Home / ఎడిటోరియల్స్ / నీవోక దుర్గం.. నీదొక స్వ‌ర్గం.. ఓ జ‌న‌సేనుడా.. అనిత‌ర సాధ్య‌మ‌యా నీ మార్గం..!!

నీవోక దుర్గం.. నీదొక స్వ‌ర్గం.. ఓ జ‌న‌సేనుడా.. అనిత‌ర సాధ్య‌మ‌యా నీ మార్గం..!!

విజ‌యానికి పొంగిపోడు.. అప‌జ‌యానికి కుంగిపోడు.. అలుపెరుగ‌ని పోరాట యోధుడు.. చీక‌ట్లో చిరు దీపం లేకున్నా.. దారంతా గ‌త‌కుల మ‌య‌మైనా మ‌డ‌మ తిప్ప‌ని ధీరుడు.. ప్ర‌జా పోరాటంలో వెన్ను చూప‌ని వీరుడు.. ఇంకా చెప్పాలంటే ఆయ‌న ఓట‌మిని ఓడించిన ఘ‌నుడు.. అవును చూడ‌డానికి ఓ మౌన మునే కానీ., గ‌ళం విప్పితే.., ఓ దేశ ప్ర‌ధానిని రోడ్డు మీద‌కి తీసుకురాగ‌ల శ‌క్తి ఆయ‌న సొంతం.. ప్ర‌తి అడుగులో పాతికేళ్ల అంత‌ర్మ‌ధ‌నం దాగి వుంది.. మ‌రో పాతికేళ్ల నిర్ధిష్ట‌మైన ప్ర‌ణాళికా వుంది.. అనుక్ష‌ణం స‌ల‌స‌ల మ‌రిగే ర‌క్తం ఆయ‌న బ‌లం.. నిత్య పోరాటం ఆయుధం.. ప్ర‌తి అడుగులో విజ‌యం ఆయ‌న‌కి బానిస‌.. ఆయ‌న మాత్రం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కి బానిస‌.. ప్ర‌జా సేవ‌కి బానిస‌.. మాన‌వ‌త్వానికి బానిస‌.. అందుకే కోట్లాది మంది ఆయ‌న‌కి బానిస‌ల‌య్యారు..

ఇంత చెప్పాక ఆయ‌న పేరు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.. వ‌న్ అండ్ ఓన్లీ జ‌నసేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. కను సైగ‌తో కోట్లు కూడ‌బెట్టుకో గ‌ల సామర్ధ్యం ఆయ‌న సొంతం.. అస‌మాన్యుడే అయినా అతిసామాన్యుడు ఆయ‌న‌.. ఓ మ‌నిషి బ‌త‌క‌డానికి ఎంత అవ‌స‌ర‌మో అంతే మాత్ర‌మే ద‌గ్గ‌రుంటే చాలు.. మిగులు మొత్తం ఎముక‌లేని చెయ్యికి అప్ప‌గించు. క‌ష్టాల్లో ఉన్న వారిని వెతుక్కుని వెళ్లి మ‌రీ అది దానం చేసేస్తుంది అన్నది ఆయ‌న సిద్ధాంతం.. ఆ దానాలు కూడా కుడి చేతితో చేసింది ఎడ‌మ చేతికి తెలియ‌రాదు.. ఇది ఇవాల్టికివ్వాళ పుట్టిన ఆలోచ‌న కాదు.. కంటికి క‌న‌బ‌డ‌ని శ‌త్రువుతో 25 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు.. ప్ర‌తి ఒక్క‌రి క‌ష్టం తీర్చే శ‌క్తి కోసం ప‌రిత‌రిస్తూనే ఉన్నాడు..

