Home / జన సేన / పార్టీ కార్యాల‌యం వ‌ద్ద ముగిసిన జ‌న‌సైనికుడి సైకిల్ యాత్ర..

పార్టీ కార్యాల‌యం వ‌ద్ద ముగిసిన జ‌న‌సైనికుడి సైకిల్ యాత్ర..

fb_img_14844173511444937

ప్ర‌త్యేక హోదాపై జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేస్తున్న పోరాటానికి మ‌ద్ద‌తుగా జ‌న‌సైనికుడు ఇ.వెంక‌ట‌ర‌మ‌ణ చేప‌ట్టిన సైకిల్ యాత్ర విజ‌య‌వంతంగా ముగిసింది.. రెండు వారాల క్రితం తిరుప‌తి శ్రీవారి పాదాల సాక్షిగా మొద‌లైన ఇత‌ని సైకిల్ యాత్ర., ఆధ్యంతం ప్ర‌జ‌ల్లో , జ‌న‌సైనికుల్లో స్ఫూర్తిని నింపుతూ సాగింది..

img-20170105-wa0051 img-20170105-wa0049

నెల్లూరు, ఒంగోలు, అద్దంకి., ఇలా ప్ర‌తి మ‌జిలీలో వెంక‌ట‌ర‌మ‌ణ‌కి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.. ప్ర‌తి చోటా స‌న్మాన‌స‌త్కారాలు చేశారు.. వెంక‌ట‌ర‌మ‌ణ ఏ ల‌క్ష్యంతో అయితే సైకిల్ ఎక్కారో., అది నెర‌వేరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా దీవించారు.. వెంక‌ట‌ర‌మ‌ణ కూడా ప్ర‌త్యేక హోదా కోసం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేస్తున్న పోరాటాన్ని., హోదా ఆవ‌శ్య‌క‌త‌నూ చాటుతూ., అలుపు స‌లుపు మ‌ర‌చి త‌న యాత్ర‌ను కొన‌సాగించాడు..

fb_img_14844173954984166

సంక్రాంతి పండుగ‌రోజు వెంక‌ట‌ర‌మ‌ణ సైకిల్ యాత్ర హైద‌రాబాద్‌లోని పార్టీ కార్యాల‌యానికి చేర‌డంతో ముగిసింది.. పార్టీ కార్యాల‌యం వ‌ద్ద వెంక‌ట‌ర‌మ‌ణ‌, యాత్ర‌లో తోడుగా వ‌చ్చిన అత‌ని స్నేహితుడిన‌ని జ‌న‌సేన నాయ‌కులు సాద‌రంగా ఆహ్వానించారు.. యాత్ర వివ‌రాలు తెలుసుకున్న పార్టీ కోశాధికారి రాఘ‌వ‌య్య‌, మిడియా విభాగం హెడ్ హ‌రిప్ర‌సాద్‌, శంక‌ర్‌గౌడ్‌, మ‌హీంద‌ర్‌రెడ్డి, న‌ర‌సింహ త‌దిత‌రులు ఆ జ‌న‌సైనికుడ్ని అభినందించారు..ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా సిద్ధించే వ‌ర‌కు జ‌న‌సేనానితో క‌ల‌సి పోరాడేందుకు ప్ర‌తి జ‌న‌సైనికుడు సిద్ధంగా ఉన్నార‌ని వెంక‌ట‌ర‌మ‌ణ పార్టీ శ్రేణుల‌కి తెలిపారు.. త‌న యాత్ర విశేషాల‌ను వారితో పంచుకున్నారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

ప్ర‌జ‌ల్ని చంపే అభివృద్ది ఎవ‌రికోసం.. సోంపేట బాధితుల త‌రుపున జ‌న‌సేనుడి నిల‌దీత‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట యాత్ర రెండో రోజు ఇచ్చాపురం నుంచి సోంపేట మీదుగా ప‌లాస‌కి చేరుకుంది.. సోంపేట చిత్త‌డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × one =

%d bloggers like this: