Home / పెన్ పోటు / రామ‌..రామా.. కృష్ణ‌.. కృష్ణా.. ఏమిటీ పిశాచి కూత‌లు..

రామ‌..రామా.. కృష్ణ‌.. కృష్ణా.. ఏమిటీ పిశాచి కూత‌లు..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు అంద‌రికీ హాట్ కేకే.. ఆయ‌న తుమ్మినా, ద‌గ్గినా హైలెట్ చేసేస్తూ చాన‌ళ్లు వార్త‌ల్ని క్యాష్ చేసుకుంటుంటే., ఈ మ‌ధ్య ఏబీఎన్‌, ఆంధ్ర‌జ్యోతి లాంటి మీడియా సంస్థ‌లు పెయిడ్ స‌ర్వేల‌కి తెర‌తీశాయి.. ఇక్క‌డా ల‌క్ష్యం ప‌వ‌న్‌క‌ళ్యాణే.. జ‌న‌సేనాని టార్గెట్ చేస్తే., కాస్త ఎక్కువ క్యాష్ ముడుతుండ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని పాత్రికేయ లోకం కోడై కూస్తోంది.. ఏపీలో ప్ర‌తిప‌క్ష ప‌త్రిక సాక్షిలో ఈ మ‌ధ్య ఇలాంటి పెయిడ్ సంపాద‌కీయాలు చూశాం.. ఊర‌క‌నే కూర్చోబెట్టి ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఇస్తున్నారు కాబ‌ట్టి., త‌మ పెన్‌తో పవ‌న్‌పై విషం క‌క్కాలి.. యాజ‌మాన్యం మెప్పుపొందాలి అనే ల‌క్ష్యంలో రామ‌చంద్ర‌రావు ద‌గ్గ‌ర్నుంచి దేవుల‌ప‌ల్లి అమ‌ర్ వ‌ర‌కు అంతా శ‌క్తి వంచ‌న లేకుండా ప్ర‌య‌త్నాలు చేశారు.. ఇలాంటి అస‌త్య ప్ర‌చారాలు చూడ‌లేక జ‌నం ఈ మ‌ధ్య వెబ్ సైట్ల వైపు మ‌ళ్లారు.. అది గ‌మ‌నించిన యాంటీ ప‌వ‌న్ వ‌ర్గం., వెబ్‌ల వైపు దృష్టి సారించిన‌ట్టు ఉంది.. త‌మ అస‌త్య ప్ర‌చారాల‌కు ఐటం గాళ్ల‌ను పావులుగా మార్చేసింది…

ఇంటి ద‌గ్గ‌ర టీవీలు, పేప‌ర్లు చూసే తీరిక‌లేని జ‌నం ఈ మ‌ధ్య వార్త‌ల కోసం వెబ్‌సైట్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.. దీంతో నెట్టింట న్యూస్ పోర్ట‌ల్స్ పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చాయి.. బిజినెస్ బాగుండ‌డంతో., జ‌ర్న‌లిజం అనే ప‌దం తెలియ‌ని వారు కూడా ఈ వెబ్‌పోర్ట‌ల్స్ వ్యాపారంలోకి దిగేశారు.. ఖాళీగా ఉన్న జ‌ర్న‌లిస్టుల‌కి ఔట్సోర్సింగ్ ప‌ద్ద‌తిలో ఐటంకి 100 నుంచి 200 ఇచ్చి రాయించుకుంటూ., వెబ్ సైట్ల‌ను న‌డిపిస్తున్నారు.. ఈ కోవ‌కు చెందిందే ఇండియా హెరాల్డ్‌(ఇండియ‌న్ హెరాల్డ్ కాదు) హిందీతో పాటు ద‌క్షిణ భార‌తంలోని అన్ని భాష‌ల న్యూస్ ప్రేమికులు ల‌క్ష్యంగా కొంద‌రు ఎన్ఆర్ ఐలు ఈ వెబ్ న‌డుపుతున్న‌ట్టు జ‌ర్న‌లిస్టు కాల‌నీ టాక్‌.. ఇక్క‌డి వ‌ర‌కు అంతా ఓకేగానీ., ఈ మ‌ధ్య ఈ వెబ్‌లో క‌థ‌నాలు దారి త‌ప్పాయి..