త‌న గ‌మ్యం.. త‌న ల‌క్ష్యం వేరైనా.. ముఖానికి రంగేసుకున్నాడు.. ఆ రంగు మాటున వున్న మ‌న‌సుతో కోట్లాది మందికి ఆరాధ్యుడ‌య్యాడు.. ప్ర‌తి ప‌నీ తాను చేస్తూ.. ఆ కోట్లాది మందితో చేయిస్తూ., కొల‌త‌కి ఆర‌డుగులే అయినా వ్య‌క్తిత్వంలో మాత్రం ఎవ‌రెస్ట్ ఎత్తుకి ఎదిగాడు.. ఒక్క‌రికి ఒక్క స‌మ‌స్య ఉంటేనే ఇష్ట‌ప‌డ‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. ఇన్ని వంద‌లు, వేలు, ల‌క్ష‌ల మంది రాజ‌కీయ క్రీడ‌లో పావులుగా మార‌డాన్ని స‌హించ‌లేక‌.. జ‌నం త‌రుపున గ‌ళం విప్పేందుకు జ‌న‌సేన‌ని స్థాపించాడు.. అడ్డ‌దిడ్డంగా జ‌రిగిన రాష్ట్ర విభ‌జ‌న‌కి నిర‌స‌న‌గా దేశ రాజ‌కీయాల్లోకి ఓ స‌రికొత్త రాజ‌కీయ శ‌క్తిని సృష్టించాడు..

రాజ‌కీయ పార్టీ అంటే ఎన్నిక‌ల్లో పోటీ చేయాలి..గెల‌వాలి అన్న మూస ధోర‌ణికి చ‌ర‌మ‌గీతం పాడుతూ,, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాట‌మే మ‌ర‌మావ‌ధిగా నాలుగేళ్ల ప్ర‌స్థానం పూర్తి చేసుకున్నాడు.. ఆ క్ర‌మంలో ఆయ‌న సాధించిన విజ‌యాలు ఎన్నో.. ఎన్నెన్నో.. కొత్త రాష్ట్రం క‌ష్టాల పాల‌వ‌రాద‌న్న ఆలోచ‌న‌తో అనుభ‌వానికి ఓటేయ‌డానికి సై అన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.,. మొద‌టి నుంచి స‌మ‌స్య‌ల‌పై యుద్ధం చేస్తూనే ఉన్నారు.. రాజ‌ధాని పేరుతో పాల‌కులు రైతుల భూములు బ‌ల‌వంతంగా లాక్కోవాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్పుడు., ప్ర‌తిప‌క్షం ప‌ట్టించుకోని స‌మ‌యంలో నేనున్నానంటూ రంగంలోకి దిగి వారికి న్యాయం జ‌రిగే ఏర్పాటు చేశారు.. ఇప్ప‌టికీ రాజ‌ధాని పేరిట టీడీపీ స‌ర్కారు చేస్తున్న భూ దోపిడిపై పోరాటం సాగిస్తూనే ఉన్నారు..

అనుభ‌వం క‌ధా.. విభ‌జ‌న‌లో న‌ష్ట‌పోయిన కొత్త రాష్ట్రాన్ని ఆదుకుంటారు క‌దా.. అని చంద్ర‌బాబు వైపు మొగ్గు చూపితే., రాష్ట్రాన్ని అన్ని ర‌కాలుగా దోచుకోవ‌డానికే టీడీపీ స‌ర్కారు ప్రాధాన్య‌త‌నివ్వ‌గా.. త‌ప్పు జ‌రిగిన ప్ర‌తిసారీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌బ్లిక్‌గానే హెచ్చ‌రిస్తూ వ‌చ్చారు.. తుందుర్రు మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధితులు ఆదుకోమంటూ త‌న వ‌ద్ద‌కి వ‌చ్చిన‌ప్పుడు వారి త‌రుపున గ‌ళం విప్పారు.. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఏకంగా ఓ య‌జ్ఞాన్నే చేశారు.. చేస్తూనే ఉన్నారు.. చేనేత‌ల వెత‌లు విని వారికి స్వ‌చ్చందంగా బ్రాండ్ అయ్యారు.నెల్లూరు విక్ర‌మ సింహ‌పురి విద్యార్ధుల స‌మ‌స్య‌లు తీర్చారు.. క‌డియం న‌ర్స‌రీ రైతులు, ఫాతిమా మెడిక‌ల్ కాలేజీ విద్యార్ధులు.. ఇలా నిత్యం ఏదో ఒక స‌మ‌స్య‌ని త‌న స్ట‌యిల్లో ప‌రిష్క‌రిస్తూ జ‌నానికి జ‌న‌సేన‌పై నమ్మ‌కం పెంచుతూ వ‌చ్చారు..

