Home / జన సేన / నేనుసైతం జనసేనుడి కవాతు కోసం ఒక్క రోజుని ధార పోస్తాను.. ఛ‌లో ధ‌వ‌ళేశ్వ‌రం అంటున్న మ‌హాసేన‌..!!!

నేనుసైతం జనసేనుడి కవాతు కోసం ఒక్క రోజుని ధార పోస్తాను.. ఛ‌లో ధ‌వ‌ళేశ్వ‌రం అంటున్న మ‌హాసేన‌..!!!

పాలకుల పల్లకీలు మోస్తున్నది మనం. వారికి గొడ్డు చాకిరి చేస్తున్నది మనం. చాకిరేవు పెడుతున్నది మనం. వారికి గుడ్డలు, చెప్పులు కుట్టేది మనం. వారు చస్తే పార్థివ దేహానికి కడకంటూ కాలేవరకు కాపలాగా ఉండేది మనం. కానీ మన బాధితుల కన్నీటి గాధలు పాలకులకి, వారి దుష్టపరివారానికి ఎందుకు ప‌ట్ట‌వు..? అందుకే.. మేమున్నాం అంటూ ప్ర‌తి గొంతుకా., ప్ర‌తి సామాన్య గొంతుకా త‌న ఉనికిని చాటుకునేందుకు.. పవన్ ప్రపంచం-పవన్ ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం కవాతుకు..

బాధితుల ఆక్రందనలు వినడంకోసం, పేదవాడి ఆకలి తీర్చడంకోసం, అణచివేయబడ్డ వర్గాల దీనావస్థలను పార‌ద్రోల‌డం కోసం.., అన్నివర్గాలు.. కులాల‌పై ఒక‌టి రెండు వ‌ర్గాలు.. ఒక‌టి రెండు కుటుంబాలు చేస్తున్న ధౌర్జ‌న్యాన్ని.. దోపిడిని నిరోధిద్దాం.. ప‌దిండి ముందుకు.. ప‌దండి తోసుకు..పోదాం..పోదాం.. క‌వాతుకి..

నేనుసైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతి ఇచ్చాను, నేనుసైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారాపోసాను అంటూ వస్తున్న జనసేనుడితో కదం తొక్కుతూ పదం పాడుతూ కవాతు కోసం జనశ్రేణుల వెంట‌.. జ‌న‌సేన‌ల‌ వెంట పోదాం..పోదాం.. క‌వాతుకి..

కుదిరితే జనసేనునితో క‌ల‌సి ప‌రిగెడుదాం.. కుద‌ర‌క‌పోతే వెంట పడి.. పాల‌కుల కంట ప‌డి న‌డుద్దాం..అదీ చేతకాకపోతే మార్పుకోసం వస్తున్న జనసేనుడి వెంట పాకుతూ అయినా పోదాం.. అంతేకానీ భ్రష్టాలుకి..దుష్టుల‌కి.. దోపిడీ దారులకి పల్లకీలు మోస్తూ మాత్రము ఉండం. ప‌తితులారా, భ్ర‌ష్టులారా, బాధా సర్పధస్థులారా ఏడవకండి.. ఏడవకండి.. ఏడవకండి. మీ బాధలు, మీ గాధలు నేను ఎరుగుదను అంటూ వస్తున్నాయి వస్తున్నాయి జనసేనుని ర‌థ‌చ‌క్రాలు.. ఇవి న‌వ‌త‌ర‌పు రాజ‌కీయ వేదిక నిర్మాణ చ‌క్రాలు.. అవే జ‌గ‌న్నాథ ర‌థ‌ఛ‌క్రాలు.. క‌వాతు కోసం క‌ద‌లి వ‌స్తున్నాయ‌విగో.. ప‌దిండి ముందుకు.. ప‌దండి తోసుకు..పోదాం..పోదాం.. క‌వాతుకి..

దోపిడీదారులు, భ్రష్టాచారులు, పాతుకుపోయిన నిరంకుశ పాలకులు, విలువలులేని ప్రచార సాధనాల అధిపతులు, గతి తప్పిన వారి అంనుంగ పరివారము, జనసేనుని రథ చక్రాల కింద నలిగిపోవడం ఖాయం. ఇదినిజం. ఈ లోకం మన దేనండి. మీ రాజ్యం మీరు ఏలండి. మీ స్వప్నం నిజమవుతుంది. మీ స్వర్గం రుజువు అవుతుంది.. అడుగు వేయండి.. ముందుకి.. ఒక్క క్ష‌ణం ఆలోచించండి..!! తరాలు మారుతున్నా మీ త‌ల‌రాత‌లు మారేదెన్న‌టికి..? ఇంకెన్నాళ్లీ పల్లకీ మోత..? ప‌దిండి ముందుకు.. ప‌దండి తోసుకు..పోదాం..పోదాం.. క‌వాతుకి..

Share This:

1,983 views

About Syamkumar Lebaka

Check Also

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్ని దారులు అటువైపే.. తారా స్థాయికి ప్ర‌వాసగ‌ర్జ‌న హీట్‌..!!!

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అల‌జ‌డి మొద‌లైంది.. డ‌ల్లాస్ వేదిక‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌ర్జన‌కి ముహుర్తం ఖ‌రారైన రోజునే ఆ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × two =