Home / పెన్ పోటు / పవన్’పై కోపంతో ఈ రౌడీ ద‌ర్బారుల పోష‌నేల..? ప‌చ్చ పాలకులారా.. ఇది మీకు త‌గునా..!!

పవన్’పై కోపంతో ఈ రౌడీ ద‌ర్బారుల పోష‌నేల..? ప‌చ్చ పాలకులారా.. ఇది మీకు త‌గునా..!!

నేను తలుచుకుంటే పవన్ కళ్యాణ్ దెందులూరులో అడుగుపెట్టలేడు అని దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ మీడియా సాక్షిగా అనడాన్ని ప్రభుత్వం ఖండించలేకపోతుంది.. కానీ రౌడీ రాజకీయాలపై జనసేనుడు చేసిన విమర్శలను తిప్పికొట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తున్నట్టు కనపడుతోంది. ప్రభాకర్’గాని, బోండా ఉమ గాని తెలుగుదేశం అధికార ప్రతినిధులు గాని రౌడీ రాజకీయాలపై ఇస్తున్న సమాధానాలు పరిశీలిద్దాము. చూస్తుంటే, దేశములోని సమస్యలు అన్నీ పరిష్కారం అయ్యే వరకు, మా రౌడీ దర్బారులను ప్రశ్నించకూడదు అంటున్నారు. ఇదా ఒక అధికార పార్టీ స్టాండ్..!!

• స్థానిక కానిస్టేబుల్’గాని, హమాలీ గాని తప్పుచేశారు కాబట్టి కొట్టాను అని మీడియా సాక్షిగా ప్రభాకర్ చెప్పారు.. ప్రజాప్రతినిధులే (అధికార పార్టీ ఎమ్మెల్యేలే) తప్పు చేస్తున్నారు అని చట్టాన్ని చేతిలోకి తీసికొని ప్రజలను, అధికారులను కొట్టడం.. తప్పు కాదా? ఇది ప్రజాస్వామ్యమా లేక నిరంకుశత్వమా అనే వారికి అధికార పార్టీ ఏమి చెబుతుంది? అటువంటి ఎమ్మెల్యేలను ప్రభుత్వము సమర్ధించడం రౌడీ దర్బారులను సమర్ధించడం కాదా.!

• నీకు దమ్ము ఉంటే నా మీద పోటీ చేయి అని ప్రభాకర్ అంటే దానికి తెలుగు దేశం పార్టీ సమర్ధిస్తూ మాట్లాడం విడ్డూరంగా ఉంది.. రేపు ఎవరో బుడ్డోడు వచ్చి నీకు దమ్ము ఉంటే నా మీద పోటీ చేయి అని ముఖ్యమంత్రిని అంటే, అప్పుడు బాబు కుప్పం వదిలి వచ్చి ఆ బుడ్డోడి మీద పోటీచేయాలా..? ఇదెక్కడి సిద్దాంతము. ఇటువంటి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ ఎందుకు సమర్ధిస్తుంది..

• ప్రభాకర్‌పై 99 టీవీలో “రౌడీ” అని ప్రచారము చేయడం వల్ల ప్రభాకర్ కుటుంబ సభ్యులు బాధపడ్డారు.. అని దేశం పార్టీ గగ్గోలు పెడుతుంది. కేసులు ఉన్న మీ ప్రభాకర్’కే అంత భాధ ఉంటే, పవన్ ఆయన తల్లిపై నెలలు తరబడి మీ అనుకూల ఛానెళ్లలో చేసిన ప్రచారము వల్ల పవన్ కళ్యణ్ ఎంత బాధ పడి ఉంటాడు. అందరి బాధ ఒక్కటే అని తెలుగుదేశం గ్రహించేదెప్పుడు..?