ఆఖ‌రిపోరాటం పోరాట‌యాత్ర‌..!!
జ‌న‌సేన ఒక్కో స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తుంటే.. ప‌దులు.. వంద‌ల సంఖ్య‌లో స‌మ‌స్య‌లు ఆ పార్టీ త‌లుపుత‌ట్ట‌డం మొద‌లు పెట్టాయి.. దీంతో పాటు రాష్ట్రంలో పాల‌క ప్ర‌తిప‌క్షాలు రాష్ట్ర ప్ర‌జ‌ల విభ‌జ‌న హామీల సాధ‌న విష‌యంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాయి.. ముఖ్యంగా సిఎం చంద్ర‌బాబు ముందు హోదా వ‌ద్దు అని, ఇప్పుడు మ‌ళ్లీ హోదానే ముద్దు అని ఇష్టారాజ్యంగా నాలుక మ‌డ‌చడం.. పాల‌న‌లో ప్ర‌తి అడుగు అవినీతి-బంధు ప్రీతి అన్న చందంగా మార‌డం.. ప‌చ్చ చొక్కాల‌కి మాత్ర‌మే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు వ‌ర్తిప‌చేసి మిగిలిన ప్ర‌జ‌ల్ని ఇబ్బందుల‌కి గురిచేయ‌డం లాంటి అసుర పాల‌నా వ్య‌వ‌స్థ వేళ్లూను కోవ‌డంతో., నాలుగేళ్లుగా ర‌గులుతున్న‌., రాష్ట్ర భాగు కోసం కంఠంలో దాచుకున్న గ‌ర‌ళం.. మార్చ్ 14 మంగ‌ళ‌గిరి సాక్షిగా ఒక్క‌సారిగా బ‌ద్ద‌ల‌య్యింది.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌జా కంఠ‌క పాల‌న సాగిస్తున్న టీడీపీ స‌ర్కారుపై తిరుగు బావుటా ఎగుర‌వేశారు..                                                                         Advertisement.

ప్ర‌త్యేక హోదా సాధ‌న‌తో పాటు ప్ర‌జా స‌మ‌స్య‌ల అధ్య‌య‌నం, వీలైన చోట స్పాట్‌లో పోరాటానికి దిగుతూ ప‌రిష్కార మార్గాలు చూప‌డం ల‌క్ష్యంగా పోరాట యాత్ర‌ను ప్రారంభించారు.. ఉత్త‌రాంధ్ర మూడు జిల్లాల్లో మొద‌ట యాత్ర సాగించిన ఆయ‌న‌., ఆ ప్రాంతం ఉద్దేశ‌పూర్వ‌కంగా వెన‌క్కి నెట్ట‌బ‌డింద‌ని తెలుసుకున్నారు.. మేథావుల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టారు.. ప్ర‌జ‌ల్ని ఐక్యం చేశారు.. ఎలాంటి స‌మ‌స్య‌పై నైనా ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటానికి నేనున్నాన‌న్న భ‌రోసా క‌ల్పించారు.. ఉత్త‌రాంధ్ర‌లో జ‌న‌సేన ప్రాభ‌ల్యం పెర‌గ‌డంతో ప్ర‌త్య‌ర్ధులు వ్య‌క్తిగ‌త దాడుల‌కి దిగారు.. ప్ర‌జ‌ల కోసం అన్నింటినీ భ‌రించిన జ‌న‌సేనాని., ప్ర‌జా పాల‌సీల‌పై మాట్లాడుదాం.. ప్ర‌జల అవ‌స‌రాల కోసం పోరాడుదాం ర‌మ్మంటూ ప్ర‌త్య‌ర్ధుల‌కి స‌వాళ్లు విసురుతూ వారి నోళ్లు మూయించారు..