పార్టీల నుంచి అందే క‌వ‌ర్ల కోసం క‌క్కుర్తి ప‌డుతున్న కొంద‌రు అక్ష‌రాల్ని అమ్ముకోవ‌డ‌మే అందుకు కార‌ణం.. ట్విట్ట‌ర్ ఫైట్‌తో జ‌న‌సేనాని పేరు ఇంటా బ‌య‌టా మారుమ్రోగుతుండ‌డంతో ప‌రిస రామ‌కృష్ణారావు అనే ఓ పెయిడ్ ఆర్టిస్టు., త‌న క‌లానికి ప‌ని చెప్పారు.. జ‌న‌సేనాని, ఆయ‌న సేన నిత్యం సేవాకార్య‌క్ర‌మాల‌తో జ‌నంలోకి దూసుకుపోతుంటే., ఈయ‌న‌గారికి ఆర్నెల్ల క్రితం ప‌వ‌న్ ఏదో మాట్లాడిన చందంగా ఉందంట‌.. ప‌వ‌న్ ప్ర‌జ‌ల‌కు చేసిన సేవ ఏంటి అన్న‌ది రామ‌కృష్ణారావుగారి త‌ర్వాతి ప్ర‌శ్న‌.. ఇటీవ‌లే సొంత‌ఖ‌ర్చుతో ఓ ఓల్డేజ్‌హోంకి భ‌వ‌నాన్ని సొంత ఖ‌ర్చుల‌తో నిర్మించి ఇచ్చారు.. దీంతో పాటు ఆయ‌న ద‌గ్గ‌రికి దేహీ అని వ‌చ్చిన ఏ ఒక్క‌ర్నీ ఉట్టిచేతుల‌తో పంపార‌న్న హిస్టరీ లేదు.. ఆయ‌న ఏం సేవ చేశారు అని మీరు ప్ర‌శ్నిస్తున్నారంటే., మీకు దృష్టి మాంధ్య‌మైనా ఉండాలి లేక మీరు తీసుకున్న క‌వ‌ర్‌కి న్యాయం చేసే ఏకైక ఉద్దేశంతో ఆ ప‌దం రాసి ఉండాలి..

మీటింగుల వ‌ల్ల ఎవ‌రికి ప్ర‌యోజ‌నం అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌.. రాజ‌కీయాలు బాగా అవ‌పోస‌న ప‌ట్టించుకున్న మ‌న నాయ‌కులు ప్ర‌త్యేక హోదాని ప్యాకేజీగా మ‌లిచేసి జ‌నాన్ని మోసం చేస్తుంటే., ఆ మోసాన్ని జ‌నం ముందు పెడుతున్నారు.. ఇక ఈ పెయిడ్ ఆర్టిస్టు(జ‌ర్న‌లిస్టు)గారికి దేశ వ్యాప్తంగా జ‌నం ప‌డుతున్న ఇన్ని క‌ష్టాల‌కూ కార‌ణ‌మైన రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్‌గారిపై వ‌ల్ల‌మాలిన ప్రేమ పుట్టింది.. ఉర్జిత్ కేవ‌లం వ్య‌వ‌స్థ‌ను మాత్ర‌మే న‌డిపిస్తారంట‌.. ఆర్డ‌ర్ వేసింది మోడీగా అంటున్నారు.. అవును పెద్ద నోట్లు ర‌ద్దు చేద్దామ‌న్న నిర్ణ‌యం మాత్ర‌మే మోడీది.. దాన్ని ప‌క్కా ప్ర‌ణాళిక‌తో అమ‌లుప‌ర్చాల్సిన బాధ్య‌త మ‌రి ఈ కార్య‌నిర్వహ‌ణాధికారిదేగా.. నోట్లు స‌రిప‌డా ప్రింట్ కాన‌ప్పుడు., స‌కాలంలో జ‌నానికి అందించ‌లేన‌ప్పుడు.. మోడీకి ఓకే అనౌన్స్ చేసేయండి అని ఉర్జిత్ ఎందుకు చెప్పిన‌ట్టు.. మోడీ శాసించ‌డం మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు., మ‌రి కార్య‌నిర్వ‌హ‌ణ చూసుకోవాల్సింది ఉర్జితేగా.. రిజ‌ర్వ్ బ్యాంకు గ‌వ‌ర్న‌ర్ అంత‌టివాడు ఈ రామ‌కృష్ణ‌రావుగారికి చాలా చిన్న‌మ‌నిషిగా ఎలా క‌న‌ప‌డ్డారో అస్స‌లు అర్ధంకావ‌డం లేదు.. జ‌న‌స‌నాని ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం ఎందుకు త‌ప్పుగా అనిపించిందో అర్ధంకాలేదు..