• ప్రభాకర్ రౌడీయిజం 2014లో ఒప్పందం పెట్టుకొన్నపుడు కనపడలేదా అని బోండా ఉమా అంటున్నాడు. వీధి రౌడీలు, పల్లె గుండాలని లిస్టులు తెచ్చికొని పరిశీలించిన తరువాత మాత్రమే పార్టీలు ఒప్పందాలు పెట్టుకోవు.. ఏ పార్టీ అయినా, మరొక పార్టీ నాయకుడితో పై లెవెల్’లో పొత్తు పెట్టుకొంటాయి.. ఆ రోజున మీకు తప్ప ఎవరికీ మద్దతు ఇవ్వలేని స్థితిలో తెలుగు తల్లి నడి రోడ్ మీద పడి ఉన్నది. అయినా ఆ రోజు మీ తప్పులు ఎత్తకపోతే ఇంక ఎప్పుడు విమర్శించకూడదా? ఈ రూలు ఏ రాజ్యంగంలో ఉన్నది?                                              Advertisement.

• దేశంలో రాఫెల్ కుంభకోణం, జగన్ అక్రమ ఆస్తుల కేసులు ఉండగా మా రౌడీ దర్బారులపై ఆరోపణలు చేయడమా అని ఉమ అంటున్నాడు.. అయినా రఫెల్ కుంభకోణం రక్షణశాఖలో జరిగింది అని ఆరోపణ. రక్షణ శాఖ మంత్రిగారి భర్త (ప్రభాకర్), మన తెలుగు దేశం ప్రభుత్వ సలహాదారు. మీ ప్రభుత్వ, పార్టీ సలహారు అయిన ప్రభాకర్’ ని అడగమనండి. సింపుల్. అంతేగాని మీ బంధుత్వాలను దాచేసి పవన్ కళ్యాణ్ మీద నెపం వేయడము తప్పు కదా?

• ఇక జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల గొడవ. నాలుగు సంవత్సరాలుగా అధికారములో ఉన్న తెలుగుదేశం ఏమి చేయగలిగింది.. అధికారంలో ఉన్న తెలుగుదేశమే ఏమి చేయలేక పోతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి చేస్తాడు.. అయినా దేశములో ఉన్న అన్ని స్కాములు, కేసులు పోయేవరకు మీ రౌడీ దర్బారులపై ఎవరు మాట్లాడ‌కూడ‌దు అనడం పచ్చ రాజ్యంగంలో ఉన్నదా లేక భారత రాజ్యంగంలో ఉందా అనేది బోండా ఉమనే చెప్పాలి..

నేటి ప్రభుత్వములో రౌడీ దర్బారులు విచ్చాల విడి వ్య‌వ‌హారంగా మారిపోయింది అన్న విష‌యం జగమెరిగిన సత్యం.. అందునా పవన్ కళ్యాణ్ ప్రచారం ద్వారా అది పల్లె పల్లెకి పాకేసింది.. ఇటువంటి తరుణంలో అటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తులకు ప్రభుత్వాలు మద్దతునిచ్చి బురదని వంటినిండా రాసుకోవడం తెలివైన పని కాదు.. ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు చేప‌ట్టాలి..

శిశిపాలుడ్ని నూరవ తప్పు చేసినప్పుడే ఎందుకు చంపాలి.. అంతకు ముందు ఎందుకు ప్రశ్నించలేదు అనే వితండవాదం చేస్తూ ఉంటే పోయేది శిశిపాలుడి తల అనేది ప‌చ్చ‌ పార్టీ గ్రహించాలి.. ఆ శిశుపాలుడి తలకాయ శ్రీ కృష్ణుడి చేతిలో పోయినట్లే నేడు తెలుగు దేశం పరువు నేటి సోషల్ మీడియా చేతిలో పోతుంది. వచ్చేది ఎన్నికలు సమయం. పచ్చ మీడియాకి మొగుడుగా సోషియల్ మీడియా తయారు అయింది అని గ్రహించండి అధ్యక్షా!!! రౌడీ దర్బారులకు ప్రభుత్వాల మద్దతు- మీ పార్టీకి శ్రేయస్కరం కాదు అధ్యక్షా..!!! నోట్ దిస్ పాయింట్‌..

Advertisement.

Share This:

1,742 views

About Syamkumar Lebaka

Check Also

”అజ్ఞాత‌వాసి ర‌విప్ర‌కాష్‌”ది ఎంత క్రిమిన‌ల్ మైండో చూడండి..

వెనుక‌టికి ఒక సామెత ఉంది ”చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది —— గుడిసెలు” అని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine − four =