Home / జన సేన / పార్టీలుగా పోటీప‌డ‌దాం.. ప్ర‌జాస‌మ‌స్య‌ల విష‌యంలో ఒక్క‌ట‌వుదాం-జ‌న‌సేన‌

పార్టీలుగా పోటీప‌డ‌దాం.. ప్ర‌జాస‌మ‌స్య‌ల విష‌యంలో ఒక్క‌ట‌వుదాం-జ‌న‌సేన‌

జ‌న‌సేన పార్టీ పుట్టుక ల‌క్ష్యం ఏంటి అనే విష‌యం ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాటం చేసిన ప్ర‌తి సారీ బ‌హిర్గ‌త‌మ‌వుతూనే ఉంది.. తెలంగాణలో ఇంట‌ర్ విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు నిర‌స‌న‌గా అఖిల‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న పోరాట వేదిక‌పై అదే అంశం రుజువ‌య్యింది.. విద్యార్ధుల బ‌లిదానాల‌కు న్యాయం జ‌రగాల‌ని కోరుతూ అఖిల‌ప‌క్షం శ‌నివారం ఇందిరాపార్క్ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద నిర‌స‌న దీక్ష‌ల‌కు పిలుపునివ్వ‌గా., జ‌న‌సేన పార్టీ మ‌ద్ద‌తు తెలిపింది.. విద్యార్ధుల‌కు మ‌ద్ద‌తుగా తెలంగాణ‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి కూడా జ‌న‌సేన శ్రేణులు హైద‌రాబాద్‌కు వెళ్లి నిర‌స‌న దీక్ష‌లో పాల్గొన్నాయి.. అయితే పేరుకు అఖిల‌ప‌క్షం ఐక్యంగా నిర‌స‌న దీక్ష చేప‌ట్టినా., అన్ని పార్టీల నేత‌లు ఎడ‌ముఖం పెడ‌ముఖంగా మ‌మ అనిపించారు.. జ‌న‌సేన తెలంగాణ ఇన్‌ఛార్జ్ శంక‌ర్‌గౌడ్ అదే అంశాన్ని ప్ర‌స్తావిస్తూ, ప్ర‌జా స‌మ‌స్య‌లపై పోరాడే అంశంలో కూడా రాజ‌కీయాలా.? అంటూ నాయ‌కుల‌కు గ‌డ్డిపెట్టారు.. పార్టీలుగా పోటీ ప‌డినా, ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాడే అంశంలో మాత్రం ఒక్క‌టిగా ముందుకు వెళ్దామంటూ పిలుపునిచ్చి., జ‌న‌సేన ల‌క్ష్యం ఇది అంటూ మ‌రోసారి చెప్ప‌క‌నే చెప్పారు..

చ‌నిపోయిన ప్ర‌తి విద్యార్ధి కుటుంబానికి రూ.కోటి ప‌రిహారం డిమాండ్‌..
ఇక ఇంట‌ర్ ప‌రీక్షా ఫ‌లితాల్లో చోటు చేసుకున్న అవ‌క‌త‌వ‌క‌ల‌కు, విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు నైతిక‌ బాధ్య‌త వ‌హిస్తూ తెలంగాణ విద్యాశాఖ మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డిని బ‌ర్త్‌ర‌ఫ్ చేయాల‌ని కేసీఆర్ స‌ర్కారును శంక‌ర్‌గౌడ్ డిమాండ్ చేశారు.. దీంతో పాటు చ‌నిపోయిన ప్ర‌తి విద్యార్ధి కుటుంబానికి కోటి రూపాయిల ప‌రిహారం ఇవ్వాల‌ని కోరారు.. విద్యాశాఖ కార్య‌ద‌ర్శి అశోక్‌కు స‌స్పెండ్ చేయాల‌ని జ‌న‌సేన పార్టీ త‌రుపున డిమాండ్ చేశారు.. ఫెయిల్ అయిన మూడు ల‌క్ష‌ల మంది విద్యార్ధుల పేప‌ర్లు ఉచితంగా రీ వాల్యూష‌న్ జ‌రిపించాల‌ని శంక‌ర్ డిమాండ్ చేశారు.. విద్యార్ధుల‌కు, వారి కుటుంబాల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు ఎవ‌రు క‌ల‌సి వ‌చ్చినా, రాకున్నా జ‌న‌సేన పార్టీ పోరాటం చేస్తుంద‌ని., వారికి అండ‌గా నిలుస్తుంద‌ని భ‌రోసా ఇచ్చారు..

Share This:

494 views

About Syamkumar Lebaka

Check Also

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాల అనంత‌రం కృష్ణా జిల్లాకి సంబంధించి రెండు పార్ల‌మెంట్ సెగ్మెంట్‌ల ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జ్‌ల‌ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eight + 13 =