ఇక్క‌డ ఇంకో క్యామిడీ కూడా చేశారు.. కేంద్ర‌, రాష్ట్రాల‌కి సింహ‌స్వ‌ప్నంగా మారిన జ‌న‌సేనాని మోడీ, చంద్ర‌బాబుల‌కి భ‌య‌ప‌డ్డారంట‌.. వంద కోట్లు ఊరికే ఇస్తాన‌న్నా., వ‌ద్ద‌న్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్.. మోడీ జోలికి వెళ్ల‌క‌పోవ‌డానికి చెప్పిన కార‌ణం హాస్యాస్ప‌దం.. ఇక బాబుగారితో పెట్టుకుంటే ఏకంగా ప‌వ‌ర్‌స్టార్ సినిమాలు రిలీజుకావంట‌.. ఇది పెద్ద జోక్‌.. ఓ వైపు ప‌వ‌న్ ప‌వ‌ర్ చూసి ఆయ‌న‌తో జ‌గ‌డం వ‌ద్ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తుంటే., ఈ పేయిడ్ ఆర్టిస్టు(జ‌ర్న‌లిస్టు)గారికి మాత్రం జ‌న‌స‌నాని భ‌య‌ప‌డుతున్న‌ట్టు క‌న‌బ‌డుతోంది.. బ‌హుశా ఈయ‌న‌కి వ‌య‌సు మీద‌ప‌డి ఇంకా ఏదైనా తేడా వ‌చ్చి ఉండొచ్చ‌న్న‌ది ప‌వ‌న్‌సేన అభిప్రాయం..

గ‌త ఎన్నిక‌ల్లో ఆయా పార్టీల త‌రుపున ప్ర‌చారం చేసిన పాపానికేగా., వారు చేస్తున్న త‌ప్పుల్ని ప్ర‌జాకోర్టులో నిర్భ‌యంగా ఎత్తిచూపుతున్నారు.. లోక‌మంతా గ‌మ‌నించిన ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌లేని మీరు ఓ పాత్రికేయం అన్న ప‌దాన్నే మార్చేశారు.. క‌వ‌ర్ బ‌రువు పెరిగినా., నిజానికీ.. అబ‌ద్దానికీ మ‌ధ్య వ్య‌త్యాసం చాలా ఉందన్న విష‌యం గ‌మ‌నించాలి మ‌రి.. మీరు చెప్పిన‌ట్టు జ‌రుగుతున్న ప్ర‌తి ప‌రిణామాన్ని జ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నారు జాగ్ర‌త్త‌.. ఇక హెరాల్డ్ వెబ్ ఓన‌ర్స్ కూడా ఇలాంటి వారిపై ఓ క‌న్నేయ‌గ‌లిగితే మంచిది.. లేక‌పోతే సంపాదించుకున్న పేరు మొత్తం., నీరుగారిపోతుంది.. పెయిడ్ ఆర్టిస్టుల‌తో జ‌ర‌బ‌ద్రం..

Share This:

2,216 views

About Syamkumar Lebaka

Check Also

ఈ ఎన్నిక‌లు పార‌ద‌ర్శ‌క‌మేనా.? పార్టీ కామ‌న్ సింబ‌ల్ ఇండిపెండెంట్‌కి ఇస్తారా.?

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తీరు ప‌ట్ల స‌ర్వ‌త్ర అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. అయితే అనుమానాల్ని నివృత్తి చేసే ప్ర‌య‌త్నాలు మాత్రం …

2 comments

  1. Kalyan gari gurinchi matlademundu anni telusukuni matladandi,ayana chesina manchi panulu chalane unnai……

  2. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక హక్కు ఈ దిక్కుమాలిన పార్టీలకు లేవు పవన్ కళ్యాణ్ సినిమాలను అడ్డుకోవడం అంటే jr N.TR సినిమాలను అడ్డుకున్నంత ఈజీ కాదు ,, ఆ ప్రయత్నం చేస్తే అక్కడ నుంచే వారి పతనం మొదలై అధ పాతాళానికి దిగజారిపోతోంది . నోట్ల రద్దు చేస్తే బ్యాంక్ క్యూ లైన్లో నుంచిని నగదు తీసుకున్న ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ .. నేను ఇంకా ఏ రాజకీయ పార్టీ ప్రెసిడెంట్ ని ఆలా చూడలేదు .. ఈ దిక్కుమాలిని రాజకీయ నాయకులూ బెండు తీయాలంటే వెంటనే జన సేన సేనాని రాజకీయ పార్టీలు విరాళాలను ముందు క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ చెయ్యాలని , రాజకీయ పార్టీలను RTI పరిధి లోకి రావాలని నిననాదం ఎత్తుకుని సంచలనం సృష్టించాలి అని కోరుకుంటున్నా . 100% లిటరసీ సాధించకుండా ప్రజలను క్యాష్ లెస్ ట్రాన్సాక్షషన్ వైపుకు మళ్ళాలి అని చెప్తున్నా పార్టీలకు బెండు తీసినట్లు అవుతుంది .. ముందు రాజకీయ పార్టీల విరాళాలు క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ చేసి తరువాత ప్రజల లో 100% లిటరసీ సాధించి తరువాత ప్రజలను క్యాష్ లెస్ ట్రాన్సాక్షషన్ వైపుకు మళ్లాలని అడగమని జన సేనాని సంచలన నిర్ణయం ప్రకటించాలని కోరుకుంటున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × four =