Home / జన సేన / పాయ‌క‌రావుపేట మృతుల కుటుంబాల‌కి జ‌న‌సేనాని ఓదార్పు.. కన్నీటి పర్యంతమైన పవన్..

పాయ‌క‌రావుపేట మృతుల కుటుంబాల‌కి జ‌న‌సేనాని ఓదార్పు.. కన్నీటి పర్యంతమైన పవన్..

అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని సొంత కుటుంబ స‌భ్యులుగా స్వీక‌రించిన‌ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. అందులో ఎవ‌రి ఏం జ‌రిగినా త‌ట్ట‌కోలేరు.. తన యాత్ర‌లో, త‌న ఒంటికి ఎన్ని గాయాలైనా., కోట్లాది మంది అభిమానం ముందు ఆ బాధ ఆయ‌న‌కి ఏనాడు పెద్ద‌దిగా క‌నిపించ‌లేదు.. కానీ అభిమానులు-పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కి చిన్న గాయ‌మైనా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విల‌విల్లాడిపోతారు.. అదే పార్టీ కార్య‌క‌ర్త‌లు మృతి చెందితే ఇక జ‌న‌సేన అధినేత ప‌డే మాన‌సిక వేద‌న‌., ఆయ‌న స‌న్నిహితుల‌కే కాదు., ప్ర‌తి ఫాలోవ‌ర్‌కి తెలుసు..

ఉత్త‌రాంధ్ర పోరాట యాత్ర‌లో ఉన్న జ‌న‌సేన అధినేతకి రెండు రోజుల క్రితం అలాంటి స‌న్నివేశ‌మే ఎదురైంది.. ప‌వ‌న్ పాయ‌క‌రావుపేట వ‌స్తున్నార‌న్న వార్త విన్న స్థానిక జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, ఆయ‌న కోసం స్వాగ‌త ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ., ప్ర‌మాద‌వ‌శాత్తు విద్యుత్‌ఘాతానికి గురై ఇద్ద‌రు కార్య‌క‌ర్త‌లు మృత్యువాత ప‌డ్డారు.. మృతి చెందిన జ‌న‌సైనికులు నాగ‌రాజు, శివ‌లిద్ద‌రూ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని దైవంగా భావించి త‌మ గుండెల్లో పెట్టుకుని కొలిచే వారు.. పార్టీ కార్య‌క‌లాపాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గోనే వారు.. కార్య‌క‌ర్త‌ల మృతి విష‌యం తెలుసుకున్న జ‌న‌సేనాని, ఒక్క సారిగా షాక్‌కి గుర‌య్యారు.. తీవ్ర మ‌నోవేద‌న‌కి గుర‌య్యారు.. పార్టీ శ్రేణులు పాయ‌క‌రావుపేట‌లో క‌వాతు ఏర్పాటు చేసినా, ఆయ‌న స‌సేమిరా అన్నారు..


పాయ‌క‌రావుపేట ఎప్పుడు వెళ్లి, వారి కుటుంబాల్ని ప‌లుక‌రిద్దామా అని ఎదురు చూశారు.. పోరాట‌యాత్ర‌లో భాగంగా శుక్ర‌వారం పాయ‌క‌రావుపేట వ‌చ్చిన ఆయ‌న మొద‌ట శివ‌, నాగ‌రాజుల ఇళ్ల‌కు వెళ్లి , వారి కుటుంబాల్ని ప‌రామ‌ర్శించారు.. ఇద్ద‌రు కార్య‌క‌ర్త‌ల‌కి చిన్న చిన్న పిల్ల‌లు ఉండ‌డం చూసి., క‌న్నీటి ప‌ర్యంత మ‌య్యారు.. ఒక జ‌న‌సైనికుడికి అయితే సాంతం పొత్తిళ్ల‌లో ప‌సిబిడ్డ ఉండ‌డం ఆయ‌న్ని క‌ల‌చివేసింది.. ఆ బిడ్డ‌ని చూసి క‌న్నీటిని ఆపుకోలేక ఏడ్చేశారు..

నాగ‌రాజు, శివ‌ల‌కి నివాళులు అర్పించిన జ‌న‌సేనాని., వారి కుటుంబాల‌కి ఆర్ధిక‌సాయం కూడా చేశారు.. అయితే చేసిన సాయాన్ని ప్ర‌చారం చేసుకునే అల‌వాటు లేని జ‌న‌సేనుడు., ఎంత ఇచ్చార‌న్న విష‌యాన్ని స‌న్నిహితుల‌కి కూడా తెలియ‌కుండా గోప్యంగా ఉంచారు.. నాగ‌రాజు-శివ‌ల బిడ్డ‌ల‌కి జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చిన ప‌వ‌న్‌., వారిని చ‌దివించే బాధ్య‌త‌ను భుజాన వేసుకోనున్న‌ట్టు తెలిపారు.. ఏ సంద‌ర్బంలో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా., వారి కుటుంబాల‌కి జీవిత‌కాలం తాము అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేన పార్టీ నూత‌న కార్యాల‌యం ప్రారంభం.. ఇక్క‌డి నుంచే పాల‌నా వ్య‌వ‌హారాలు..

జ‌న‌సేన పార్టీ ప‌రిపాల‌నా కార్యాల‌యం కొత్త భ‌వ‌నానికి మారింది.. హైద‌రాబాద్ మాదాపూర్‌లోని ఓ భ‌వంతిలో నూత‌న కార్యాల‌యం ప్రారంభ‌మైంది.. శుక్ర‌వారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × four =

%d bloggers like this: