల సేవ‌లో నిత్యం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు త‌రిస్తూనే ఉన్నారు.. ఎక్క‌డ ఎవ‌రికి ఏ ఆప‌ద వ‌చ్చినా మేమున్నాం అంటూ ఆప‌న్న‌హ‌స్తం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 − three =

%d bloggers like this: