Home / జన సేన / న‌వ‌రాత్రి దీక్ష స్వీక‌రించిన జ‌న‌సేనాని.. భ‌ద్ర‌కాళీ స‌మేత వీరేశ్వ‌రుడి ద‌ర్శ‌నం..

న‌వ‌రాత్రి దీక్ష స్వీక‌రించిన జ‌న‌సేనాని.. భ‌ద్ర‌కాళీ స‌మేత వీరేశ్వ‌రుడి ద‌ర్శ‌నం..

 

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్బంగా అమ్మ‌వారి దీక్ష స్వీక‌రించారు. పోరాట యాత్ర‌లో భాగంగా పోల‌వ‌రంలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌, బుధ‌వారం న‌వ‌రాత్రుల ప్రారంభం రోజున దైవ ద‌ర్శ‌నం అనంత‌రం.. ఈ దీక్ష‌ని స్వీక‌రించారు.. విజ‌య‌ద‌శ‌మి వ‌ర‌కు తొమ్మిది రోజుల పాటు ఆయ‌న దీక్ష‌లో ఉంటారు. ప‌ట్టిసీమ స‌మీపంలో గోదావ‌రి న‌దీ గ‌ర్బాన వెల‌సిన చారిత్రాత్మ‌క భ‌ద్ర‌కాళీ స‌మేత వీరేశ్వ‌ర స్వామిని జ‌న‌సేనుడు ద‌ర్శించుకున్నారు.. 1400 ఏళ్ల క్రితం నిర్మిత‌మైన ఈ ఆల‌యంలో స్వామి, అమ్మ‌వార్లు రెండు యుగాల క్రిత‌మే స్వ‌యంభువుగా వెల‌సిన‌ట్టు చారిత్ర‌క ఆధారాలు చెబుతున్నాయి.. పోల‌వ‌రంలో ఆయ‌న బ‌స చేసి ప్రాంతం నుంచి లాంచీలో గోదావ‌రి దాటి వెళ్లిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, అక్క‌డి నుంచి కాలి న‌డ‌క మార్గం ద్వారా ఆల‌యానికి చేరుకున్నారు.. లాంచీ దిగిన ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న‌కి మేళ‌తాళాల‌తో ఆల‌య పూజారులు, సిబ్బంది స్వాగ‌తం ప‌లికారు.. వీరేశ్వ‌ర స్వ‌రూప‌మైన‌ మ‌హాశివుడికి, శ‌క్తి స్వ‌రూపిణిగా వెల‌సిన అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన అనంత‌రం ఆయ‌న ఉప‌వాస దీక్ష‌ని స్వీక‌రించారు.. లింగాకారుడికి అభిషేకం, అమ్మ‌వారికి కుంకుమార్చ‌న‌ల‌తో పాటు క్షేత్ర‌పాల‌క పూజ‌, న‌వ‌గ్ర‌హ పూజ కూడా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పూర్తి భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో నిర్వ‌హించారు..

ఏటా ద‌స‌రా న‌వ‌రాత్రుల ప్రారంభానికి ముందు నుంచే చాతుర్మాస్య దీక్ష చేప‌ట్టే ఆయ‌న‌, 45 రోజుల పాటు క‌ఠిన ఉప‌వాస దీక్షలో ఉండేవారు. అయితే పోరాట యాత్ర నేప‌ధ్యంలో జ‌న‌సేన అధినేత‌, స‌మ‌యాన్ని 9 రోజుల‌కి కుదించుకున్నారు. ఈ తొమ్మ‌ది రోజులు పాలు, ప‌ళ్లు మాత్ర‌మే ఆయ‌న స్వీక‌రిస్తారు.. దీక్షా స‌మ‌యంలో ప‌వ‌న్ ఎలాంటి ఘ‌నాహారం స్వీక‌రించే వారు కాదు. అయితే పోరాట యాత్ర నేప‌ధ్యంలో బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌సంగించాల్సి ఉండ‌డంతో పాటు రాజ‌మండ్రి క‌వాతుకి సిద్ధ‌మ‌వుతున్న ఆయ‌న‌, ప‌ళ్లు కూడా స్వీక‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.. దీక్ష చేప‌ట్ట‌డం వ‌ల్ల ఎంతో మాన‌సిక ప్ర‌శాంత‌త ఏర్ప‌డ‌డంతో పాటు చెడు ఆలోచ‌న‌లు తొల‌గి, మంచి ఆలోచ‌న‌లు వ‌స్తాయ‌న్న‌ది ఆయ‌న న‌మ్మ‌కం..

Share This:

1,040 views

About Syamkumar Lebaka

Check Also

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్ని దారులు అటువైపే.. తారా స్థాయికి ప్ర‌వాసగ‌ర్జ‌న హీట్‌..!!!

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అల‌జ‌డి మొద‌లైంది.. డ‌ల్లాస్ వేదిక‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌ర్జన‌కి ముహుర్తం ఖ‌రారైన రోజునే ఆ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ten − 5 =