Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / న‌ల్ల‌ధ‌నం తెల్ల‌గా మార‌లా.. కొత్త‌గా మారిందంతే- నోట్ల ర‌ద్దుపై జ‌న‌సేనాని విసుర్లు..

న‌ల్ల‌ధ‌నం తెల్ల‌గా మార‌లా.. కొత్త‌గా మారిందంతే- నోట్ల ర‌ద్దుపై జ‌న‌సేనాని విసుర్లు..

capture capture1

కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరుగుతున్న జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ డిమోనిటైజేష‌న్‌పై కాస్తా ఘాటుగానే స్పందించారు.. రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్‌., ఆయ‌న్ని ఈ ప‌నికి పుర‌మాయించిన ఆయ‌న బాస్ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.. క‌ర్నూల్లో డ‌బ్బు కోసం క్యూ లైన్లో నిల‌బ‌డి ప్రాణాలు విడిచిన బాల‌రాజుతో మోద‌లు పెట్టి., అంద‌రి తుప్పు వ‌దల‌గొట్టారు.. బాల‌రాజు లాంటి ఎంతో మంది బ్యాంకుల ఎదుట ప‌డిగాపుల కాచి., కాచి ప్రాణాలు కోల్పోవ‌డానికి ఉర్జిత్ ప‌టేల్ అద్భుత‌మైన మేధ‌స్సునుంచి జ‌నించిన డిమోనిటైజేష‌నే కార‌ణ‌మ‌ని మండిప‌డ్డారు.. 69 ఏళ్ల స్వ‌తంత్ర భార‌తంలో మాన‌వ‌త్వానికి మ‌చ్చ‌గా నిలిచే మాన్యువ‌ల్ స్కేవెంజింగ్‌( మ‌ల‌విస‌ర్జ‌న శాల‌ల్ని శ‌భ్ర‌ప‌ర్చుట‌)ను ఇంకా రూపుమాప‌లేక‌పోయాం.. అలాంటి భార‌తావ‌నిలో క్యాష్ లెస్ ఎకాన‌మీ ఎలా సాధ్య‌మో చెప్పాల‌ని జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ డిమాండ్ చేశారు..

capture2 capture4

మీరు ఏదైతే తెలివిగ‌ల నిర్ణ‌యం అనిచంక‌లు గుద్దుకుంటున్నారో., ఆ అనాలోచిత నిర్ణ‌యం ఎంతో మంది పేద‌ల జీవితాల‌ను నాశ‌నం చేసింద‌ని., మ‌రెంతో మందిని ఇబ్బందులపాలు చేసింద‌ని ప‌వ‌న్ ఆరోపించారు.. ఇందులో రైతులు, కూలీలు, చిరువ్యాపారులు, కాంట్రాక్ట్ లేబ‌ర్ లాంటి లిస్టు చాలా ఉంద‌న్నారు.. నిరుపేద‌లు, నిస్స‌హాయులు, అమాయ‌కులైన దేశ ప్ర‌జ‌లు నిత్యం క్యూల్లో కూల‌బ‌డుతుంటే.. దేశాన్ని దోచుకున్న‌, నాశ‌నం చేసిన దుర్మార్గులు మాత్రం ఇంట్లో కూర్చుని డ‌బ్బుని మార్చేసుకున్నారని మండిప‌డ్డారు.. ఏం జ‌రిగినా., సామాన్య జ‌నం ఏమైపోయినా మిస్ట‌ర్ ఉర్జిత్ ప‌టేల్ నువ్వు మాత్రం హ్యాపీగా ఉండుంటావు.. నీ లెక్క‌ల ప్ర‌కారం 86 శాతం డ‌బ్బు బ్యాంకుల్లో డిపాజిట్ అయిపోయింది కాబ‌ట్టి.. బ్లాక్ పోయింది అని నువ్వు ఘ‌నంగా చెప్పుకోను కూడా ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని జ‌న‌సేనాని ఎద్దేవా చేశారు.. ఇక్క‌డ జ‌రిగిందేంటో తెలుసా మీరు కేవ‌లం పాత నోట్ల‌ని కొత్త‌గా మార్చ‌గ‌లిగారంతే.. న‌ల్ల‌ధ‌నం., తెల్ల‌గా మాత్రం మార‌లేద‌ని తేల్చిచెప్పారు..

capture5capture6

ఇక్క‌డ ఇంకో ట్విస్ట్ కూడా ఉంద‌ని., మీరుభావిస్తున్న అక్ర‌మార్కుల‌ జాబితాలో కొత్త‌గా ప‌ర్సంటేజ్‌లు తీసుకుని డ‌బ్బు మార్చిన బ్యాంకు ఉద్యోగులు కూడా చేరిపోయార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు..

ఇక్క‌డ త‌న‌కు న‌సీమ్ నికోల‌స్ త‌లేబ్ పుస్త‌కంలోని ఓ కోట్ గుర్తుకువ‌స్తోంద‌ని., మీకు తెలిసింది.. తెలుస‌నుకుంటున్న‌దానికీ మ‌ధ్య వ్య‌త్యాసం ఎక్కువైతే., ఇలాంటి అతిపెద్ద వైఫ‌ల్యాల‌ను చ‌విచూడాల్సి వ‌స్తుంద‌ని ప‌వ‌న్ సూచించారు.. ఫైన‌ల్‌గా మీ నిర్వాకం వ‌ల్ల ఎంతో మంది ప్రాణాలు పోయాయి., ఇంకా ఎంతో మందిని నిస్స‌హాయుల‌య్యారు.. మిస్ట‌ర్ ఊర్జిత్ మీరు.. మీకు ఈ ప‌ని పుర‌మాయించిన బాస్‌లు హ్యాపీ.. ప్ర‌శాంత‌గా నిద్ర‌పొండి.. అంటూ దుమ్మెత్తిపోశారు..

మీ విధానాల‌పై త‌న ఈ పోరాటం ఇవాల్టితో ఆగేది కాదంటూ ఓ హెచ్చ‌రిక‌తో ఈ ట్వీట్‌ను ముగించారు..

Share This:

1,248 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 3 =