జనసేన పార్టీ.. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఓ మహోన్నత లక్ష్యంతో దీన్ని స్థాపించారు.. ఆకలితో అలమటించే ప్రతి కడుపు మంట చల్లార్చాలి.. సమస్యలతో సతమతమవుతున్న ప్రతి సామాన్యుడి పక్షాన నిలవాలి.. ఆ సమస్యల నుంచి వారిని బయటపడేయాలి.. అది ఎంత కష్టమైనా., అందుకోసం ఎవరిని ఎదిరించాల్సి వచ్చినా.. ఎదురుగా లక్ష్యమే కనబడాలి.. మూడో పాయింటు గాడితప్పిన రాజకీయ వ్యవస్థను బాగు చేయాలి.. పాలిటిక్స్‌కి కొత్త రక్తం ఎక్కించాలి.. ఈ లక్ష్యాలను చేరే క్రమంలో ఎంతటి కష్టనష్టాలు ఎదురైనా భరించడానికి సిద్ధంగా ఉండాలి.. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గ కూడాదు.. జనసేన లక్ష్యం రాజ్యాధికారం కాదు.. ప్రజాధికారం.. ప్రజలే ప్రభువులుగా మారే రోజులు రావాలి.. ఎన్నికల్లో హామీలు ఇచ్చి పబ్బం గడిచాక పత్తాలేకుండా పోయే రాజకీయాలకు చరమగీతం పాడాలి…
ఇలాంటి మహోన్నత లక్ష్యాలతో పార్టీ ప్రజల్లో మమేకమౌతున్న సమయంలో., పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన జనసేన పార్టీ అఫీషియల్ పేజీని అనుకరిస్తూ., పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన డూప్లికేట్ పేజీలు వేదికగా ఇలాంటి కార్యకలాపాలు మొదలయ్యాయి.. వాటిలో కొన్ని జనసేనాని అభిమానులతో నడుపుతున్నవి అయితే., మరికొన్ని ప్రత్యర్ధి వర్గాలు నడుపుతున్నాయి.. పార్టీ పరువు తీయడమే లక్ష్యంగా ఇలాంటివి పురుడు పోసుకున్నాయి.. ఇటీవల జనసేన పార్టీ పేరుతో ఉన్న ఓ ఫేస్బుక్ పేజీలో ఓ ప్రకటన వెలువడింది.. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో రోడ్డపై కాలం వెళ్లదీసే నిరుపేదలకి బెడ్ షీట్లు పంచడం కోసం పార్టీ శ్రేణుల నుంచి డొనేషన్లు ఆఫర్ చేయడం ఆ ప్రకటన సారాంశం.. ఇందుకు ఓ రోజు మీ మొబైల్ రీఛార్జ్ అమౌంట్‌ని దానం చేయమంటూ సదరు వ్యక్తులు అభిమానుల్ని లక్ష్యంగా చేసుకుని విజ్ఞప్తి చేశారు..
ఇక్కడ పార్టీ మంచి కోరుకునే వ్యక్తిగా మీ అందరికీ ఓ విజ్ఞప్తి.. జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇలాంటి డొనేషన్లు, పార్టీ ఫండ్లకు వ్యతిరేకి.. అలా డొనేషన్లతో పార్టీని నడిపించ దలుచుకుంటే., ఆయన ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు.. రెండో విషయం పేదలకి దుప్పట్లు పంచడం అన్న మీ లక్ష్యం మంచిదే.. మీ జేబులో ఓ వంద రూపాయిలు ఉంటే., ఒక్క బెడ్‌షీట్ కొని ఓ పేదవాడికి ఇచ్చి ఆనందించండి.. వెయ్యి ఉంటే పది మందికి న్యాయం చేయండి.. కానీ పార్టీ పేరుతో డొనేషన్లు అంటూ కలెక్షన్లు మాత్రం చేయొద్దు.. పార్టీ కోసం, ప్రజల కోసం చేసే ఎలాంటి కార్యక్రమాలకైనా చేయండి. ఉంటే ప్రజాసేవకు డబ్బు కూడా వెచ్చించండి.. కానీ ఇలా వసూళ్లు మాత్రం చేయొద్దు.. పార్టీ పేరు చెడగొట్టవద్దు.. ఇలాంటివి ప్రత్యర్ధులకి బలాన్నిస్తాయి.. ఈ ప్రకటన వెలువడిన పేజీ పార్టీ అధికారిక పేజీ కాదు.. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా., ప్రెస్ నోట్ ద్వారా గాని., పార్టీ అధినేత నేరుగా గాని ప్రకటన చేస్తారు.. జనసైన్యం కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు.. ఒక వేళ ఇది పార్టీ అభిమానులు సేవా దృక్పదంతో చేసిన పనే అయినా., దయ చేసి ఈ కథనంలోని సారాంశాన్ని అర్ధం చేసుకోగలరు..