Home / ఎడిటోరియల్స్ / పార్టీ పెద్ద‌ల్ని టార్గెట్ చేసిన‌.. ఈ డాక్ట‌ర్ టార్గెట్ ఏంటి..? కోవ‌ర్టుల‌కి కోప‌రేష‌నా..

పార్టీ పెద్ద‌ల్ని టార్గెట్ చేసిన‌.. ఈ డాక్ట‌ర్ టార్గెట్ ఏంటి..? కోవ‌ర్టుల‌కి కోప‌రేష‌నా..

జ‌న‌సేన పార్టీకి రోజు రోజుకీ పెగుతున్న జ‌నాద‌ర‌ణ చూసి త‌ట్టుకోలేని ప్ర‌త్య‌ర్ధుల‌., పార్టీ ప్ర‌తిష్ట‌ని దెబ్బ‌తీసేందుకు ర‌క‌ర‌కాల వ్యూహాతో ముందుకి వ‌స్తున్నారు.. అందులో ప్ర‌ధాన‌మైన‌ది ఆప‌రేష‌న్ కోవ‌ర్ట్‌.. ఇక్క‌డ కోవ‌ర్టులు అంటే కేవ‌లం నాయ‌కులు మాత్ర‌మే కాదు.. జ‌న‌సేన పార్టీ, అధినేత ల‌క్ష్యంగా వివిధ రూపాల్లో వీరు పార్టీకి చేరువ‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తారు.. మీడియా ప్ర‌తినిధుల ముసుగులో ఉన్న ప‌చ్చ చొక్కాలు ఇదే కోవ‌కి వ‌స్తాయి.. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇంట‌ర్వూ కావాల‌ని తిరుగుతూ, పార్టీ కార్య‌క‌లాపాల‌ని తెలుసుకోవడం ఇందులో ఓ వ‌ర్గానికి కేటాయించిన ప‌ని అయితే., మ‌రో వ‌ర్గం ఇంట‌ర్వూ పేరుతో పిచ్చ పిచ్చ ప్ర‌శ్న‌లు ఆయ‌న ముందుంచడం., లేక‌పోతే జ‌న‌సేనాని చెప్పిన జ‌వాబుని వ‌క్రించ‌డం లాంటి ప‌నులు చేస్తూ ఉంటారు.. త‌ద్వారా జనంలో జ‌న‌సేన ప్ర‌తిష్ట‌ని దెబ్బ తీయాల‌నేది ఆ ప‌చ్చ పాత్రికేయుల ల‌క్ష్యం.. అయితే మీడియాలో అపార అనుభ‌వం ఉన్న పార్టీ మీడియా హెడ్‌, రాజ‌కీయ కార్య‌ద‌ర్శి పి.హ‌రిప్ర‌సాద్‌., వారి జాడ‌ల్ని ముందుగానే గుర్తించి న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లకి పూనుకుంటున్నారు.. పాత్రికేయ వృత్తిలో మూడు ద‌శాబ్దాల‌కు పైగా అనుభ‌వం ఉన్న ఆయ‌నకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జ‌ర్న‌లిస్టుల్లో ఎవ‌రి జాత‌కం ఏంటి అన్న విష‌యం బాగా తెలుసు.. దీంతో ప్ర‌త్యేక వ్యూహాల‌తో వ‌చ్చిన పెయిడ్ ఆర్టిస్టులు, పాత్రికేయుల ముసుగులో ఉన్న ప‌చ్చ చొక్కాల‌కి గేటు వెలుప‌లే బ్రేకులు వేస్తున్నారు..                                                      Advertisement.

