Home / పవన్ టుడే / న‌రేష్‌, కృష్ణ‌లను ప‌రామ‌ర్శించిన‌ జ‌న‌సేనాని.. విజ‌య‌నిర్మ‌ల‌కు నివాళి..

న‌రేష్‌, కృష్ణ‌లను ప‌రామ‌ర్శించిన‌ జ‌న‌సేనాని.. విజ‌య‌నిర్మ‌ల‌కు నివాళి..

ప్ర‌ముఖ న‌టి, ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల మృతి యావ‌త్ తెలుగు సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.. ఆమె మృతి వార్త విన్న వెంట‌నే భ‌ర్త సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, కుమారుడు న‌రేష్‌ల‌కు సానుభూతి తెలియ‌ప‌రుస్తూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంది వ్య‌క్తం చేసిన ఆయ‌న‌., న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా విజ‌య‌నిర్మ‌ల సాధించిన విజ‌యాల‌ను ప్ర‌స్థావించారు.. ద‌ర్శక‌త్వ విభాగంలో మ‌హిళ‌ల ప్ర‌వేశానికి ఆమెను స్ఫూర్తిగా కొనియాడారు.. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్ధించారు..

అనంత‌రం విజ‌య‌నిర్మ‌ల ఇంటికి వెళ్లి ఆమె భౌతిక ఖాయానికి నివాళులు అర్పించారు.. న‌రేష్‌, కృష్ణ‌ను ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ఆమె ఆక‌శ్మిక మ‌ర‌ణానికి కార‌ణాల‌పై ఆరా తీశారు.. సీనియ‌న్ హీరో సూప‌ర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య ప‌రిస్థితిని స్వ‌యంగా ఆయ‌న్నే అడిగి తెలుసుకున్నారు.. చాలా సేపు కృష్ణ‌, న‌రేష్‌ల‌తో కూర్చుని మాట్లాడిన ప‌వ‌న్‌, వారికి ధైర్యం చెప్పారు..

Share This:

347 views

About Syamkumar Lebaka

Check Also

విలువ‌ల‌తో కూడిన పోరాటం చేశాం.. ఓడినా త‌లెత్తుకు తిరుగుతున్నాం- తానాలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

విలువ‌ల‌తో కూడిర రాజ‌కీయాలు చేశాం.. అందుకే ఓడినా గ‌ర్వంగా ఉంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.. తాను రాజ‌కీయాల్లోకి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two − 2 =