ప‌వ‌న్ పోరాట యాత్ర గోదావ‌రి జిల్లాల‌కి చేరే స‌రికి ప్ర‌త్య‌ర్ధుల కోట‌లు బీట‌లు వారాయ‌న్న సంగ‌తి వారికి అర్ధ‌మైపోయింది.. జ‌న‌సేన‌ని ఆప‌డం ఎలా అర్ధం కాక త‌ల‌ప‌ట్టుకోవ‌డం మాత్ర‌మే వారి వంత‌య్యింది.. ఈ మొత్తం ప్ర‌స్థానంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌జ‌ల కోసం సాధించిన విజ‌యాలు ఎన్నో..? అదే స‌మ‌యంలో పార్టీ, పార్టీని న‌డిపిస్తున్న నేత‌లు, జ‌న‌సైనికులు ఎలాంటి ప‌రిస్థితుల్లో స‌హ‌నం కోల్పోకుండా..? ప‌్ర‌త్య‌ర్ధుల ఉచ్చులో ప‌డ‌కుండా కాపాడుకుంటూ., నెమ్మ‌దిగా ఓ క్ర‌మ ప‌ద్ద‌తిలో క‌మిటీల‌ని నియ‌మిస్తూ ముందుకి సాగుతున్నారు.. జ‌న‌సేనుడి మొద‌టి పోరాటం నుంచి., కార్య‌వ‌ర్గ ఎంపిక వ‌ర‌కు కొంత మంది నిపుణుల స‌ల‌హాలు, కార్య‌క‌ర్త‌ల క‌ష్టాన్ని గుర్తిస్తూ., అందుకోసం మ‌రో వ్య‌వ‌స్థ‌ని నియ‌మించి., అన్ని ర‌కాల భారాన్నీ ఒక్క‌డే మోస్తూ పార్టీని ఇప్ప‌టికే వేళ్లూనుకున్న ప్ర‌త్య‌ర్ధుల‌కి ఢీ అంటే ఢీ అనే ప‌రిస్థితికి తీసుకువ‌చ్చారు.. స్వ‌దేశంలోనే కాక విదేశాల్లోనూ ఆయ‌న‌కి విప‌రీత‌మైన ఫాలోయింగ్ తీసుకువ‌చ్చాయి..

ఏ స్థాయికి వెళ్లినా.. ఎంత క‌ష్టం వ‌చ్చినా తొణ‌క‌ని ఆత్మ‌విశ్వాసం.. ఎదుటి వారికి క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే చ‌లించే త‌త్వం.. అసామాన్యుడే అయినా అతిసామాన్య జీవ‌న‌విధానం.. రాజ‌కీయంలో చాణ‌క్యం., ర‌ణ‌రంగంలో శ‌త్రువుని చంప‌డం కాదు.. గెల‌వ‌డం ముఖ్య‌మ‌న్న ర‌ణ‌నీతి. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిసిన నిలువెత్తు రూపం ద గ్రేట్ లీడ‌ర్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.. నాడు మ‌హా క‌వి మ‌హాప్ర‌స్థానంలోని ఆ ప‌ధాలు అందుకే ఆయ‌న‌కి అద్దిన‌ట్టు స‌రిపోతాయ‌నిపించింది.. జ‌నం కోస‌మే పుట్టిన జ‌న‌సేనుడా.. నీకివే మా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.. కోట్లాది మంది గుండెల్లో కొలువైన నీవు నిండు నూరేళ్లు వ‌ర్ధిల్లాల‌ని మ‌నస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ….

Advertisement..

Share This:

1,709 views

About Syamkumar Lebaka

Check Also

సేనాని బాటే నా మాట‌.. అసెంబ్లీలో ప్ర‌యాణంపై జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక‌..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున శాస‌న‌స‌భ‌కు ఎన్నికయిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌కు పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభినంద‌న‌లు తెలియ‌చేశారు.. తూర్పుగోదావ‌రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − 5 =