ఈ మ‌ధ్య ఇలాంటి ప్ర‌య‌త్న‌మే ఒక‌టి జ‌రిగింది. హిందుస్థాన్ టైమ్స్ ప‌త్రిక‌లో ప‌ని చేస్తున్న ఓ ప‌చ్చ చొక్కా.. ప‌క్కా ప‌చ్చ చొక్కా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇంట‌ర్వూ కోసం విఫ‌ల‌య‌త్నం చేశాడు.. ఇత‌ను ఎలా చూసినా ప‌చ్చిగా ప‌చ్చ చొక్కా.. జాతీయ మీడియా అంటూ ఇంట‌ర్వూ ఇస్తే జాతీయ స్థాయిలో పేరు వ‌స్తుందంటూ ముందుగా నేరుగా ప్ర‌య‌త్నం చేశాడు.. వీలు కాక‌పోవ‌డంతో పార్టీలోని చోటా-మోటా నాయ‌కుల‌కి మాయ మాట‌లు చెప్పి సిఫార్సు చేసే ప్ర‌య‌త్నం చేశాడు.. త‌న ప‌న్నాగాన్ని అడ్డుకున్న పార్టీ మీడియా హెడ్ పి.హరిప్ర‌సాద్‌పై పార్టీ సానుభూతి ప‌రుల ముసుగులో చ‌లామ‌ణి అవుతున్న వ్య‌క్తుల‌తో బుర‌ద చ‌ల్లించ‌డం మొద‌లు పెట్టాడు.. ఇక్క‌డ ప్ర‌త్య‌ర్ధులు త‌మ వ్యూహాల‌కి రెండు వైపులా ప‌దును పెట్టిన‌ట్టుక‌న‌బ‌డుతోంది.. అనుకున్న విధంగా ప‌ని జ‌రిగితే స‌రి., జ‌ర‌గ‌కున్నా పార్టీ పెద్ద‌ల మీద బుర‌ద‌చ‌ల్లించ‌డం ద్వారా పార్టీ శ్రేణుల్ని గంద‌ర‌గోళానికి గురిచేయ‌డం, జ‌న‌సేన అధినేత అత్యంత న‌మ్మ‌కంతో పెట్టుకున్న వారిపై అప‌న‌మ్మ‌కం క‌లిగించ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు..

ఈ డాక్ట‌ర్ ఇటా-అటా..!


మూడు రోజులుగా భీమ‌వ‌రంకి చెందిన ఓ డాక్ట‌ర్‌., మెగాస్టార్ చిరంజీకి స‌న్నిహితుడిగా చెల‌మాణి అయ్యే డాక్ట‌ర్‌.. ఈ బుర‌ద చ‌ల్లే ప‌నిని భుజా వేసుకున్నాడు.. ఇంత‌కీ ఈ డాక్ట‌ర్‌కి క‌నీసం మిడ్ వైఫ్‌కీ- న‌ర్స్‌కీ తేడా తెలుసా అంటే అనుమాన‌మే.. అంతేకాదు పీఆర్పీ హ‌యాంలో ఈయ‌న‌గారు చేసిన సిత్రాలు అన్నీ ఇన్నీ కావ‌ట‌.. చిరంజీవి స‌న్నిహితుడనే ముసుగులో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పీఆర్పీ ప‌రాభ‌వానికి కార‌ణ‌బూతుల్లో ఒక్క‌డిగా నిలిచిన చ‌రిత్ర ఈ భీమ‌వ‌రం డాక్ట‌ర్ సొంతం.. పార్టీ అధినేత స్నేహితుడ‌నే నెపంతో పార్టీ శ్రేణుల్ని ఈ డాక్ట‌రోరు ముప్పుతిప్ప‌లు పెట్టారంట‌… ఇప్పుడు ఆప‌రేష‌న్ కోవ‌ర్ట్‌లో.. ఈయ‌న‌గారు కోప‌రేష‌న్ క్యారెక్ట‌ర్ ధ‌రించారు.. విష‌యం తెలుసుకోకుండా పాత్రికేయుడి ముసుగులో వ‌చ్చిన ప‌చ్చ చొక్కా త‌రుపున పార్టీ పెద్ద‌ల‌పై ప‌చ్చి విషం క‌క్కే ప‌నిని భుజాన వేసుకున్నారు.. పైకి జ‌న‌సేన పార్టీ సానుభూతి ప‌రుడి ముసుగు వేసుకున్న ఈ భీమ‌వ‌రం డాక్ట‌ర్‌గారి పోస్టుకి ఆహా ఓహో అనే బ్యాచ్ ఒక‌టి.. వీరంతా కూడా త‌మ‌కి తాము పార్టీ మ‌ద్ద‌తుదారుల‌గా ఫీల‌య్యే వారే.. స‌ద‌రు డాక్ట‌ర్‌కి గానీ, ఈ ఆహా, ఓహో బ్యాచ్‌కి గానీ పార్టీ మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా., పార్టీ అధినేత‌కి అత్యంత న‌మ్మ‌క‌స్తులైన వ్య‌క్తుల మీద ఇలా సామాజిక మాధ్య‌మాల్లో బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నం చేయ‌రు.. పార్టీ మీద‌, పార్టీ అధినేత మీద నిజంగా ప్రేమ‌, న‌మ్మ‌కం ఉంటే., ఆయ‌న న‌మ్మిన వ్య‌క్తుల మీద మీకు కూడా న‌మ్మ‌కం ఉండాలి.. వారు ఓ చ‌ర్య తీసుకున్నారంటే., అందులో మంచి-చెడుల్ని గ్ర‌హించాలి.. ఏవ‌డో ఓ ప‌చ్చ చొక్కా చెప్పిన మాట‌ని పుక్కిట పెట్టుకుని, బ‌హిరంగంగా ఇలా పార్టీ పెద్ద‌ల మీద విషం క‌క్క‌డం క్ష‌మార్హం కాదు..

