జనసేన పోరాట యాత్రలో భాగంగా నిడదవోలు వేదికగా జరిగిన ఆ పార్టీ అధినేత బహిరంగ సభ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. అందుకు కారణం పవన్కళ్యాణ్ జనసేన పార్టీ గుర్తు పిడికిలి అని ప్రకటించడమే.. దీంతో పిడికిలి గుర్తు కేవలం పార్టీ గుర్తా..? లేక ఎన్నికల కామన్ సింబలా అన్న గందరగోళాన్ని కొంత మంది క్రియేట్ చేసి మరీ సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.. దీంతో జనసేన కార్యకర్తలు, పార్టీ అధినేత అభిమానులు గజిబిజికి గురయ్యారు.. అయితే జనసేనాని ప్రకటించిన పిడికిలి కేవలం పార్టీ చిహ్నం మాత్రమే..
ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలుతో పాటు ప్రజా సమస్యల అధ్యయనం, పోరాటం లక్ష్యాలుగా పోరాట యాత్ర మొదలుపెట్టిన పవన్కళ్యాణ్., ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనకు రెట్టించిన ఉత్సాహంతో ముందుకి కదిలారు.. కేవలం యువత మద్దతు మాత్రమే ఉందన్న అపోహల్ని పారద్రోలుతూ అప్పుడే ఓట్లు వచ్చిన వారి నుంచి 70-80 ఏళ్లే పై బడిన పండు ముసలి వాళ్ల వరకు అంతా పవనుడి పోరాటానికి ఫిదా అయిపోతున్నారు.. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీ వెంటే మేము అంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు..
ఇదంతా ఒక ఎత్తయితే కులాల ప్రస్థావన లేని రాజకీయాలు చేద్దాం రమ్మంటూ ఆయన ఇచ్చిన పిలుపుకి అన్ని వర్గాల నుంచి భారీ ఎత్తున స్పందన లభించింది.. ఉత్తారాంధ్రలోనే కుల,మతాలకి అతీతంగా కేవలం పవన్కళ్యాణ్ సిద్ధాంతాలకు, పోరాట పటిమకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి జనసేన జెండాని భుజానికి ఎక్కించేసుకున్నారు.. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకి వచ్చే \సమయానికి ఇంటెలిజెన్స్ అంచనాల్ని కూడా తల్లకిందులు చేస్తూ., అన్ని వర్గాలు ఆయన చెంతకి చేరిపోతూ వచ్చాయి.. అన్ని వర్గాలు తనవెంట నడిచేందుకు సిద్ధం కావడంతో., అందర్నీ సంఘటితం చేయాల్సిన బాధ్యతని గుర్తెరుగుతూ., ఐక్య పోరాటానికి ప్రతీక అయిన పిడికిలిని పార్టీ గుర్తుగా పవన్కళ్యాణ్ ప్రకటించారు..
పిడికిలి అంటే ఐదేళ్ల సమూహం.. ఐదు వేళ్లు ఐదు రకాలుగా ఉన్నా., అన్నింటికీ ఒక్క చోటుకి చేర్చేది పిడికిలి.. బిగిసిన ఆ పిడికిలికి ఎన్నో ఉద్యమాలు నిర్మించగల శక్తి ఉంది.. ప్రభుత్వాలని తారు మారు చేసిన బలం ఉంది.. ముఖ్యంగా జనాన్ని ఐక్యపోరాటాల వైపు నడిపిన చరిత్ర ఉంది.. అదే స్ఫూర్తిని తన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిలో నింపాలన్న లక్ష్యంతోనే పార్టీ చిహ్నంగా పిడికిలిని పవన్కళ్యాణ్ ప్రకటించారు.. ఇది ఖచ్చితంగా ఎన్నికల కామన్ సింబల్ కాదు.. భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జనసేన పార్టీ దరాఖాస్తు చేసుకున్న పక్షంలో ఎన్నికలకి ముందు ఈసీ కామన్ సింబల్ ని కేటాయిస్తుంది.. దయ చేసి పార్టీ గుర్తుని, ఎన్నికల సింబల్ అంటూ ప్రచారం చేసి పార్టీ శ్రేణులని గందరగోళానికి గురి చేయవద్దు.. మీరు గందరగోళానికి గురికావద్దు..
జనసేనకి ప్రజల్లో వస్తున్న రెస్పాన్స్ చూసి ప్రత్యర్ధులు కూడా పార్టీ శ్రేణుల్ని గందరగోళపర్చేందుకు సింబల్స్ పేరుతో కుయుక్తులు పన్నే అవకాశాలు ఉన్నాయి.. జాగ్రత్త..