Home / పవన్ టుడే / ”నేను శైల‌జ‌” హీరోయిన్‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ప‌వ‌ర్‌స్టార్‌ మూవీలో ఛాన్స్‌.

”నేను శైల‌జ‌” హీరోయిన్‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ప‌వ‌ర్‌స్టార్‌ మూవీలో ఛాన్స్‌.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌-మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌ల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ అంటే., దానికున్న క్రేజీయే వేరు.. ఇండ‌స్ట్రీలో ప్ర‌తి ఆర్టిస్టు ఏదో ఒక మూల ఆ చిత్రంలో క‌న‌బ‌డితే చాలు అని కోరుకుంటారు.. మ‌రి అలాంటి క్రేజీ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ రావ‌డం అంటే మాములు విష‌యం కాదు.. సింగిల్ టేక్‌లో ఆ ఛాన్స్ కొట్టేసింది ”నేను శైల‌జా” ఫేం కీర్తి సురేష్‌.. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టించ‌నున్న ఇద్ద‌రు హీరోయిన్ల‌లో ఒక బెర్త్‌ని తాను ఖాయం చేసేసుకుంది..
ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ప్ర‌క‌టించింది.. ప్ర‌స్తుతం భైర‌వ‌, నేను లోక‌ల్ చిత్రాల్లో న‌టిస్తున్న కీర్తి సురేష్‌., ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్‌ల చిత్రంలో అవ‌కాశం వ‌చ్చేసిందంటూ త‌న ఆనందాన్ని ఫాలోవ‌ర్స్‌తో పంచుకున్నారు.. డిసెంబ‌ర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుండ‌గా., ప్ర‌ధాన తారాగ‌ణం ఎంపిక కొన‌సాగుతోంది.. ఈ క్రేజీ మూవీకి కొల‌వెరి అనిరుధ్ సంగీతం స‌మ‌కూర్చ‌నున్నారు..

Share This:

679 views

About Syamkumar Lebaka

Check Also

రామ‌చంద్ర‌పురం జ‌న‌సేనాని పోరాట‌యాత్ర.. ప‌బ్లిక్ మీటింగ్ ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్‌..

పాల‌కుల‌కీ-ప్ర‌జా నాయ‌కుడికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎంత అంటే., అవి రెండు ఎప్ప‌టికీ క‌ల‌వ‌ని రైలు ప‌ట్టాలే.. పాల‌కుల‌కి నిర్ధేశించిన అస‌లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven − five =