ఇంత‌కీ మీరు పార్టీకి సానుభూతి ప‌రులా., లేక ప్ర‌త్య‌ర్ధుల కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్‌కి కోప‌రేష‌న్ చేసే ద‌గా కోరులా..? అయ్యా భీమ‌వ‌రం డాక్ట‌ర్‌గారు., మీకు క‌త్తికీ-బ్లేడుకీ తేడా తెలుసో లేదో తెలియ‌దు గానీ, మీరు చెప్పిన ఆ చిన్నా-పెద్దా ప‌త్రికాధినేత‌ల్లో చాలా మంది ఆ జ‌న‌సేన మీడియా హెడ్ ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసిన వారే.. ప్రాంతీయ మీడియా విషం క‌క్కితే, జాతీయ మీడియా విషం క‌క్క‌రాద‌న్న గ్యారెంటీ ఏమైనా ఉందా..? ఆ మ‌ధ్య ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌న‌సేన అధినేత యూట‌ర్న్ తీసుకున్నారంటూ., ఆయ‌న మాట‌ని వ‌క్రీక‌రించింది ఆ జాతీయ మీడియా కాదా..? అయ్యా డాక్ట‌ర్ గారు.. మీరు పార్టీకి మేలు చేయ‌కున్నా ప‌ర్లేదు.. ఇలాంటి చవ‌క‌బారి ప్రేలాప‌న‌ల‌తో పార్టీ శ్రేణుల్ని గంద‌ర‌గోళానికి గురిచేయ‌కుండా ఉంటే అదే ప‌దివేలు.. ఇంత‌కీ ప‌చ్చ కోవ‌ర్టుని భుజాన వేసుకు వ‌చ్చిన మీ కోప‌రేష‌న్ ప‌చ్చ చొక్కాల‌కా., లేక జ‌న‌సేన పెద్ద‌ల‌కా..? ముందు ఆ విష‌యాన్ని తేల్చుకోండి..

Advertisement.

Share This:

7,071 views

About Syamkumar Lebaka

Check Also

జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులు.. గాజువాక ఖ‌ర్చు ఎంతో తెలుసా..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధులు గెలుపు కోసం కోట్ల రూపాయిలు కుమ్మ‌రించి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు నానా పాట్లు ప‌డ‌తారు.. అయితే ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 1 =